Happy Birthday Maruthi : 5డి క్యామ్ తో సినిమా నుండి పాన్ ఇండియా స్టార్ తో సినిమా వరకు…

Happy Birthday to Maruthi
Spread the love

”సినిమా అంటే వినోదం, ప్రేక్షకుడు టికెట్ కోసం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేయడమే మన లక్ష్యం” అని బలంగా నమ్మిన దర్శకుడు మారుతి. మన ఆలోచన ఆటోవాడికి కూడా అర్ధమవ్వాలి, ఆడియన్స్ కి ఇష్టమైన సినిమాలు మాత్రమే తీయాలి. మనకు ఇష్టమైన సినిమాలను వాళ్ళ మీదకి రుద్దకూడదు అని సక్సెస్ ఫార్ములా పట్టుకున్న దర్శకుడు.
తన కెరియర్ లో సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్‌ డిజైనర్‌గా పని చేసిన మారుతి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 5డి క్యామ్ తో చేసిన”దొంగలముఠా” సినిమా నుంచి ఇన్స్పైరై, 5డి క్యామ్ తో ఆ రోజుల్లోనే “ఈరోజుల్లో” అనే సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి యూత్ ను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత బస్‌ స్టాప్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రెండు చిన్న చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో ‘ప్రేమకథా చిత్రం’ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు మారుతి.
కేవలం యూత్ కి దగ్గరయ్యే సినిమాలు మాత్రమే కాకుండా అల్లు శిరీష్‌తో ‘కొత్తజంట’, వెంకటేశ్‌తో ‘బాబు బంగారం’, నానితో ‘భలే భలే మగాడివోయ్‌’, శర్వానంద్‌తో ‘మహానుభావుడు’, నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’, సాయిధరమ్‌ తేజ్‌తో ‘ప్రతిరోజు పండగే’ ఇలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు దర్శకుడు మారుతి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 రోజుల్లో సినిమా చేయడం అంటే మాటలు కాదు.
కేవలం నెల రోజుల్లోనే “మంచి రోజులొచ్చాయి” అనే సినిమాను తీసి విడుదలకు సిద్ధం చేసాడు మారుతి. వినోదభరితమైన చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చే మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాను చేస్తున్నారు. అనుకుంటే అసాధ్యం కానిది ఏదీ లేదని, మాటల్లో కాకుండా చేతల్లో చూపించాడు దర్శకుడు మారుతి. ఇలానే మరిన్ని హిట్ చిత్రాలని చేస్తూ విజయాలను అందుకోవాలని దర్శకుడు మారుతికి పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు.

Related posts

Leave a Comment