‘అబ్బే మా మధ్య డేటింగ్, గీటింగ్స్ ఏమీ లేవు.. అతడు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అంటూ తమపై వస్తున్న డేటింగ్ రూమర్లపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాములుగా గాసిప్స్ వస్తున్నాయంటే ఎవరైనా సరే కాస్త జాగ్రత్త పడతారు కానీ.. ధనుష్-మృణాల్ జోడీ మాత్రం హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మృణాల్, ధనుష్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే మళ్లీ తమవైపు అటెన్షన్ గ్రాబ్ అయ్యేలా చేస్తున్నారు. ధనుష్-మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త ఇప్పటిదీ కాదు. ఇద్దరు కలిసి పార్టీల్లో సందడి చేయడం, సన్నాఫ్ సర్దార్ 2 ప్రీమియర్స్‌కు ధనుష్ రావడం, ఆమెతో క్లోజ్‌గా మూవ్ కావడంతో డేటింగ్ రూమర్లకు రెక్కలొచ్చాయి. తేరీ ఇష్క్ మే రిలీజ్ టైంలోనూ ఇలాంటి కథలొచ్చాయి. ఇక దో దీవానే సెహర్ మే టీజర్‌పై ధనుష్ లుక్స్ అండ్ సౌండ్స్ గుడ్ అంటూ కామెంట్ చేయడంతో వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని నెటిజన్స్ డిసైడయ్యారు. కానీ మా మధ్య ఏమీ లేదని మృణాల్ తేల్చేశారు. ధనుష్-మృణాల్ ఠాకూర్ మధ్య నథింగ్ అట అని డిసైడ్ అవుతోన్న టైంలో మళ్లీ డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. డెకాయిట్ హిందీ ప్రమోషన్స్‌లో భాగంగా అడవి శేష్‌తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తమిళంలో కొన్ని పదాలు మాట్లాడారు. అదీ కూడా తడుముకోకుండా. ఇందులో ఏముంది అనుకోవచ్చు కానీ.. ఇప్పటి వరకు ఆమె తమిళంలో ఒక్క సినిమా చేయలేదు. మూవీకి కమిటైన దాఖలాలు కూడా లేవు. అలాంటిది తమిళ భాషలో మాట్లాడటం చూసి.. ఈ టాలెంట్ ధనుష్ నుంచే వచ్చిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ చెన్నై రావడం వెనుక అతడే కారణమంటున్నారు. ఇలాంటి రూమర్స్‌తో ప్రీ పబ్లిసిటీ, అటెన్షన్ గ్రాబ్ అయితే చేసుకుంటున్నారు.. !
అతడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే..
