సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించిన ఐకాన్ స్టార్

Icon star presents Sitarama Kalyanam portrait
Spread the love

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ శ్రీ టొమాట్సు కోసానోకు సాంప్రదాయ సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీరామ నవమి సందర్భంగా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ చిత్రపటాన్ని అందించారు. ఇక ఈ ఘటనతో అల్లు అర్జున్‌కి మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, సంప్రదాయాల మీద ఉన్న ప్రగాఢమైన ప్రేమ, గౌరవాన్ని ప్రతిబింబించినట్టు అయింది. అల్లు అర్జున్ మన దేశ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరిస్తూ అందులోని విలువలు, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ చిత్రపటం బహూకరించడం భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక సంభాషణకు ప్రతీకగా నిలిచింది. ఇది వారసత్వం, ఆధ్యాత్మికత, కళాత్మక వ్యక్తీకరణ పట్ల ఉన్న ఉమ్మడి అభిమానాన్ని చాటింది. ఈ కార్యక్రమం భారతీయ సినిమా, అంతర్జాతీయ సృజనాత్మక వర్గాల మధ్య పెరుగుతున్న ప్రపంచ సంబంధాన్ని మరింత నొక్కి చెప్పింది. ప్రపంచ వేదికలపై భారతీయ సంస్కృతికి గర్వంగా ప్రాతినిధ్యం వహించడంలో అల్లు అర్జున్ పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా సీతారాముల వారి చిత్రపటాన్ని బహూకరించడంతో భౌగోళిక సరిహద్దులకు అతీతంగా విభిన్న సంస్కృతుల మధ్య అవగాహనను, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో కళ, సినిమాల పాత్రను మరోసారి ధృవీకరించినట్టైంది.

Related posts