• శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై జనసేనాని – త్రివిక్రమ్ ముచ్చట శ్రీ పవన్ కల్యాణ్ గారు… శ్రీ త్రివిక్రమ్ గారు కలసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి? గడియారంలో ముళ్లు సెకన్లు, నిమిషాలు, గంటలు దాటిపోతున్నా వారి చర్చలకు తెరపడదు. జనసేనాని, త్రివిక్రమ్ ల మధ్య సంభాషణా స్రవంతి గోదారి ప్రవాహంలా సాగుతుంది. వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా… రాజకీయాల గురించా? శ్రీ పవన్ కల్యాణ్ గారు, శ్రీ త్రివిక్రమ్ గారి గురించి బాగా తెలిసినవారు – ఆ ఇద్దరూ మాట్లాడుకొంటుంటే అనే మాటలోని అంతరార్థం ఎప్పటికైనా ఒకటే ‘ఆ ఇద్దరూ సాహితీ చర్చల్లో ఉన్నారు’ అని. వారితోనే ఆ మాట అంటే ఈ సాహితీ మిత్రులు కూడా సరదాగా అంటూ ఉంటారు –…
Category: VIDEOS
బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్
కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఇవ్వాల బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్ ను చేరింది. ఇవ్వాల హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యంగ్ టర్క్ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు…
‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేష్
బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం కనులు మాత్రమే కనిపించేలా ముఖానికి కండువాతో కవర్ చేసిన బండ్ల గణేష్ కనిపిస్తుంటే… ఆయన కన్నుపై కత్తిగాటు, దానిపై వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తపు బొట్టు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. టైటిల్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు.వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ‘డేగల బాబ్జీ’ సినిమాను స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభమైంది.…
HappyBirthday Anchor Ravi
Best Birthday wishes to the most talented and ever energetic @anchorravi_offl. ❤️You are always a lovely soul who keeps their friends, family safe and happy. Wishing to see you as the title winner in #BiggBossTelugu5, All the best!! 👍
Brahmanandam as Veda Vyas in ‘Panchathantram’
First Look of Brahmanandam unveiled Haasya Brahma’ Brahmanandam has played a multitude of roles in films and has had us in splits over the decades. He is now playing a narrator named Veda Vyas in ‘Panchathantram’. On Saturday, his First Look was released. Also starring Swathi Reddy, Shivathmika Rajasekhar, Samuthirakani, young hero Rahul Vijay and ‘Mathu Vadalara’ fame Naresh Agasthya feature in ‘Panchathantram’, the film is being produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, it is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu.We see…
శశి ప్రీతమ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘లైఫ్ ఆఫ్ 3’ ఆడియో విడుదల
ప్రముఖ సంగీత దర్శకుడు, యాడ్ ఫిల్మ్ మేకర్ శశి ప్రీతమ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘లైఫ్ ఆఫ్ 3’. ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణప్రియ నిర్మించారు. దుష్యంత్ రెడ్డి సహ నిర్మాత. స్నేహాల్ కామత్, సంతోష్ అనంతరామన్, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. వైశాలి, సౌజన్య వర్మ, లోహిత్ కుమార్, సీవీఎల్ నరసింహారావు, వైభవ్ సూర్య సహాయ తారాగణం. కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఛాయాగ్రహణ, సంగీత, దర్శకత్వ బాధ్యతలను శశి ప్రీతమ్ నిర్వర్తించారు. సెప్టెంబర్ 15 (బుధవారం) శశి ప్రీతమ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, ఆడియో విడుదల చేశారు. సినిమాలో పాటలన్నీ శశి ప్రీతమ్ రాశారు.శశి ప్రీతమ్ మాట్లాడుతూ “ఈ ఏడాది జనవరిలో ‘లైఫ్ ఆఫ్ 3’ సినిమా ప్రారంభించాం. గతేడాది తీవ్ర గుండెపోటుకు గురైనప్పుడు చావును దగ్గరనుంచి చూశా. దాన్నుంచి…
Mega Power Star Ram Charan, Sensational Director Shankar come together with Star Producers Dil Raju, Sirish for Pan-India Movie
Movie launched in a grand manner The massive pan-India project jointly produced by star producers Dil Raju and Sirish in the combination of Mega Power Star Ram Charan and Sensational Director Shankar was launched today amid fanfare. Megastar Chiranjeevi, pan-India director SS Rajamouli, and Bollywood star hero Ranveer Singh graced the occasion as chief guests. If the Muhurtham shot was given the clap by Megastar Chiranjeevi, Ranveer Singh switched on the camera. SS Rajamouli directed the first shot. The Megastar handed over the script to Shankar.This one is Ram Charan’s…
బాలీవుడ్ స్టార్స్‌కు తెలుగు ఆస్ట్రో ఎండీ బాలు మున్నంగి సెంటిమెంట్
సినిమాలో 24 శాఖలు ఉంటాయి. ఆయా శాఖల్లో పని చేసిన వ్యక్తుల పేర్లు టైటిల్ కార్డ్స్‌లో వేస్తారు. థాంక్స్ కార్డ్స్, లీగల్ అడ్వైజర్/కన్సల్టెంట్స్ పేర్లు వీటికి అదనం. ఇప్పుడు కొత్తగా మరో కార్డ్ వచ్చింది. అదే ఆస్ట్రో కన్సల్టెంట్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైన హిట్ సినిమా ‘షేర్షా’ చూశారా? అందులో ఆస్ట్రో కన్సల్టెంట్ బాలు మున్నంగి అని పేరు పడింది. ‘షేర్షా’ నిర్మాత, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ గతంలో ఒకసారి జ్యోతిషం పరంగా తనకు సలహాలు ఇస్తూ, మద్దతుగా నిలుస్తున్నందుకు బాలు మున్నంగికి థాంక్స్ చెప్పారు. దాంతో ఎవరీ బాలు మున్నంగి? అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.కరణ్ జోహార్ నుండి బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సిద్ధార్థ్ మల్హోత్రా వరకూ… ‘షేర్షా’ దర్శకుడు విష్ణువర్థన్ మొదలుకుని…
‘పంచతంత్రం’లో దేవిగా దివ్య శ్రీపాద: ఆమె పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఆదివారం (సెప్టెంబర్ 5) దివ్య శ్రీపాద పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దేవి పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారని దర్శక-నిర్మాతలు తెలిపారు.ఈ సందర్భంగా ‘పంచతంత్రం’తో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ “మా సినిమాలో… కొత్తగా పెళ్లై సాధారణ మధ్య తరగతి కుటుంబంలోకి అడుగుపెట్టిన దేవి పాత్రలో దివ్య కనిపిస్తారు. సినిమాల్లో అన్ని క్యారెక్టర్లను అందంగా, ఆసక్తికరంగా రాసుకున్నాం. అన్నిటి కంటే దేవి…
‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ కొత్త సినిమా టైటిల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’
‘బిగ్ బాస్’ ఫేమ్, యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ కొత్త సినిమాకు ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆదివారం ఈ టైటిల్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టైటిల్ ఆసక్తికరంగా, కొత్తగా అనిపిస్తోంది. టైటిల్ రోల్‌లో సోహైల్ సందడి చేయబోతున్నారు. కథా కథనాల పరంగా చూస్తే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని తెలుస్తోంది.హీరో సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రంలో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడు. అతని పాత్ర, కథాంశం విభిన్నంగా ఉంటాయి. పిల్లలకూ, పెద్దలకూ నచ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి.…
