హైదరాబాద్ చిత్రపురి కాలనీలో వల్లభనేని అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో బోనాలు పండుగ సందర్భంగా శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారిని హరిహర వీరమల్లు చిత్ర నటి నిధి అగర్వాల్ దర్శించుకోవడం జరిగింది. ఆ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టిఐ కమిషనర్ దంపతులు సృజన పివి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఫిలిం ఛాంబర్ పెద్దలు భరత భూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్నకుమార్ గారు, సి కళ్యాణ్ గారు, భరద్వాజ్ గారు, శంకర్ గారు, తదితర ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్ దంపతులు చిత్రపురి కష్టాలు తొలగి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. అలాగే పెద్దలు వేణు, అలహరి,…
Category: వీడియోస్
తానా సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను నంది అవార్డ్ తో సత్కరించిన టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి సత్కారం పొందిన ప్రముఖ కరాటే మాస్టర్ లక్ష్మీ సామ్రాజ్యంను ఘనంగా సత్కరించారు తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ నుంచి స్వామి రెడ్డి, గౌరీ శంకర్, స్నిగ్ధ, చంద్రకాంత్, సక్సెల్ లైఫ్, దుబాయ్ స్థాపకులు యోగ నారాయణ, కరాటే మాస్టర్ రవి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా … టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మన లక్ష్మీ గారికి తానాలో ఘన సన్మానం జరగడం మనందరికీ గర్వకారణం. తానాలో సత్కారం పొందిన లక్ష్మీ గారిని మన టీఎఫ్ సీసీ నుంచి తప్పకుండా సన్మానించుకోవాలని భావించి ఆమెకు నంది…
ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర…
బాధితులకు భరోసా కల్పించి తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి
ఎన్‌టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తలసేమియాపై అవగాహన కోసం రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్‌టీఆర్ ట్రస్ట్ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ప్రారభించారు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్ ని విజయవంతం చేశారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని సత్కరించారు. అనంతరం గ్రాండ్ మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ ట్రస్ట్ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. తలసేమియా రన్ లో పాల్గొన్న…
ఘనంగా ‘రాజు గాని సవాల్’ ట్రైలర్ లాంఛ్..ఆగస్టు 8న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “రాజు గాని సవాల్”. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం “రాజు గాని సవాల్” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం, ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. హీరోయిన్ డింపుల్…
హీరోయిన్ సంచితా శెట్టికి మథర్ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది…ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఫేమస్ తమిళ, కన్నడ, తెలుగు నటి సంచితా శెట్టి. సంచితా విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్’, ఆశోక్ సెల్వన్ హీరోగా నటించిన ‘విల్లా’తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ చిత్రాలతో పాటు దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. నటనతో పాటు సంచిత చేసిన యూత్ లీడర్ షిప్ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్ మథర్ థెరిసా యూనివర్సిటీవారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు. ఈ…
యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘త్రిముఖ’టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల
మనసును కదిలించే థ్రిల్లర్‌గా రూపొందుతున్న “త్రిముఖ” చిత్రం నుంచి టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతీ అగర్వాల్, మొట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. టైటిల్ మోషన్ పోస్టర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా సస్పెన్స్‌తో నిండి ఉంది. ఒక మానవ మెదడు, దాని చుట్టూ చుట్టుముట్టిన విద్యుత్ కరెంట్ వేగం, రహస్యాలతో నిండిన కన్ను, దురుద్దేశంతో ఉన్నట్లు కనిపించే సూది, చివరగా రెండు ఉగ్ర గద్దల మధ్య ఉత్కంఠ పుట్టించే చీకటి శైలి అని కలిసి త్రిముఖ ఒక సైంటిఫిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది. “ఇది సాధారణ పోస్టర్ కాదు, ఈ పోస్టర్ త్రిముఖ చిత్రం పైన కొంత…
Trimukha – A Mind-Bending Thriller unveiled its Title motion poster staring Yogesh Kalle and Sunny Leone.
The title motion poster of TRIMUKHA staring Yogesh, Sunny Leone, Akriti Agarwal, Motta Rajendran and others in lead roles is a mesmerizing glimpse into what promises to be a mind-bending psychological thriller. The movie is a star studded bonanza having star cast from different languages across India. Every detail crackles with intrigue—a haunting close-up of a human brain, a watchful eye brimming with secrets, a syringe poised for an ominous purpose, and electric currents surging through twisted neurons. Flanked by two fierce eagles, the imagery pulses with dark symbolism, hinting…
సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ : దర్శకుడు బాబ్జీతో పెన్ కౌంటర్
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ప్రాంగణంలో పల్లవిస్తున్న ప్రజా కళల గొంతుక బాబ్జీ. కళ కళ కోసం కాదు… కళ ప్రజల కోసం అనే సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని మానవజాతి ముంగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలి వేదిక నుంచి వెండితెర వైపు నడిసొచ్చిన రచయిత, దర్శకుడు ఆయన….!! చదువుకునే రోజులలో విప్లవ విద్యార్థి నాయకుడిగా అవిభక్త తెలుగు రాష్ట్రంలో ఉధృతంగా ఉద్యమించి ,పోలీస్ లాఠీలకు తన శరీరాన్ని పలుమార్లు అప్పగించిన ఉద్యమ నేపథ్యం ఆయనది…! ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఆ రోజులలో జరిగిన వివిధ ప్రజా సంఘాల పోరాట వేదికలపై నటించిన , నటించిన , గళమెత్తి గర్జించిన ప్రజా కళాకారుడాయన…..! ఒక అభ్యుదయ రచయితగా ఆయన కలం నుంచి జాలువారిన అనేక పాటలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా గాయకుల గొంతులలో ఈనాటికి పల్లవిస్తూనే ఉన్నాయి…..!…
విలక్షణ నటనకు మారుపేరు కోట
వందలాది విలక్షణమైన పాత్రలకు తన సలక్షణమైన అభినయంతో ప్రాణం పోశారు కోట శ్రీనివాసరావు. అందువల్ల కోట తీరే వేరుగా నిలిచింది. అలా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు కోట. కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న వార్త తెలుగువారిని విషాదంతో ముంచెత్తింది. కోట విలక్షణమైన అభినయాన్ని తలచుకొని కొందరు ఆయనను మరో నాగభూషణంగా అభివర్ణించారు. కొందరు రావు గోపాలరావుతోనూ, మరికొందరు నూతన్ ప్రసాద్ తోనూ పోల్చారు. నిస్సందేహంగా కోటతో పోల్చిన వారందరూ ప్రతిభావంతులే. బహుశా, కోట కొన్ని చిత్రాలలో అంతకు ముందు వారు ధరించిన తరహా పాత్రలు పోషించి ఉండవచ్చు. అందువల్ల జనం ఆ మహానటులతో కోటనూ పోల్చారేమో అనిపిస్తుంది. పలువురిని అనుసరించినా, కోట తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకున్నారు. నాగభూషణం లాగా కామెడీని మిళితం చేసి పలు చిత్రాలలో కోట విలన్ గా…