మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ద్వాదశ దినకర్మ

Former Principal K. S. Donthiri Narasimha Reddy Dwadasa Dinakarma
Spread the love

(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి)
హైదరాబాద్, ఏప్రిల్ 26 : సుదీర్ఘకాలం ప్రధానోపాధ్యాయులుగా సమర్థవంతంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ.. పనిచేస్తున్న పాఠశాలల బాగోగులు చూస్తూ, విద్యార్థుల భవిష్యత్తు సక్రమమైన మార్గంలో నడిచేలా పూలబాటలు వేస్తూ ఉన్నతమైన సేవలను అందించిన మాజీ ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి ఈ నెల అంటే 16-04-2025 బుధవారం రోజున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. అలాంటి మహోన్నత ప్రధానోపాధ్యాయులు కీ. శే. దొంతిరి నర్సింహా రెడ్డి గారి ద్వాదశ దినకర్మ 26-4-2025 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమాన్నిదొంతిరి నర్సింహా రెడ్డి గారి కుమారులు దొంతిరి విద్యాసాగర్ రెడ్ట్, దొంతిరి వినోద్ సాగర్ రెడ్డిలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ డిపో సమీపంలోని మేడిపల్లి ఏ.వి ఇన్ఫో ఫ్రాయిడ్ అపార్ట్మెంట్స్ క్లబ్ హౌస్ లో జరిగిన ఈ ద్వాదశ దినకర్మలో పాల్గొన్న బంధుమిత్రులు, ఆత్మీయులు దొంతిరి నర్సింహా రెడ్డిని స్మరిస్తూ.. దైవసన్నిధికి చేరిన దొంతిరి నర్సింహా రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. కుమారులైన దొంతిరి విద్యాసాగర్ రెడ్ట్, దొంతిరి వినోద్ సాగర్ రెడ్డిలకు, వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు.
ఈ సందర్బంగా జరిగిన మాజీ ప్రధానోపాధ్యాయులు కీ.శే. దొంతిరి నర్సింహా రెడ్డి గారి ద్వాదశ దినకర్మలో మాజీ ప్రతినిధుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకవరం మోహనరావు, ఆలేరు మాజీ జెడ్పిటీసీ, టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్, నంది అవార్డు గ్రహీత, దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి చీఫ్-సబ్ ఎడిటర్ ఎం.డి అబ్దుల్, టి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు కొలుపుల హరినాథ్, మొరిగాడి ఉపేందర్, తిరుపతిరెడ్డి, గుంటుక శ్రీనివాస్ రెడ్డి, ప్రఖ్యాత ఉపాధ్యాయులు చిలుగ రామ్ నర్సయ్య, ఉపాధ్యాయులు చిలుగ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, సీనియర్ ఫిలిం ఫోటో గ్రాఫర్ జనార్దన్ రెడ్డి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రటరీ బొమ్మకంటి బాలరాజు, ఆలేరు ప్రముఖులు అయిలి సత్తయ్య, అయిలి మధు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రావుల మహేందర్ రెడ్డి, రావుల రవీందర్ రెడ్డి, శ్రీయుతులు అంజి రెడ్డి తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Related posts

Leave a Comment