ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం ..! : ‘అనకాపల్లి’ హీరో విక్రమ్ సహిదేవ్ తో ఇంటర్వ్యూ

Love is so sweet... yet the beloved is so unyielding...! : Interview with ‘Anakapalli’ hero Vikram Sahidev
Love is so sweet... yet the beloved is so unyielding...! : Interview with ‘Anakapalli’ hero Vikram Sahidev
Spread the love

ప్రముఖ దర్శకుడు త్రినాథ రావు నక్కిన నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘అనకాపల్లి’. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నరేటివ్స్, భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు కండ్రేగుల నాయుడు, కండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాథ రావు నక్కిన, ఇంద్రజ, సంగీత క్రిష్, కండ్రేగుల నాయుడు, నందిని రాయ్, మహబూబ్ భాషా, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. కథ, స్క్రీన్ ప్లే: త్రినాథ రావు నక్కిన, మ్యూజిక్: డేవ్జాండ్, సినిమాటోగ్రాఫర్: కటివరపు వంశీ కృష్ణ, ఎడిటర్: అత్తలూరి శ్రీకృష్ణ, డైలాగ్స్: ఉదయ్ భాగవతుల, కొరియోగ్రఫి: శేఖర్ మాస్టర్, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు.
”గత కొంత కాలాన్ని పరిశీలిస్తే సినిమాల్ని విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేయడానికి తెలుగు చిత్రసీమ విశేషంగా కృషి చేస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. సరైన ప్రణాళికతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవచ్చని టాలీవుడ్ నిరూపించింది. నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం కూడా ఇదే. నా చిత్రాల్నీ ఇదే తరహాలో అందరికీ చేరువ చేయాలన్నదే నా తపన’’ అన్నారు నవతరం కథానాయకుడు విక్రమ్ సహిదేవ్. ఆయన కథానాయకుడిగా  నటించిన చిత్రం… ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. తనకు ఏ స్టార్‌డమ్ ట్యాగ్‌లు, బాక్సాఫీస్ రికార్డులతో పనిలేదని తెలుగు ప్రేక్షకులు గర్వంగా చూపించుకునేలా తిరుగులేని చిత్రాలు తన నట జాబితాలో ఉండాలని అంటున్నారు విక్రమ్. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో – ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు. ‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి’ అంటూ సాగే పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో టీజర్ ఊర మాస్‌గా స్టార్ట్ అవుతుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, యూత్‌ను ఆకట్టుకునే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ కూడా ఈ సినిమా టీజర్‌లో సమపాళ్లలో ఉన్నాయి. సాధారణంగా సినిమాలకు దర్శకత్వం వహించే త్రినాథరావు నక్కిన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. విక్రమ్ సహిదేవ్ తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ఈ ‘రా అండ్ రస్టిక్’ పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. దేవ్ జండ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మాయా.వి విజువల్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ఈ చిత్రంలో తారక్ పొన్నప్ప, ఇంద్రజ, మహబూబ్ బాషా, నందిని రాయ్ వంటి నటీనటులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ సీజన్‌లోనే థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విక్రమ్ సహిదేవ్ ‘టాలీవుడ్ టైమ్స్’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
* ‘అనకాపల్లి’ ఒక ప్రేమ కథ, ఫ్రెండ్షిప్ కథ.. ఓ ఫ్యామిలీ కథ. ఈ చిత్రంలో ఎన్ని హంగులు ఉన్నా… ప్రాథమికంగా మాత్రం ప్రేమ, ఆప్యాయతల చుట్టూ తిరిగే కథ. అంశాలు కథలో ఓ భాగం మాత్రమే. వీటన్నిటినీ మించి లోతైన భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. సినిమా అంతా చాలా ఎక్సయిటింగా వుంటుంది. ‘అనకాపల్లి’ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఎప్పుడూ అండగా ఉండే నా స్నేహితులకు థాంక్స్. ఆట మంచి రసవత్తరంగా ఉన్నప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. ‘అనకాపల్లి’ చిత్రంలో ప్రతీ పాత్ర మధ్య అంతే పోటీ ఉంటుంది. ఒకరిని చూసి మరొకరు పోటీ పడి నటించారు. ఈ చిత్రాన్ని ఒక్క సెకన్ కూడా డీవియేట్ అవ్వకుండా చూస్తారు. ఈ చిత్రంలో పాటలు, మాటలు, ఫైట్స్ ఇలా అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది. సినిమా సరికొత్తగా ఉంటుంది. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనే లైన్స్ గుర్తు పెట్టుకోండి. ప్రియుడు మరింత వయలెంట్‌గా ఉంటే ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయ్ అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూడొచ్చు. ప్రియుడు ఎలా ఉండాలని గొప్పగా చూస్తారు. ఈ మూవీని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇదొక కల్ట్ స్టోరీ. ప్రేమ, స్నేహం అన్ని ఎమోషన్స్‌ అన్నీ ఇందులో చూస్తారు. అక్టోబర్ 2న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి. విక్రమ్, సంధ్య, తారక్ మధ్య జరిగే కథను ఇంత వరకు ఎక్కడా చూసి ఉండరు. అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది.
* ఏ సినిమాకి అయినా ప్రతినాయకుడు ముఖ్యం. ఈ సినిమాలో తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించారు. తారక్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు. సంధ్య కూడా గొప్పగా నటించింది. ఇంద్రజ గారు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. త్రినాథ్ గారు కొత్తగా కనిపిస్తారు. అందరూ చూసి సపోర్ట్ చేయండి. ‘అనకాపల్లి’ చిత్రంలో లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటుగా మంచి సందేశం ఉంటుంది. ఈ సినిమాలో దేవ్ జండ్ గారి మ్యూజిక్ బాగుంది. ఇప్పటికే అన్ని పాటలు హిట్ అయ్యాయి. మా సినిమాని రిలీజ్ చేస్తున్న మైత్రి సంస్థకి ధన్యవాదాలు. ‘అనకాపల్లి’ సినిమా అద్భుతంగా వచ్చింది. ఇదంతా కూడా త్రినాథ్ గారి విజన్‌తోనే సాధ్యమైంది. ఖగేష్ ఈ మూవీని ఎంతో రస్టిక్‌గా తెరకెక్కించారు. రూటెడ్, రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా రాబోతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించాలనుంది. నాకు ఒకే రకమైన కథలు మళ్లీ మళ్లీ చేయడం నచ్చదు. ప్రేక్షకులకు ఎప్పుడూ ఏదోకటి కొత్తదనం ఇవ్వాలనే ఆలోచన నా మనసులో ఎప్పుడూ తిరుగుతుంటుంది. అలాగే కొత్త ఆలోచనతో వచ్చిన క్రియేటర్లని నిరుత్సాహపరచకూడదు. దర్శకుడి విజన్‌ని గౌరవించి ముందుకు వెళ్లినప్పుడే మనకి కొత్తరకమైన సినిమాలొస్తాయి. నిజానికి ఒక నటుడు అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. ఈ రోజుల్లో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండాలి. అంతేకాదు, అవి సినిమా కంటెంట్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అని చెప్పడమే మా ఉద్దేశం. నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. కొత్త పాత్రలు చేయడం, కొత్త వ్యక్తిలా జీవించడం ఆసక్తిగా ఉంటుంది. ఒక నటుడిగా ఇది చాలా ఛాలెంజింగ్ రోల్. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎమోషనల్ కథల ట్రెండ్ నడుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ జోడిస్తూ హీరోలు ప్రేక్షకులను కన్నీరు పెట్టించే ప్రయత్నంలో ఉన్నారు. సీనియర్లు మాత్రమే కాదు.. ఈ జనరేషన్ హీరోల అడుగులు సైతం ఎమోషనల్ కథల వైపే వెళ్తున్నాయి. ఒక్కసారైనా కంటతడి పెట్టించే కథ చేయకపోతే ఎలా అన్నట్లు.. అంతా మూకుమ్మడిగా అలాంటి మనసును కదిలించే కథలనే ఎంచుకుంటున్నారు. నేనూ అంతే..
ఈ మూవీ రన్ టైమ్ ఏమిటి? ఈ చిత్ర కథ ఏమిటి?
అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ రివ్యూ చేసింది. ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ మూవీ రన్ టైమ్ ఏమిటి? ఈ చిత్ర కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. అనకాపలికి చెందిన కుర్రాడు సూర్య (విక్రమ్ సాహిదేవ్) సరదాగా లైఫ్‌ను కొనసాగిస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయి (సంధ్య వశిష్ట)తో ప్రేమలో ఉంటాడు. ఇక ఆ పట్టణంలో సుయోధన (తారక్ పొన్నప్ప) గూండాయిజం కొనసాగిస్తుంటాడు. అనుకోకుండా సుయోధన గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో సూర్య చేరిపోతాడు. కానీ ఓ దశలో ప్రియురాలినో లేదా సుయోధనలో వదులుకోవాల్సి వస్తుంది. దాంతో మాఫియా వ్యవహారాలకు దూరంగా ఉంటూ సుయోధనకు ఎదురు తిరుగుతాడు? అనకాపల్లిలోని మాఫియా వ్యవహారాల్లోకి సూర్య ఎలా చేరాడు? తన ప్రియురాలితో ప్రేమ వ్యవహారం విషయంలో ఎందుకు కీలక నిర్ణయం తీసుకొన్నాడు? సుయోధన లాంటి బాస్‌ను సూర్య ఎందుకు వ్యతిరేకించాడు? సుయోధనపై తిరుగుబాటు చేయడం ద్వారా సూర్య ఎలాంటి ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. యాక్షన్, లవ్ స్టోరి, సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను ఐదుగురు సభ్యులతో కూడిన సెన్సార్ టీమ్ రివ్యూ చేసింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కొంత కంటెంట్‌కు మార్పులు చేర్పులు సూచించింది. దాంతో చిత్ర యూనిట్ కొంత మేరకు మార్పులు చేర్పులు చేసింది. కానీ కీలక సన్నివేశాల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా స్టోరీ దెబ్బ తింటుందని వివరణ ఇవ్వడంతో ఈ సినిమాను పెద్దలకు మాత్రమే కేటగిరిలో ఫిక్స్ చేసి సెన్సార్ విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. అడల్డ్ కంటెంట్, మితిమీరిన హింస, రక్తపాతం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు ఏ సర్టిపికెట్‌ను జారీ చేసింది. ఈ సర్టిఫికెట్ ప్రకారం ఈ మూవీని 18 ఏళ్లకుపైబడిన వారు మాత్రమే చూడాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు ఈ మూవీని చూడటానికి వీలు లేకుండా ఆంక్షలు విధించారు. ఇక ఈ సినిమా కంటెంట్ డిమాండ్ మేరకు కొంత నిడివి పెరిగింది. ఈ సినిమాను 2 గంటల 34 నిమిషాల నిడివి అంటే.. 154 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు సర్టిఫికెట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాను గత నెల అనకాపల్లి పట్టణవాసులకు ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ సినిమా కంటెంట్, నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక వర్గాల పనితీరుపై ప్రాథమికంగా మంచి టాక్ వచ్చింది. కొత్త హీరో విక్రమ్ సహిదేవ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. తొలి చిత్రమైనా మెచ్యుర్డ్ యాక్టింగ్ చేశాడు. పుష్ప 2 తర్వాత తారక్ పొన్నప్ప మరోసారి విలన్ రోల్‌లో విజృంభించాడు. సంధ్య, విక్రమ్ మధ్య లవ్, కెమిస్ట్రీ సీన్లు వర్కవుట్ అయ్యాయనే రిపోర్ట్ బయటకు వచ్చింది