మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ‘మన శంకరవరప్రసాద్ గారు’గా సంక్రాంతికి బరిలోకి దిగారు. తన సినిమాలతో అపజయమే ఎరుగని, మంచి కామెడీ టైమింగ్ ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అంతకుమించిన కామెడీ టైమింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు, సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు తెలియడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా.. అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. సాధారణంగా మెగాస్టార్ సినిమా అంటే అంచనాలు కామన్. దానికి తోడు ప్రత్యేక పాత్రలో వెంకటేష్ తోడయ్యాడు. ఇంకేముందీ.. అంచనాలు అంబరాన్ని తాకాయి. విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో విజయం తథ్యం అని జనాలంతా గట్టిగా ఫిక్సయిపోయారు. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగానే చేయడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగలాగే వుంటుంది మరి. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా అనిల్ మూవీ సంక్రాంతికి వస్తే హిట్టే. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? మెగాస్టార్ ఖాతాలో మరో భారీ హిట్ పడిందా లేదా? అందరి అంచనాలనూ ఆయన అందుకున్నారా? దర్శకుడు అనిల్ రావిపూడి హిట్ పరంపర ఎప్పటిలాగే కొనసాగిందా? గత సంక్రాంతి మాదిరిగానే ఈ సంక్రాంతికి కూడా హిట్ కొట్టేశాడా? మెగాస్టార్ ని అనిల్ ఎలా చూపించారు? అతిథి పాత్రలో వెంకటేశ్‌ష్ ఎలాంటి మేజిక్ చేశారు? అనేది సమీక్షలో తెలుసుకుందాం..
కథ : శంకరవరప్రసాద్ (చిరంజీవి)నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) రక్షణ బాధ్యతల్ని చూస్తుంటాడు. మంత్రి కూడా శంకరవరప్రసాద్‌ని తన కుటుంబ సభ్యుడిలానే చూసుకుంటాడు. ‘నిన్ను చంపేస్తున్నాం’ అంటూ మంత్రి శర్మకు హంతకుల గ్యాంగ్ నుంచి బెదిరింపు కాల్ రావడం.. ఆయన దగ్గర పనిచేస్తున్న నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్‌వరప్రసాద్ ఆ గ్యాంగ్‌ని తుదముట్టించడంతో కథ మొదలవుతుంది. ఎప్పుడూ సరదాగా ఉండే శంకరప్రసాద్ మనసులో ఏదో బాధ ఉన్నదని గ్రహించిన మంత్రి శర్మ.. ఓ రోజు అతడిని కారణం అడగుతాడు. భార్య శశిరేఖ (నయనతార) నుంచి విడిపోయిన సంగతి తెలుసుకుని ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్న తన పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు మంత్రి. పీఈటీగా ఆ స్కూల్‌లోకి అడుగుపెట్టిన శంకరవరప్రసాద్ తన పిల్లలకు చేరువయ్యాడా? అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు? వాళ్ల పెళ్లి ఎలా జరిగింది? ఊహ తెలియని వయసులోనే తండ్రికి దూరమైన పిల్లలకు శంకరవరప్రసాదే తమ తండ్రి అనే విషయం ఎప్పుడు తెలిసింది? కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్‌మ్యాన్ వెంకీ గౌడ (వెంకటేష్)కీ, శశిరేఖకీ సంబంధం ఏమిటి? వీరి విడాకులకు గల అంత బలమైన కారణం ఏంటి? మళ్ళీ వరప్రసాద్ వారి కుటుంబంలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నారా.. లేదా? స్కూల్‌లో పీఈటీగా జాయిన్ అయిన శంకర వరప్రసాద్.. తన పిల్లలకు ఎలా చేరువయ్యాడు? అసలు శంకరప్రసాద్ భార్యతో విడిపోవడానికి కారణం ఏంటి? చివరకు ఆ కుటుంబం ఎలా కలిసింది? లాంటి విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: దూరమైన బిడ్డలను అక్కున చేర్చుకోవాలని తపనపడే ఓ తండ్రి కథ ఇది. అపార్థం చేసుకొని విడిపోయిన భార్యకు తానేంటో అర్థం కావాలని తపించే భర్త కథ. ఈ కథ చుట్టూ వినోదాన్ని మేళవించి అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చేలా జనరంజకంగా మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సాధారణంగా ఇలాంటి కథలకు లాజిక్కులు వెతక్కూడదు. ఈ సినిమాలో కూడా కొన్ని లాజిక్ లేని విషయాలున్నా.. అవి ప్రేక్షకులని అంతగా ఇబ్బందికి గురిచేయవు. కథను క్యూట్‌గా.. ఎక్కడా అనవసరపు పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ లేకుండా అర్థవంతంగా నడపడంలో దర్శకుడు మంచి నేర్పును ప్రదర్శించాడు. కథ చెప్పాలి.. కట్టిపడేయాలన్న ఆలోచన కంటే థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించాలన్న ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రథమార్ధం పాత్రల పరిచయాలు.. హీరోహీరోయిన్లు కలవడం.. విడిపోవడం.. దానికి సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో సాగింది. సమస్యలు సీరియస్‌వే అయినా.. చెప్పడం మాత్రం వినోదంగా చెప్పాడు. అనిల్ రావిపూడి సినిమాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకునే చేస్తారు అనేది అందరిలో ఉన్న నమ్మకం. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా దాదాపుగా అలాగే సాగింది. కానీ సినిమా ఒకసారి చూసిన తర్వాత మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు.. ఈసారి ఆయన మరో రెండు వర్గాలను కూడా టార్గెట్ చేసినట్లు అనిపించింది. అందులో మొదటి వర్గం మెగా ఫ్యాన్స్. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో చూడని ఎత్తులు లేవు.. కానీ ఆయనలో ఉన్న కామిక్ సెన్స్‌ని ఈ మధ్యకాలంలో వాడుకున్న దర్శకులు అస్సలు లేరు. ఒకప్పుడు వింటేజ్ చిరంజీవిలోని కామెడీని బయటకు తీసుకువచ్చిన అనిల్.. పూర్తిస్థాయిలో దాన్ని వాడుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ చెబుతున్నా, ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నా.. ఆయన మేనరిజంతోనే నవ్వించడం ఈ సినిమాకే చెల్లింది. గతేడాది ఇదే పండగకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలోనే లాజిక్‌లు, ఆలోచింపజేసే సందేశాలు, హృదయాన్ని మెలిపెట్టే భావోద్వేగాల్లాంటి అంశాల్ని పూర్తిగా పక్కన పెట్టి తన మార్క్ వినోదంతో సినిమాని చూపించారు దర్శకుడు. పండగకు వస్తున్నారు..అదిరిపోద్ది సంక్రాంతి.. అంటూ వచ్చిన ఈ సినిమా అంతే ఆహ్లాదాన్ని పంచేలా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కుటుంబ ప్రేక్షకులకు పక్కాగా పండగ సినిమా ఇది. కుటుంబ కథల్లో, కామెడీ కథల్లో ఒదిగిపోవడంలో చిరంజీవికున్న టైమింగే వేరు. మాస్ ఎలివేషన్లకు పూర్తి భిన్నంగా చిరు పక్కా ఫ్యామిలీమ్యాన్ అవతారంలో కనిపిస్తుండగా.. కేంద్రమంత్రి ఇంటి నుంచి కథ మొదలవుతుంది. తన బృందంతో కలిసి ఆరంభం నుంచే నవ్వించడం మొదలు పెడతారు చిరంజీవి. మెగాస్టార్ లోని ఒకప్పటి టైమింగ్.. ఆయన నటనలోని హుషారు.. వింటేజ్ లుక్స్‌ని మరోసారి తెరపై చూడటం ఆయన అభిమానులకు బోనస్. మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ అతిథి పాత్రలో చేసిన సందడి వాణిజ్య కోణంలో సినిమాని పరిపూర్ణంగా మార్చేసింది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో కనిపించే క్రింజ్ కామెడీ ఈ సినిమాలో లేదు. అర్థవంతంగా, హాయిగా నవ్వుకునేలా కామెడీ ఉన్నది. ప్రధాన పాత్రల మధ్య ఏర్పడే ఆయా పరిస్థితుల నుంచి పుట్టే కామెడీనే ఈ చిత్రంలో ఆద్యంతం కనిపిస్తుంది. సిట్యువేషనల్ కామెడీ కావడంతో సినిమా ఎక్కడా విసుగు రాలేదు. అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కు రప్పించడం ఆయన శైలి. కథ-కథనం కంటే.. హీరోకి ఉన్న ప్లస్ పాయింట్స్‌ని ఎలా వాడుకోవాలనేదానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే.. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు? ఎక్కడ ఏ సీన్ పెడితే నవ్వుకుంటారు? అనేది అనిల్‌కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికీ ఇదే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా అనిల్ ఆ పనే చేశాడు. దర్శకుడు అనీల్ రావిపూడి మీద ఒక మీమ్ లాంటిది ఉంటుంది. ‘నేను మీకు దొరకనురా’ అని అది నూటికి నూరుపాళ్లు నిజమే అని ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్ ని తన చేతికిచ్చి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ తీయమని ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడబెట్టి ఈ సంక్రాంతికి ఇళ్లలో చేసుకునే కలగూర తరహాలో ప్యాకెడ్ ఎంటర్టైనర్ తాను చేసి పెట్టారని చెప్పొచ్చు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ లేకుండా మంచి ఎంటర్టైనింగ్ గా వెళ్లిపోతూనే ఉంటుంది. ఇక మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ అండ్ మాస్ వైబ్స్ ని ఇందులో దర్శకుడు పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. మెగాస్టార్ స్వాగ్ గాని ఎమోషన్స్ గాని ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఇందులో అదిరిపోయాయి. అంతే కాకుండా అనిల్ రావిపూడి మార్క్ ఆసనాలు, ప్రతిజ్ఞలు లాంటివి కూడా థియేటర్స్ లో భళే పేలుతాయి. ఫస్టాఫ్ లో అయితే సాలిడ్ హిలేరియస్ సీక్వెన్స్ లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి. మీరు నవ్వుకోండి అన్నట్టు అనిల్ డిజైన్ చేసి ఆడియెన్స్ మీదకి వదిలేసారు. మరీ ముఖ్యంగా బుల్లిరాజు (మాస్టర్ రేవంత్) ఎపిసోడ్స్ అయితే మరో లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. ఇలా ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ లో కూడా సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మిగతా ఎమోషన్స్ కూడా బ్యాలన్స్డ్ గా దర్శకుడు తీసుకెళ్లిన విధానం ఇందులో ఆకట్టుకుంటుంది. ఈ కథలో విలన్ పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పాలి. చిరంజీవి సినిమాల్లో విలన్ అంటే అత్యంత శక్తిమంతుడిగా, ప్రమాదకారిగా కనిపిస్తాడు. కానీ ఈ సినిమాలో ప్రధాన విలన్ ఓ కామన్ మ్యాన్ కావడం విశేషం. అతను విలన్‌గా మారే పరిస్థితులు కూడా లాజికల్‌గానే అనిపిస్తాయి. అసలు విలన్ కామన్ మ్యాన్ అవ్వడం వల్లే ఈ కథలో ఆసక్తి ఇంకాస్త పెరిగిందనాలి. ద్వితీయార్ధం కొంతభాగం కాస్త సీరియస్ వేలో సాగినా.. చివరి కొద్ది నిమిషాలు వెంకటేష్ ఎంట్రీతో సినిమా మళ్లీ వినోదంవైపు టర్న్ తీసుకున్నది. వెంకీగౌడగా తెరపై విక్టరీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓ విధంగా ఆయన ఉన్నంతవరకూ అందర్నీ డామినేట్ చేశారు. తెరపై చిరంజీవి, వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయడం.. అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా కన్నుల పండుగ అనిపించింది. సెక్యూరిటీ, మంత్రికి ప్రాణహాని అనే అంశాలు సీరియస్‌గా అనిపించినా, తొలి ఫైట్ పూర్తి కాగానే సినిమా భార్యాభర్తల కథగా మారిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట వినిపిస్తుండగా… శంకరవరప్రసాద్, శశిరేఖ దగ్గరయ్యే సన్నివేశాలు, మూడు రాష్ట్రాలు తిరిగి మూడు ముళ్ల బంధంతో వాళ్లు ఒక్కటయ్యే వైనాన్ని సరదాగా తెరపైకి తీసుకొచ్చిన విధానం నవ్విస్తుంది. భార్యాభర్తలు విడిపోయే సన్నివేశాల్ని కూడా హాస్యభరితంగానే తెరకెక్కించారు. ముఖ్యంగా వెంకీ మామ తెరపైకి వచ్చిన తర్వాత నుంచి సినిమా ఎండింగ్ వరకు అలా పికప్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక మెగాస్టార్ అండ్ వెంకీ మామ ఇద్దరి మీద వచ్చిన ప్రతీ సీన్ హైలైట్ అంతే.. ఒకరి పాటకి ఒకరు డాన్స్ లు.. ఒకరి డైలాగ్ లు ఒకరు చెప్తూ ఉంటే ఆ ఫీల్ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇక వెంకీ మామ కూడా తన రోల్ లో చాలా హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ గా కనిపించారు. వీరితో పాటుగా నయనతార రోల్ కూడా చాలా బాగుంది. తన పాత్రలో వెయిట్ క్యారీ అవుతూ సినిమా మొత్తం వెళుతుంది. తన రోల్ లో నయన్ బాగా చేశారు. ఇక కొంచెం నెగిటివ్ అండ్ ఫన్ టచ్ లో సచిన్ ఖేడేకర్ రోల్ కూడా అనిల్ రావిపూడి మార్క్ ఎక్స్ ప్రెసెన్స్ తో వర్కౌట్ అవుతాయి. వీరితో పాటుగా క్యాథరిన్, హర్షవర్ధన్ ఇంకా అభినవ్ మెగాస్టార్ తోనే ఆద్యంతం ఉంటూ తమ పాత్రల్లో బాగా జీవించేశారు. అలాగే వారికీ చిరుకి నడుమ కామెడీ సీన్స్ ఎంటర్టైన్ చేస్తాయి. వీరితో పాటుగా నటి జరీనా వాహబ్ కూడా తనపాత్రకు పూర్తి న్యాయం చేశారు. తనకి నయన్ కి నడుమ ఓ ఎమోషనల్ సీన్ బాగుంది. వాస్తవానికి చెప్పాలంటే.. ఇది పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకునే కథ ఏమీ కాదు. విడిపోయిన భార్యను తిరిగి ఓ భర్త ఎలా కలవగలిగాడు, ఆమెను ఎలా పొందగలిగాడు.. అనే లైన్‌తో రాసుకున్నారు. దానికి లాజిక్స్ వెతకకుండా, కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే నడిపించేశారు. ఫస్టాఫ్ అంతా మెగాస్టార్ చిరంజీవి గతం, అతని ప్రేమ, పెళ్లి, విడాకులు అనే విషయాలను ల్యాగ్ లేకుండా ఎంటర్టైనింగ్ వేలో తీసుకువెళ్లిన దర్శకుడు, సెకండాఫ్‌లో కూడా చాలా వరకు ఎంటర్టైన్‌మెంట్‌తోనే నింపేశాడు. కానీ అదే సమయంలో యూత్‌ని టార్గెట్ చేసుకుని విడాకుల అంశాన్ని స్పృశించిన తీరును ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ ఎంతగా దూసుకువెళుతుందో ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. కథ స్కూల్‌కి మారడం.. అక్కడ బుల్లిరాజు చేసే హడావుడి, అడవిలో కుక్కపిల్ల కోసం వేట, అనుకోకుండా శశిరేఖ స్కూల్‌కి రావడం…ఇలా ప్రథమార్ధం అంతా సరదాగా సాగిపోతుంది. పిల్లల నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లోనే నాటకీయత ఎక్కువైనట్టు అనిపిస్తుందంతే. ద్వితీయార్ధం ఆరంభం తర్వాత కథ లేక, సన్నివేశాలు అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అంటూ సాగే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. వెంకటేష్ రాకతో మళ్లీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. కథ గురించి మరిచిపోయి చిరంజీవి, వెంకటేష్ జోడీని చూడటం మొదలుపెడతాం. ఒకరి పాటకి మరొకరు స్టెప్పులు వేయడం.. ఎమ్.ఎమ్.ఎస్ అంటూ సాగే ఫ్లాష్ బ్యాక్.. సంక్రాంతి పాటతో మాస్‌కి కావాల్సినంత సందడిని పంచుతారు. భార్యాభర్తల మధ్య సంబంధాల నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. లాజిక్స్ గురించి అసలే మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాని చూడాలి. కడుపుబ్బా నవ్వించకపోవచ్చు కానీ.. సరదాగా ఆస్వాదించేందుకు మాత్రం ఈ సినిమా లోటు చేయదు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్‌ని గట్టిగా వాడుకొని.. ఫ్యాన్స్ ఆయన్ని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాగే చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్ యాంగిల్‌ని పక్కన పెట్టలేదు. మధ్య మధ్యలో యాక్షన్ సీన్లను పెట్టి మాస్ లుక్‌ని కూడా చూపించాడు. అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. ఇక్కడ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటంటే.. ఈ సింపుల్ లైన్‌కి చిరంజీవి మేనరిజాన్ని హైలెట్ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే! ఈ మధ్య కాలంలో… ఇంకా చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలిష్‌గా, ఇంత హుషారుగా ఎవరూ చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్‌కి ఇది స్పెషల్ చిత్రమే. ఓ రౌడీ ముఠా.. హోం మంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్‌తోనే అనిల్ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్ స్టెప్ సాంగ్ వరకు కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇక వరప్రసాద్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. వరప్రసాద్- శశిరేఖల ప్రేమ.. పెళ్లి.. విడాకులకు దారీతీసిన సంఘటనలు అన్నీ నవ్వులు పూయిస్తాయి. స్కూల్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కథనం సాగుతుంది. బుల్లిరాజా (రేవంత్) ఎంట్రీతో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఇలా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ప్రతి పది నిమిషాలకు ఒక కామెడీ సీన్‌ని పెట్టి ఫస్టాఫ్ ముగించాడు. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. వీరేంద్ర పాండే పాత్ర ఎంట్రీతో మళ్లీ కథనం పుంజుకుంటుంది. కథతో సంబంధం లేకున్నా.. విడాకుల అంశంపై హీరో పాత్రతో ఓ మంచి సందేశం ఇప్పించాడు. అది కూడా కామెడీగానే చూపించినా.. సినిమా చూసిన ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తాడు. ఇక వెంకటేష్ పాత్ర ఎంట్రీతో మళ్లీ నవ్వులు స్టార్ట్ అవుతాయి. వెంకీ గౌడగా వెంకటేశ్ ఎంట్రీ నుంచి కథనం పరుగులు పెడుతుంది. చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడో అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.. తనకు కామిక్ క్యారెక్టర్ దొరికితే ఎలా రెచ్చిపోతాడో మరోసారి ప్రూవ్ చేశాడు మెగాస్టార్. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫ్ ఆడించాడు. మెగా వింటేజ్ చమక్కులు.. ఆ పంచ్ డైలాగులు.. సెల్ఫ్ సెటైర్లు.. చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కొన్ని మోడ్యులేషన్స్.. ఏ ఒక్కటి వదలకుండా స్క్రీన్ మీద దించేశాడు. ఒక్కొక్క సీనులో చిరంజీవి కామెడీ టైమింగ్ చూస్తుంటే ఘరానా మొగుడు గుర్తొచ్చింది. ఫస్టాఫ్ అయితే హిలేరియస్.. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగినట్టు అనిపిస్తుంది కానీ చివర్లో సెట్ అయిపోయింది. వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. చిన్న చిన్న సీన్స్ కూడా అనిల్ రావిపూడి రాసిన దానికంటే వంద రెట్లు ఇంప్రోవైజ్ చేశారు చిరు. సింపుల్ గా చెప్పాలంటే శంకరవరప్రసాద్ గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నారు బాస్. లుక్స్ పరంగా కూడా చిరంజీవి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు .. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ విజువల్ గా అదిరిపోయాయి. చాలా సన్నివేశాలు చిరంజీవి పాత సినిమాలు నుంచి తీసుకొని రీ క్రియేట్ చేశాడు అనిల్. మరీ ముఖ్యంగా 90 లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ రిఫరెన్స్ ఎక్కువగా ఉంది. చిరంజీవి కూడా 30 ఏళ్ల తర్వాత అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఈ తరం దర్శకులలో ఆడవాళ్ళ సైకాలజీ అనిల్ రావిపూడి కంటే ఎవరికీ బాగా తెలియదు.. సెకండ్ హాఫ్ లో వాళ్లు సైకాలజీ మీద వచ్చే ఒక సీన్ భలే ఉంది.
ఎవరెలా చేశారంటే.. శంకరవరప్రసాద్‌గా చిరంజీవి అభినయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే తనదైన యాక్షన్, కామెడీ, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని అలరించారు. సరదాగా ఉన్నప్పుడు ‘చంటాబ్బాయి’ని గుర్తు చేస్తూ.. అవసరమైనప్పుడు రౌడీ అల్లుడ్నీ, ఘరనామొగుడ్నీ యాదికి తెస్తూ.. పాటల్లో ‘కొండవీటి దొంగ’ను.. యాక్షన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ని గుర్తు చేస్తూ వింటేజ్ మెగాస్టార్ తెరపై సాక్షాత్కరించారని చెప్పక తప్పదు. మెగాస్టార్ చిరంజీవిలో పాతిక, ఇరవై ఏళ్ల క్రితం కనిపించిన మేనరిజం, కామెడీ టైమింగ్‌తో పాటు కళ్ళతోనే ఆయన నటించే తీరు ఈ సినిమాలో కీలకం. ఒకరకంగా చెప్పాలంటే టైటిల్ మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే పెట్టడమే కాదు, సినిమా మొత్తాన్ని ఆయన భుజాల మీద నడిపించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవినే. ఆయన లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగులు.. ఇవన్నీ చూస్తే ఒకప్పటి మెగాస్టార్ మన కళ్లముందు కనిపిస్తాడు. ఒకవైపు తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటూనే.. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుక్ స్టెప్ పాటకు ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్స్‌లో విజిల్స్ వేయడం గ్యారెంటీ. చిరంజీవి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి.. కానీ ఆయనకు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ వస్తే ఎలా స్క్రీన్ మీద నవ్వులు పూయిస్తాడు అనేది మన శంకరవరప్రసాద్ గారు మరోసారి నిరూపించింది. చిరును ఎలా వాడుకోవచ్చో ఈ సినిమా మళ్లీ చూపించింది. ఇక ఇందులో చిరంజీవికి సమానమైన పాత్ర నయనతారది. తెరపై అందంగా కనిపించింది. ఆ పాత్రలో ఉండే దర్పం, అభిజాత్యాన్ని అద్భుతంగా పలికించింది నయన్. ఆమె చేయడం వల్ల ఆ పాత్రకు నిండుదనం వచ్చిందని చెప్పొచ్చు. ఆమె ఎప్పటిలాగే హుందాగా నటించింది అనడం కంటే.. శశిరేఖగా జీవించింది అని చెప్పొచ్చు. ఇక సచిన్ ఖేడేకర్‌ది ఇందులో కీలకమైన పాత్ర. హీరో మామగారిగా చక్కగా నటించాడు. ఆ పాత్రకు కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. ఎప్పటిలాగే తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులంతా తమదైన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక చివరిగా వెంకటేష్ … చివరి ఇరవై నిమిషాలు ఆయన సినిమాలో కనిపిస్తారు. అప్పటివరకూ ఓ స్థాయిలో నడిచిన సినిమాను తన రాకతో పరుగులు పెట్టించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా సూపర్బ్. తను ఉన్నంతవరకూ తనే సినిమాకు హైలైట్. అందులో ఏమాత్రం సందేహం లేదు. విక్టరీ కనిపించింది కొద్దిసేపైనా, ఆ కొద్దిసేపు అందరినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు. వెంకీ గౌడ పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. చిరు-వెంకీ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటాయి. వెంకటేష్ ఉన్నది కొద్ది నిమిషాలైనా కూడా అదరగొట్టాడు. హీరో తల్లిగా జరీనా వాహబ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. నయనతారతో ఆమె చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వరప్రసాద్ టీమ్ సభ్యులుగా నటించిన కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠంతో పాటు మిగిలిన నటీనటులు ఎవరికి వాళ్లు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికి వస్తే… ఈ సినిమాకు కర్త కర్మ క్రియ దర్శకుడు అనిల్ రావిపూడి. తన బాధ్యతను వందకు వంద శాతం న్యాయం చేశాడు. చిరంజీవితో సినిమా ఎలా తీయాలో చేసి చూపించాడు. ఎక్కడా క్రింజ్ కామెడీ లేకుండా, మెగా మార్క్ స్టయిలిష్ కామెడీతో, మెగా మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో, ఎమోషన్స్‌తో ఫుల్ ప్యాక్డ్ మెగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని సంక్రాంతి బరిలో దించారాయన. చిరంజీవి, వెంకటేష్ పాత్రల్నీ ఆయన ట్యాకిల్ చేసిన తీరు మాత్రం నిజంగా అభినందనీయం. ఈ సినిమాలో అనిల్ రావిపూడి తర్వాత చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ గురించే. అతి జాగ్రత్తగా ప్రతి సీన్‌లోనూ ఎడిటర్ తీసుకున్న జాగ్రత్తలు చిరంజీవి పాత్రకు కొత్త అందాన్ని తెచ్చాయి. ఇక ఈ సినిమా ప్రధాన బలాల్లో భీమ్స్ సంగీతం ఒకటి. ప్రతి పాట జనాలకు నచ్చింది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. సమీర్‌రెడ్డి కెమెరా వర్క్ సూపర్. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. చిరంజీవి, వెంకటేష్ , నయనతారలను చాలా అందంగా చూపించారాయన. మొత్తంగా సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా సమర్థనీయంగానే ఉంది. మొత్తంగా ఆద్యంతం తనదైన కామెడీతో గిలిగింతలు పెడుతూ.. అక్కడక్కడ ఎమోషన్స్‌తో మనసుల్ని గిల్లుతూ, అవసరమైన చోటా మెగాస్టార్ గ్రేస్‌ని నేటి తరానికి పరిచయం చేస్తూ, అభిమానులకు వింటేజ్ మెగాస్టార్‌ని గుర్తు చేస్తూ.. అద్భుతంగా సినిమాను మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇది అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమా. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సినిమాకి కావాల్సిన సెటప్, ప్రొడక్షన్ డిజైన్ బాగానే చేసుకున్నారు. ఇక భీమ్స్ సాలిడ్ వర్క్ అందించాడు కొన్ని తన మార్క్ ఫోక్ సాంగ్స్ కూడా సెపరేట్ గా అందించాడు. అలాగే సాంగ్స్ ఆల్రెడీ హిట్, బాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అందించాడు. కావాల్సిన సీన్స్ ని తన స్కోర్ తో ఎలివేట్ చేసాడు. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. అలాగే ఫైట్ సీక్వెన్స్ లు చాలా బాగా ప్లాన్ చేశారు. మెగాస్టార్ పై స్టైలిష్ టేకింగ్ అదిరింది. దర్శకుడు అనిల్ రావిపూడి పైన చెప్పిన విధంగానే తన వర్క్ మాత్రం గత సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు. కథ పరంగా పక్కన పెట్టేస్తే.. తన కథనం మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా బోర్ లేకుండా ప్లాన్ చేసుకున్న సీక్వెన్స్ లు అన్నీ వర్కౌట్ అవుతాయి . అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా డిజైన్ చేసుకున్న సన్నివేశాలు గాని.. డైలాగ్స్ గాని వారికి ఇట్టె కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేయడంలో తన రైటింగ్ టీం ఎఫర్ట్స్ కనిపిస్తాయి. భార్య, భర్తలు వారి మధ్య స్పర్థలు వచ్చాక జరిగే పరిణామాలపై కామెడీ యాంగిల్ లోనే కాకుండా ఎలా సర్దుకుపోవాలి అనే పాయింట్ ని కూడా డీసెంట్ గా చెప్పారు. దానికి తోడు కావాల్సినంత ఫన్ అందించడం బోనస్. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం చాలా ప్లస్ పాయింట్. ఏమాత్రం ఎక్కువ కాకుండా, ఏమాత్రం తక్కువ కాకుండా సాంగ్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా భీమ్స్ ది బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. పాటలు వినడానికి మాత్రమే కాదు స్క్రీన్ మీద కూడా చూడడానికి చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే చాలా రిచ్ గా ఉన్నాయి.
చిత్రం : మన శంకర వరప్రసాద్ గారు
విడుదల: జనవరి 12, 2025
నటీనటులు : చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ థెరిసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, రఘుబాబు, సుదేవ్ నైర్, మాస్టర్ రేవంత్ , బుల్లి రాజు తదితరులు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాణం : షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
