‘దేవగుడి’ ట్రైలర్ విడుదల : 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

"Devagudi" movie trailer launched Grandly, movie to have worldwide theatrical release on 30th of this month
Spread the love

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్
విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – మీడియా మిత్రుల సమక్షంలో మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మా సినిమా టీజర్ ను హీరో  శ్రీకాంత్ గారు రిలీజ్ చేసి సపోర్ట్ అందించారు. ఈ చిత్రంలో స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉంటుంది. సినిమాలోని ఒక్కో సీన్ అలా వెళ్తూ ఉంటుంది. ఎక్కగా ల్యాగ్ అనిపించదు. ఈ చిత్రానికి కావాల్సినంత బడ్జెట్ పెట్టి నిర్మించాం. “దేవగుడి” సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ నెల 30న మా మూవీని థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి సెంటర్స్ లో  మా మూవీని రిలీజ్ చేయబోతున్నాం. సాధారణ టికెట్ రేట్స్ తో మా మూవీ మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్స్ లోనే సినిమాను చూడండి. అన్నారు.
హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ – హీరో కావాలనేది నా కల. ఎన్నో ఆడిషన్స్ చేశాను, కొన్నేళ్లు వేచి చూశాను. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడటం సంతోషంగా ఉంది. మాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. కేవలం మా టాలెంట్ ను చూసి బెల్లం రామకృష్ణారెడ్డి గారు అవకాశం ఇచ్చారు. కొందరు తమను హీరోగా తీసుకుంటే కోట్ల రూపాయలు సినిమాకు బడ్జెట్ ఇస్తామన్నారు. అయినా ఆయన వినలేదు. బెల్లం రామకృష్ణా రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ప్రతి సీన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నో వెర్షన్స్ స్క్రిప్ట్స్ రాశారు. చిన్న సినిమాలో ఏముంటుంది అనుకోవద్దు. చిన్న చిత్రాలను ఆదరిస్తేనే మాలాంటి కొత్త టాలెంట్ బయటకు వస్తుది. మీరంతా మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ – తెలుగు హీరోయిన్ గా మీ ముందుకు “దేవగుడి” చిత్రంతో వస్తుండటం సంతోషంగా ఉంది. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వస్తే ఎంత నెగిటివ్ గా మాట్లాడుతారో తెలుసు. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు అలా మాట్లాడిన వాళ్లే ఈ రోజు మా ఇంటికి రా అని పిలుస్తున్నారు. మా ఊరిలోనూ ఈ సినిమా పబ్లిసిటీ చేశారు. ఒకప్పుడు బాధపడిన నేను ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నా. అందుకు బెల్లం రామకృష్ణా రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరంతా ఇష్టపడేలా ఉంటుంది. కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా నాతో డైరెక్టర్ చెప్పించారు. అన్నారు.
నటుడు రఘుకుంచె మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను కీలక పాత్రలో నటించాను. సీన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. నా కారుతో పాటు పది పదిహేను సుమోలతో ఛేజింగ్స్ ఉంటాయి. ఇలాంటి భారీ యాక్షన్ సీక్వెన్సులు నా కెరీర్ లో ఎప్పుడూ చేయలేదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి చిత్రమిది. ఈ సినిమాకు మదీన్ ఇచ్చిన సాంగ్స్, బీజీఎం స్పెషల్ అట్రాక్షన్ అవుతాయి. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ కే మదీన్ మాట్లాడుతూ – “దేవగుడి” సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత బెల్లం రామకష్ణా రెడ్డి గారికి థ్యాంక్స్. ఆయనకు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆయన సూచనలతో మంచి సాంగ్స్ చేశానని అనుకుంటున్నా. పాటలతో పాటు బీజీఎం మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
డీవోపీ లక్ష్మీకాంత్ కనిక మాట్లాడుతూ – “దేవగుడి” సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. నేచురల్ లొకేషన్స్ లో బ్యూటిఫుల్ విజువల్స్ తో సినిమా తెరకెక్కించాం. టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. అన్నారు.
నటీనటులు – అభినవ శౌర్య, నరసింహ తోషి, అను శ్రీ, రఘు బాబు, అన్నపూర్ణమ్మ,  రఘు కుంచె, రాకెట్ రాఘవ, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, ఇమ్మానియేల్, ప్రభావతి, రాజశ్రీ నాయర్, తదితరులు
టెక్నికల్ టీమ్:
బ్యానర్ – పుష్యమి ఫిలింమేకర్స్
సమర్పణ – బెల్లం సుధ రెడ్డి
దర్శక నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి
సంగీతం: ఎస్ , కె మదీన్
డిఓపి: లక్ష్మీకాంత్ కనిక
ఎడిటర్: వి. నాగిరెడ్డి
పిఆర్ఓ: నాగేశ్వరరావు

Related posts