రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్

Jagapathi Babu's first look from Ram Charan's 'Peddhi'
Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గర్వంగా సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ‘పెద్ది’ ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించబోతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబును పరిచయం చేస్తూ చిత్ర బృందం ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.ఈ పోస్టర్‌లో జగపతి బాబు ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇది సినిమాలోని గ్రామీణ నేపథ్యానికి పర్ఫెక్ట్ యాప్ట్. చెదిరిన సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపిస్తూ,తన రఫ్ లుక్‌కు మరింత వన్నె తెచ్చారు. దారంతో కట్టిన విరిగిన కళ్లద్దాలు ఆ పాత్ర యొక్క కఠినమైన వ్యక్తిత్వాన్ని, అప్పలసూరి పాత్ర డెప్త్ ని ఇంటెన్స్ గా ప్రజెంట్ చేశాయి. తన పాత్రల విషయంలో ఎంతో సెలెక్టివ్‌గా వ్యవహరించే సీనియర్ నటుడు బోమన్ ఇరానీ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర కోసం జాయిన్ అయ్యారు. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్న ఆయన పాత్ర కథను ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా ఉండనుంది. పెద్దిలో ప్రతి క్యారెక్టర్‌కీ ప్రత్యేక ప్రాధాన్యం ఉండేలా దర్శకుడు డిజైన్ చేసిన నేపథ్యంలో, బోమన్ ఇరానీ పాత్ర కూడా సినిమాకు కీలకంగా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ చికిరి చికిరికు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగాచిరికి పాట  చార్ట్‌బస్టర్‌గా మారి, ఇటీవలి కాలంలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. టెక్నికల్ గా పెద్ది అత్యున్నత స్థాయిలో రూపొందుతోంది. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు విజువల్స్‌ను క్యాప్చర్ చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సినిమాకు ప్రత్యేకమైన ప్రపంచాన్ని  డీటెయిల్‌గా రూపొందిస్తున్నారు. పెద్ది మార్చి 27, 2026న గ్రాండ్ పాన్-ఇండియా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. 2026లో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్లలో ఒకటిగా పెద్ది అలరించబోతోంది

Related posts