వాస్తవ ఘటనలతో ‘మహాలక్ష్మి బి.ఏ’

mahalakshmi ba movie 1st lyrical video update
mahalakshmi ba movie 1st lyrical video update
Spread the love

టి.డబ్ల్యూ.ఎస్ టాకీస్ బ్యానర్ పై వస్తోన్న లవ్, డ్రామా చిత్రం మహాలక్ష్మి బి.ఏ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర మొదటి లిరికల్ వీడియో ‘ఇప్పుడిప్పుడే’ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. రమ్య చిన్ని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని రాజేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. హర్ష ప్రవీణ్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రభాకర్ దండు సాహిత్యం అందించారు.

నిర్మాత: రాజేష్
ఎడిటర్: దీపక్
పబ్లిసిటీ డిజైనర్: రామ్ కోతకొండ
కెమెరామెన్: లోకేష్
లిరిక్స్: ప్రభాకర్ దండు
దర్శకత్వం: రాజేష్