మాస్ మహారాజా రవితేజ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’పై భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ‘ఫస్ట్ గ్లింప్స్’, చార్ట్‌బస్టర్ అయ్యప్ప భక్తి పాట ‘ఇరుముడి కట్టు’తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు మరో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. విడుదల తేదీకి సంబంధించి నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, అనుకున్న సమయానికే అంటే ఆగస్టు 21న ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. విడుదల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తూ, ’25 డేస్ టు గో’ పోస్టర్‌ను విడుదల చేశారు. కొత్తగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాలోని ఎమోషన్ ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఇందులో రవితేజ, చిన్నారి నక్షత్ర మధ్య తండ్రీ-కూతుళ్ల అనుబంధం ఎంతో ఆప్యాయంగా కనిపిస్తోంది. రవితేజ పేకాటలో నిమగ్నమై ఉండగా, ఆ చిన్నారి వెనుక నుండి ఆప్యాయంగా అతన్ని కౌగిలించుకోవడం, ఈ కథలోని ఎమోషన్ ని ప్రజెంట్ చేస్తోంది. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు శివ నిర్వాణకు మంచి పేరుంది; ఆయన ‘ఇరుముడి’ని ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు ఆయన ఈ సినిమాను ఎంత శ్రద్ధతో రూపొందిస్తున్నారో తెలియజేస్తున్నాయి. ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తోంది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్‌ను, ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలుస్తోంది. రిలీజ్ కౌంట్‌డౌన్ అధికారికంగా మొదలైన నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ విడుదల కానుంది.
ఆగస్టు 21న ‘ఇరుముడి’
