సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వచ్చిన మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు …దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ కావడంతో సహజంగానే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మహేష్ బాబు … త్రివిక్రమ్ కాంబో అంటే సినిమాపై ఏ విధంగా అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. బాక్సాఫీస్ ఫలితాల్ని పక్కన పెడితే వాటికి…
Category: రివ్యూస్
HanuMan Movie Review in Telugu: ఆకట్టుకునే ‘హనుమాన్’
‘హనుమాన్’ పేరు వింటేనే మనలో ఏదో అలజడి.. ఏదో ధైర్యం.. గత కొన్ని రోజులుగా సినీ ప్రేక్షకులతో పాటు, సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సినిమాఇది. ఈ సినిమా పేరు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తున్నదని చెప్పొచ్చు. వర్సటైల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన తొలి భారతీయ సూపర్ హీరో మూవీగా ‘హనుమాన్’ నేడు (12 జనవరి-2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి పోటీలను లెక్కచేయకుండా ధైర్యంగా థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకుల మనసులను గెలుచుకుందా? తెలిసుకుందాం… కథ: అంజనాద్రి అని ఒక చిన్న పల్లెటూరు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఊరు ఇది. ఆ ఊరిలో అల్లరి, చిల్లరిగా తిరుగుతూ, చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ హనుమంతు (తేజ సజ్జ)తో…
Salaar Review In Telugu: ‘సలార్’ మూవీ రివ్యూ : మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్!
By M.D ABDUL/Tollywoodtimes ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ కోసం అభిమానులేకాదు.. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.. అలాంటి ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య నేడు (22 డిసెంబర్-2023) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ అభిమానులను ఎంతమేరకు మెప్పించింది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకుందా.. లేదా? తెలుసుకుందాం… కథేంటో చూద్దాం : అసోంలోని ఓ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు దేవా అలియాస్ సలార్ (ప్రభాస్). ఆ ప్రాంతానికి ఆధ్య (శృతిహాసన్)అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువస్తారు . దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అక్కడినుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారి బారి నుంచి ఆమెను కాపాడుతాడు…
Hi Nanna Review in Telugu: ఫీల్ గుడ్ సినిమా!
న్యాచురల్ స్టార్ అన్న పేరుకు తగ్గట్టే నాని నటన చాలా సహజంగా ఉంటుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రల్లో ఆయన ఇట్టే ఒదిగిపోతారు. రొమాంటిక్ సినిమాల్లో నటన తోటి యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ‘దసరా’ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. నాని లుక్‌కు, నటనకు మంచి పేరొచ్చింది. నాని తాజాగా ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వటంలో ముందుండే కథానాయకుడు నాని. మరోసారి ఈ సినిమాతో శౌర్యవ్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. శౌర్యవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని పాత లుక్‌లో కనిపించారు. మరి, కెరీర్‌లో ఎక్కువ విజయాలు తెచ్చిన పెట్టిన జోనర్‌లో నాని సక్సెస్…
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ రివ్యూ : ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాయే..!
టాలీవుడ్ లోమనకు రేసుగుర్రం, కిక్, కిక్ 2, టెంపర్ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి దర్శకుడు వక్కంతం వంశీ అనగానే . అయితే రైటర్‌గా ఎన్నో సక్సెస్‌లు చూసిన వక్కంతం వంశీ దర్శకుడిగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తీసుకుని ఈ కథను రెడీ చేసుకున్నాడు. ‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలన్న కసి ఆయనలో మెండుగా ఉంది. చాలా గ్యాప్ తీసుకుని నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ను తీశాడు. ఈ సినిమాతో నితిన్, వక్కంతం వంశీ ఇద్దరూ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. రచయితగా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన వక్కంతం వంశీ మరి ఈ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా? లేదా ఓ సారి చూద్దాం. టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా…
Anvishi Telugu Movie Review : అన్వేషి మూవీ రివ్యూ : సస్పెన్స్ డ్రామా !
విజయ్ ధరణ్ దాట్ల హీరోగా సిమ్రాన్ గుప్తా హీరోయిన్ గా వచ్చిన సినిమా అన్వేషి. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు వచ్చింది.. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…. కథ : డాక్టర్ అను (అనన్య నాగళ్ళ) తన తండ్రి కోరిక మేరకు సొంతూరులో అను హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేస్తోంది. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అను హాస్పిటల్ అగ్ని ప్రమాదంలో తగలబడి, డాక్టర్ అను, ఆమె తండ్రి చనిపోతారు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అను హాస్పిటల్ చుట్టూ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో విక్రమ్ (విజయ్ ధరణ్ దాట్ల) ఆ హత్యల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని ప్రయత్నాలు…
SPARK Telugu Movie Review in Telugu: సరికొత్త అనుభూతిని పంచే ‘స్పార్క్’
(చిత్రం: స్పార్క్, నటీనటులు : రేటింగ్ : 3.5/5, విక్రాంత్ రెడ్డి , మెహరీన్ కౌర్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, వెన్నెల కిశోర్, నాజర్, సుహాసిని, సత్య, అన్నపూర్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. దర్శకత్వం : డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్, నిర్మాత : లీలా రెడ్డి, సంగీత : హేషమ్ అబ్దుల్ వాహాబ్ , సినిమాటోగ్రఫీ : ఏ.ఆర్.అశోక్ కుమార్). ఈ దీపావళి కానుకగా అనేక చిత్రాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. అలా విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా సందడి చేసింది లేదు. ఫలితంగా రాబోయే సినిమాల మీద ప్రేక్షకులు దృష్టిసారించారు. అలా ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి ఈ వారం ‘స్పార్క్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే వచ్చిన పాటలకి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ‘ఏం…
‘కోటబొమ్మాళి పీఎస్’ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ అందిస్తుంది : శివాని రాజశేఖర్ ఇంటర్వ్యూ …
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు… ఈ ప్రాజెక్టులో మీరు ఎలా భాగమయ్యారు? -‘ఆర్టికల్ 15’ తమిళ్ రీమేక్ లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో ట్రైబల్ అమ్మాయి పాత్ర పోషించాను. ఇందులోనూ అలాంటి తరహా పాత్ర కావడంతో ఆయన నన్ను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎన్నో మార్పులు చేశారు. షూటింగ్ మొదలయ్యాక సినిమాపై నాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ…
‘కీడా కోలా’తో నా కల నెరవేరింది : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం
‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం ‘దీక్ష’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ వివరాలు… ‘కీడా కోలా’ ఐడియా ఎప్పుడు.. ఎలా వచ్చింది? లాక్ డౌన్ చాలా మంది రకరకాలుగా వినూత్నంగా…
Tiger nageswara rao telugu movie review : ఆకట్టుకునే ‘టైగర్ నాగేశ్వరరావు’
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చతాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (20, అక్టోబర్- 2023) ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తడానికి థియేటర్లల్లో అడుగుపెట్టింది. మరి.. అనుకున్న అంచనాలను ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం…. కథ : దొంగతనాలే వృత్తిగా కాలం గడుపుతుంటారు స్టూవర్టుపురం ప్రాంతంలోని ప్రజలంతా. వారి ఆకలిని, అవసరాలను అవకాశంగా చేసుకుని.. అక్కడి అధికారులు వారిని తమకు అనుగుణంగా వాడుకుంటూ దోచుకుంటూ ఉంటారు. అంతటితో ఆగకుండా వారిని అణిచివేస్తుంటారు. ఇవన్నీ చూసి పెరిగిన నాగేశ్వరరావు (రవితేజ) తన స్టూవర్టుపురం ప్రజల బాగు కోసం ఏం చేశాడు? ఆయా పరిస్థితులపై ఎలాంటి పోరాటం…