సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘దక్షిణ కాళీ’. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ – అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించాం. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పాలి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కు మా మూవీ షోస్ వేస్తున్నాం. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి మంచి కథను అందించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సత్యవాణి గారు నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా మూవీ ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం లో నిర్మాత సత్యవాణి మీసాల, హీరోయిన్ ప్రియాంక, నటుడు అఫ్సర్ ఆజాద్, హీరో సుబ్బు మాట్లాడారు.
అమ్మవారి మహిమలతో’దక్షిణ కాళీ’
