1970లో విడుదలై సంచలన విజయం సాధించిన మేరా నామ్ జోకర్ గురించి తెలియని వారుండరు. అలాంటి లెజెండరీ క్లాసిక్ టైటిల్‌ని మరొక్కసారి దర్శకుడు సూర్యగోపాల్ పరిచయం చేస్తున్నారు. 4ఏఎమ్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సూర్యగొపాల్‌ని దర్శకుడుగా పరిచయం చేస్తూ నిర్మాతలు శివ ఎన్, ఎస్.జి.కృష్ణ, నవీన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విజయదశమి సందర్బంగా సంచలన దర్శకుడు మారుతి ఆధ్వర్యంలో పూజాకార్యక్రమాలు జరుపుకుంది. మారుతి ఈ సినిమాకి సంబంధించిన మొదటి షాట్ దేవుడు పటాలపై క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. అలాగే దర్శకుడు గోపాల్‌కి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్ మీదకి వెళ్ళనుంది.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. నా స్నేహితుడు సూర్య గొపాల్‌కి సినిమా అంటే చాలా ఇష్టం. మేరా నామ్ జోకర్ అనే టైటిలంటేనే సూపర్‌హిట్. అలాంటిది చాలా సంవత్సరాల తరువాత ఈ టైటిల్‌తో మళ్ళి సినిమా రావటం చాలా ఆనందంగా వుంది. మా గోపాల్ కి మంచి హిట్ రావాలని కొరుకుంటున్నానని తెలిపారు.
దర్శకుడు సూర్య గోపాల్ మాట్లాడుతూ.. మా సినిమా ప్రారంభానికి వచ్చిన మీడియా సోదరులందరికి థ్యాంక్స్, నేను మా మిత్రులు కలిసి 4ఏమ్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం-1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా దర్శకుడు మారుతి గారి చేతుల మీదుగా మేరా నామ్ జోకర్ టైటిల్ ఎనౌన్స్ చేయటం మా అదృష్ణంగా భావిస్తున్నాము. ఈ చిత్రంలో పాన్ ఇండియా ఆర్టిస్ట్ లు చేయనున్నారు. త్వరలో వివరాలు తెలియజేస్తాము.. అని అన్నారు
రచయిత రాజు బొనాల మాట్లాడూతూ.. మా దర్శకుడు గోపాల్ గారు ప్రతి రోజు ఉదయమే 4 గంటలకి లేచి పనిచేసుకుంటారు. అందుకేనేమో బ్యానర్ నేమ్ 4ఏఎమ్ అని పెట్టారు. ఈ చిత్రం చాలా డిఫరెంట్ గా వుంటుంది. చాలా కొత్త సబ్జక్ట్ దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి చేశాము. 24 క్రాఫ్ట్ పై కమాండ్ వున్న దర్శకుడు గోపాల్ గారు, నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది.. అని అన్నారు
బ్యానర్.. 4ఏఎమ్ మూవీమేకర్స్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం … సూర్య గోపాల్
నిర్మాతలు… శివ.ఎన్, ఎస్.జి.కృష్ణ, నవీన్