మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ చిత్రం షూటింగ్ సైలెంట్‌గా మొదలైంది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రియాంకా చోప్రాలపై ఓ కీలకమైన సన్నివేశాన్ని 5 రోజులపాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో తీర్చిదిద్దారు. తదుపరి షెడ్యూల్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్రలో నానా పటేకర్ కనిపించబోతున్నారని టాక్. ఆయనపై కూడా లుక్ టెస్ట్ నిర్వహించారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మహేష్ తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్ర కోసం ఎవరిని ఎంచుకొంటారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నానా పటేకర్‌ని తీసుకొంది మహేష్ తండ్రి పాత్ర కోసమా? కాదా? అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క ఈ సినిమా టైటిల్ కోసం రాజమౌళి అన్వేషణ మొదలైంది. ‘మహారాజ్’ , ‘గరుడ’ అనే…
Category: వీడియోస్
వాహ్.. ర్యాంప్ వాక్‌తో అలరించిన రోజా కుమార్తె!
చిత్ర పరిశ్రమలోకి సీనియర్ నటీనటుల వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణమే. అయితే వారిలో చాలా తక్కువమంది మాత్రమే వేరే రంగాల్లో కూడా అడుగుపెడతారు. ఆ విధంగా అక్కడ కూడా తమ టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటారు. ఎక్కువగా హీరోల కుమారులు, కుమార్తెలే లైమ్ లైట్ లోకి వస్తుంటారు. ఇటీవల కాలంలో సీనియర్ హీరోయిన్ల కుమార్తెలు సైతం బాగానే పాపులర్ అవుతున్నారు. సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా కుమార్తె.. అన్షు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే తాజాగా ఈ అమ్మడు మొదటిసారి ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోలు కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతున్నాయి. ఇప్పటికే రచయితగా తన ప్రతిభను చాటుకున్న ఆమె ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ తళుక్కుమంది. నైజీరియాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎంట్రపెన్యూర్షిప్ ఫెస్టివల్’లో సందడి చేసింది. ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసి…
విజయ్‌దేవరకొండ-రష్మికల బ్రేకప్!?
గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదని విజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికీ వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు. రష్మిక తన అసిస్టెంట్ వివాహం కోసం హైదరాబాద్‌కు రావడం జరిగింది. అసిస్టెంట్ పెళ్లికి హజరైన తర్వాత రష్మిక,విజయ్…
పాకిస్తాన్ లో అల్లు అర్జున్ అభిమాని కోరికే తండేల్ కి పునాది!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తూ చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తండేల్. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి గల మూల కారణం ఒక అల్లు అర్జున్ ఫ్యాన్. నిజానికి పాకిస్తాన్ లో చిక్కుకుని కరాచీ జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలరులకు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ వారికి సాయం చేయడం జరిగింది. అతడు అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ జాలరులు పాకిస్తాన్ జైలులో ఉన్న సమయంలో వారికి ఎంతో సాయపడుతూ వచ్చాడు ఆ కానిస్టేబుల్. అయితే ఆ జాలరులు విడుదలవుతున్న సమయంలో ఆ కానిస్టేబుల్ వీరి నుండి ఒక ఫేవర్…
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణని సత్కరించిన టాలీవుడ్ ప్రముఖులు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భరత్ భూషణ్, సెక్రటరీ కె ఎల్ దామోదర్ ప్రసాద్ , కోశాధికారి తుమ్మల ప్రసన్న కుమార్ అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె ఎల్ దామోదర్ ప్రసాద్ , సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి , తెలుగు ఫిలిం…
TFI Personalities Congratulated Nandamuri Balakrishna For Being Conferred With Padma Bhushan
On the occasion of Balakrishna Nandamuri being conferred with the Padma Bhushan award, the major stakeholders of the Telugu film industry met the senior actor-politician at his residence to congratulate him on this occassion. Balakrishna is a renowned actor, Hindupur MLA and Chairman of Basavatarakam Cancer Hospital, who has rendered distinguished services to the Telugu film industry. Telugu Film Chamber of Commerce President P Bharat Bhushan, Secretary K L Damodar Prasad, Treasurer Tummala Prasanna Kumar, as well as Telugu Film Producers Council President K L Damodar Prasad, Secretary Tummala Prasanna…
షైన్ టామ్ చాకో రొమాంటిక్ కామెడీ డ్రామా ‘వివేకానందన్ వైరల్’ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్
మలయాళంలో షైన్ టామ్ చాకోకి మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం ఆయన నైజం. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన ‘వివేకానందన్ విరలను’ అనే సినిమా చేశారు. గత ఏడాది జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. తన సబ్‌స్క్రైబర్ల కోసం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను అందించే ఆహా ఓటీటీ ఈ శుక్రవారం ‘వివేకానందన్ వైరల్’ పేరుతో సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామాను అందించబోతోంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్,…
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన W/O అనిర్వేష్ చిత్రం యొక్క కొన్ని సన్నివేశాలను చూసి దర్శకుడు గంగ సప్తశిఖర ను ప్రశంసించారు హీరో అల్లరి నరేష్. కొత్త తరహా స్క్రీన్ ప్లే తో అలరించబోతున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించింది సీనియర్ రైటర్ బాబీ కె ఎస్ ఆర్. ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంగేజింగా ప్రేక్షకులకు త్వరలో చూపించబోతున్నటువంటి ఈ చిత్రం కచ్చితంగా విజయం చేకూర్చుతుందని అల్లరి నరేష్ అన్నారు. సంగీత దర్శకుడు షణ్ముఖ మ్యూజిక్ ఈ సినిమాకి…
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by Mahendra Gajendra and directed by Ganga Saptashikhara, W/O Anirvesh features actors Jabardasth Ram Prasad, Gemini Suresh, Kiriti, Sai Prasanna, Sai Kiran, Nazia Khan, and Advaith Chowdhary in key roles. After watching a few scenes from the movie, hero Allari Naresh praised director Ganga Saptashikhara. He appreciated the film’s unique screenplay and expressed confidence that this engaging crime thriller, written by senior writer Bobby KSR, would captivate audiences and achieve success. Music director Shanmukh has breathed life…
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి యేటా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవించే జాతీయ పురస్కారం తులసి సమ్మాన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి రాఘవ రాజ్ భట్ ను ఎంపిక చేయడం విశేషం. తులసి సమ్మాన్ జాతీయ పురస్కారంతో రాఘవ రాజ్ భట్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ సి. పటేల్ ఘనంగా సత్కరించారు. భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా జానపద కళలకు ఆయన అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం లభించింది. తెలుగు జానపద కళాబ్రహ్మ డా. గోపాల్ రాజ్ భట్ వారసుడు రాఘవ రాజ్ భట్. భారతీయ జానపద కళలను పరిరక్షిస్తూ పరివ్యాప్తి చేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు.…