ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్ గౌడ్ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ గారి కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్ బాగా పెరిగినట్లుగా…
Category: Politics
బిజెపికి విక్రమ్ గౌడ్ రాజీనామా..త్వరలో కాంగ్రెస్ లో చేరిక !!!
హైదరాబాద్ : ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్ గౌడ్ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్ లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్…
రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజహరుద్దీన్
నూతన సంవత్సరం సందర్భంగా టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు సెక్రటేరియట్ లో మంత్రులతో కలసి సందడిగ ముచ్చటించారు. సీఎంను, మంత్రులను కలిసిన వారిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఫహీం, కాంగ్రెస్ నేత అసదుద్దీన్ కూడా ఉన్నారు. ఈ సదర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ… ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిచి… కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో చాలా బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు.
మైనార్టీ కోటాలో మంత్రి ఎవరో..?!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో కొలువుదీరిన మంత్రి వర్గ కూర్పులోనూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ కనిపించింది. మొత్తం పదకొండు మంది మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువుదీరారు. అయితే ఇందులో మాత్రం మైనారిటీలకు చోటు లభించలేదు. కారణం… మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటం వల్లనే… ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఆయా సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులు వరించనున్నాయని ఇప్పటికే సంకేతాలందాయి. దాంతో ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తోందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతే పరాజయం చెందిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా…
తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన వచ్చింది : సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 10 : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటికి వెంటనే శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఆర్.ఐ గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి గతంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే, ఐఎన్ టీయూసీలో చురుకైన పాత్రని పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లో నూతనోత్సాహం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా ఆయన శుభాకాంక్షలు అందజేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం; ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న బీమా పరిమితిని…
నిరంతర విద్యుత్‌పై కాంగ్రెస్ విమర్శలు అర్థరహితం : బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్
తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని వినియోగదారు లందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నదని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బోట్ల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 18,453 మెగావాట్లుగా ఉంది. రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.12,727 కోట్లు కేటాయించి, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.1,500 కోట్లకు పెంచింది. విద్యుత్ తలసరి వినియోగం 2014`15లో 1,356 యూనిట్లుగా ఉంది. 2021`22 నాటికి ఇది 2,126 యూనిట్లకు పెరిగింది. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లుగా ఉంది. గత 9 సంవత్సరాలలో అన్ని వర్గాలకు రూ. 39,321 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110…
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు : జంపాల శ్రీనివాస్
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బిజెపి రాష్ట్ర నాయకులు జంపాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన నిధులవల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరగనుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు రూ.573.13 కోట్లు విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్-భూపాలపట్నం సెక్షన్‌లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్‌కర్నూల్ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు, ఎన్‌హెచ్-167కేలో లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నారని, ఈ రహదారి వల్ల హైదరాబాద్ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల…
మా గుండె ధైర్యం.. మా ఆత్మబంధువు, సునీతమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
నవతరానికి నాయకురాలిగా, యువతరానికి ఆదర్శప్రాయురాలిగా, భర్తకు తగ్గ భార్యగా రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ఆపదలో వున్న వారికి నేనున్నానే భరోసా కల్పిస్తున్నారామె. జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఏసీ గదుల్లో , కార్యాలయానికే పరిమితం కాకుండా సబ్బండ వర్గాల సమస్యలపై సునీత దృష్టి పెట్టారు. మారుమూల ప్రాంతాలలోని సామాన్యులతో కలియతిరుగుతూ, వారి కుటుంబంలో మనిషిలా వారికి తలలో నాలుకలా వుంటున్నారు. ఏం జరిగినా మా సునీతమ్మ వుందన్న భరోసాను ఆమె కల్పిస్తున్నారు. ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి పుట్టినరోజు. ఆమె ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం.
స్త్రీ శక్తిని ప్రపంచానికి చాటిన మహిళ ఇందిర : యం.ఏ. ఎజాజ్
ఆలేరులో ఘనంగా మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మాజీ ప్రధాని ‘భారతరత్న’ శ్రీమతి ఇందిరా గాంధీ 105వ జయంతి వేడుకలు స్థానిక ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఆలేరు పట్టణ అధ్యక్షులు యం.ఏ. ఎజాజ్ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ భారతదేశపు తొలి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఎంతో ప్రఖ్యాతిగాంచారని, ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసి అత్యుత్తమ సేవలు అందించారని అన్నారు. 1964 సంవత్సరములో తండ్రి జవహర్ లాల్ నెహ్రు మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికైన ఇందిరాగాంధీ.. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నారన్న విషయాన్ని ఆయన…
‘అగ్నిపథ్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అలేరులో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
టాలీవుడ్ టైమ్స్ # ఆలేరు ‘అగ్నిపథ్’ దేశాన్ని అగ్నిగుండం లా మార్చింది : ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు మేరకు ఆలేరు పట్టణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య గారు.. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండల,టౌన్ పార్టీ ల అధ్యక్షులు,ఎంపీపీలు,సర్పంఫులు గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్…