జాన్వీ అందానికి అభిమానులు ఫిదా ..

Fans are in awe of Janhvi's beauty..
Spread the love

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా వెండితెర ప్రయాణం ప్రారంభించిన జాన్వీ కపూర్ తన కూతురిని స్టార్ హీరోయిన్ గా చూడడం కోసం శ్రీదేవి ఎంతో కష్టపడ్డారు. కానీ, అది నెరవేరకుండానే ఆమె మరణించారు. అయినా కూడా తల్లి పేరును నిలబెట్టడానికి జాన్వీ తన వంతు కృషి చేస్తున్నారు. ‘దేవర’తో జాన్వీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా కూడా తంగం పాత్రలో జాన్వీ తెలుగు అభిమానులను ఫిదా చేశారు. ఇక ‘దేవర’ తరువాత జాన్వీ నటిస్తోన్న చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి సాంగ్ అయితే సెన్సేషన్ సృష్టించింది. జాన్వీ అందాలను ఆ సాంగ్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. అచ్చియమ్మ అనే పాత్రలో జాన్వీ నటిస్తోంది. మార్చి 6 జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో ‘పెద్ది’ టీమ్ జాన్వీకి స్పెషల్ వీడియోతో శుభాకాంక్షలు చెప్పింది. ‘పెద్ది’ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి అచ్చియమ్మకు బర్త్ డే విషెస్ తెలిపారు. చికిరి చికిరి సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. అందులో జాన్వీ .. అచ్చియమ్మగా ఎలా మారారు.. ? అనేది చూపించారు. ‘ కాటుక అక్కర్లేని ఆ కళ్లు.. ముక్కుపుడక అక్కర్లేని ఆ ముక్కు.. అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరి.. ఈ చికిరి’ అని జాన్వీ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాన్వీ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అచ్చియమ్మ.. ఏం అందమమ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో జాన్వీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related posts