ఏఎన్నార్‌తో సరితూగడం ఎవరికైనా కష్టమే: అక్కినేని అవార్డు ప్రదానోత్సవంలో అమితాబ్‌

It's difficult for anyone to match ANNR: Amitabh at Akkineni Awards
Spread the love

భారతీయ సినిమాకు సేవల విషయంలో ఏఎన్నార్‌తో సరితూగడం ఎవరికైనా కష్టమే అని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన ‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డు’ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024గానూ చిరంజీవికి ఆయన పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం అక్కినేని కుటుంబం, చిరంజీవిని కొనియాడారు. ”తెలుగు సినిమానే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలో ఏఎన్నార్‌ సత్తా చాటారు. తన నటనతో ఎంతోమందికి వినోదం పంచారు. ఏఎన్నార్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. నా కుమారులు.. నా కుమారులైనంత మాత్రాన నా వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో.. వారే నా కుమారులవుతారు అంటూ తన తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ రాసిన ఓ కవితను ప్రస్తావిస్తూ.. ఏఎన్నార్‌ విషయంలో నాగార్జున, ఆయన కుటుంబం దీన్ని నిరూపించిందన్నారు. ఎప్పుడు ఫోన్‌ చేసినా, ఏం అడిగినా.. నా ప్రియమైన మిత్రులు చిరంజీవి అందుబాటులో ఉంటారు. స్నేహం, ప్రేమ, ఆతిథ్యం విషయంలో ఆయనకు ధన్యవాదాలు. ఈ రోజు విూరు పంపిన భోజనం హోట్‌లో ఉండేవారందరికీ సరిపోతుంది అని సరదాగా వ్యాఖ్యానించారు. చిరంజీవి, నాగార్జున, నాగ్‌ అశ్విన్‌ తదితరులు తమ సినిమాల్లో నన్ను భాగం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో నేనూ సభ్యుడినే అని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి నుంచి నన్నూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భాగంగా పరిగణించండి. వచ్చే సినిమాలోనూ నాకు అవకాశం ఇవ్వడాన్ని మరవొద్దు. అవార్డు అందజేత విషయంలో నాకు ఈ గౌరవం కల్పించిన అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్‌, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment