హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీఓలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను…
Category: Others
Prize giving ceremony of the Ekagra International Open Rapid Chess Tournament held at Hitex
Hyderabad, December 21: The prize distribution ceremony of the Ekagra International Open Rapid Chess Tournament was held in a grand manner at the second hall of Hitex Exhibition Centre in Hyderabad. Anyanappa from Chennai, who emerged as the winner of the tournament which started on Saturday , won the first prize with a prize money of Rs 5 lakh, while Mitroba received Rs 3 lakh as the second prize, Harikrishna received Rs 1 lakh as the third prize and the remaining amount of Rs 13 lakh 22 thousand 222 was…
హైటెక్స్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం
హైదరాబాద్ , డిసెంబర్ 21: హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో హాల్‌లో ఏకాగ్ర ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. శనివారం ప్రారంభమైన ఈ టోర్నమెంట్ పోటీలలో విజేత లుగా నిలిచిన చెన్నై కి చెందిన అన్యానప్ప 5 లక్షల ప్రైజ్ మనీతో మొదటి బహుమతి దక్కించు కోగా, రెండవ బహుమతి కింద 3 లక్షల రూపాయలు మిత్రోబకు, మూడవ బహుమతిగా హరికృష్ణకు లక్ష రూపాయలు అలాగే వివిధ క్యాటగిరిలు, ర్యాంకింగ్ ల ప్రకారం మిగతా మొత్తం అంటే 13 లక్షల 22 వేల 222 రూపాయలను బహుమతులు పొందిన వారికి అందజేశారు. ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి నాంపల్లి కాంటెస్టెడ్ శాసనసభ్యులు ఫెరోజ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. పిల్లల్లో ఏకాగ్రతను, మేధాశక్తిని…
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది : దగ్గుబాటి పురంధేశ్వరి
హైదరాబాద్ : రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనది అని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ రామారావు గారు పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని, పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన 1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని శనివారం హైదరాబాద్ ఎఫ్.ఎన్.సి.సి లో నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్న పురంధేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన జరిగింది. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు, బొల్లినేని…
జర్నలిస్టుల మహా ధర్నా గ్రాండ్ సక్సెస్
పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ .. మాసాబ్ ట్యాంక్ లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ)ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మహా ధర్నా అనూహ్యరీతిలో విజయవంతం అయ్యింది. టీయూడబ్ల్యూజే పిలుపుపై స్పందించి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర నలుమూలల నుండి ఏంతో ఉత్సాహంగా, భారీగా జర్నలిస్టులు తరలి రావడం విశేషం. జర్నలిస్టుల నినాదాలతో మహానగరం రోడ్లన్నీ దద్దరిల్లాయి. సమాచార శాఖ చరిత్రలో, ఆ కార్యాలయం వద్ద ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ధర్నా చేయడం ప్రప్రథమని పోలీసు అధికారులతో సహా పలువురు సీనియర్ పాత్రికేయులు చర్చించుకోవడం విశేషం. ఈ మహా ధర్నాకు యూనియన్ అనుబంధ సంస్థలైన తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న,…
3న జరిగే జర్నలిస్టుల మహా ధర్నా విజయవంత చేయండి :విరాహత్ అలీ
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల కాలంలో అత్యంత నిరాదరణకు గురైన వర్గం జర్నలిస్టులేననడంలో ఎంత మాత్రం సందేహం లేదని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జర్నలిస్టుల జీవితాలు గత పుష్కర కాలంలో ఏ మాత్రం మెరుగు పడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు సైతం అందకుండా పోయాయి. నాడు పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక వృత్తి సౌకర్యాలు సైతం మాయమైపోయాయి. ఉద్యమ కాలంలోనూ, ఆ తర్వాత పదేళ్ల పాలనలోనూ బీఆర్ఎస్ ఇచ్చిన…
రవీంద్రభారతిలో భాగ్యనగర్ నృత్యోత్సవం
శ్రీకీర్తి నృత్య అకాడమి ఆధ్వర్యంలో మంగళవారం డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భాగ్యనగర్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ ఆంధ్రనాట్యం గురు డాక్టర్ సజని వల్లభనేని, డ్యాన్స్ ఇండియా సంపాదకులు డాక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. తొలిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న భాగ్యనగర్ నృత్యోత్సవాల్లో పాల్గొనేందుకు దేశం లోని వివిధ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా ప్రముఖ నాట్య కళాకారులు పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసారని వారు వివరించారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు. ఇటలీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సి, చౌ నృత్య కళాకారిణి ఇలియానా సిటారిస్టిని మహంకాళి మోహన్ జాతీయ స్మారక పురస్కారంతో సత్కరించనున్నారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ దివ్యసేన (భరతనాట్యం), కర్ణాటక…
నవంబర్ 28న సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘సంకల్ప్ దివాస్’
హైదరాబాద్: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ సుచిరిండియా ఫౌండేషన్ ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని…
అపురూపం ఆలోచనాత్మకం దుశ్శల ఏకపాత్రాభినయం
* దుశ్శల పాత్రలో జీవించిన అలేఖ్య పుంజాల అభినయ తపస్వి డాక్టర్ అలేఖ్య పుంజాల మరోసారి తన నట విశ్వ సౌరభాన్ని చాటుకున్నారు. గాంధారి కుమార్తెగా, వంద మంది కౌరవులకు చెల్లెలు అయిన దుశ్శల పాత్రలో జీవించి రాణించి మెప్పించారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, త్రిష్ణ కూచిపూడి డాన్స్ అకాడమి, సూత్రధార్ యాక్టింగ్ ట్రైనింగ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. 70 నిముషాలు పాటు నాన్ స్టాప్ అభినయ వాచకంతో ఆమె విశేషంగా ఆకట్టుకున్నారు. కూచిపూడి నాట్య గురువుగా నర్తకీమణి గా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తనదైన గుర్తింపు పొందిన అలేఖ్య పుంజాల ప్రత్యేక దుశ్శల పాత్రలో మంచి నటీమణి అని నిరూపించుకున్నారు. అనాదిగా…
పథకం ప్రకారమే మహిళా జర్నలిస్టులపై అసభ్యకర పోస్టులు
-మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతినిధి బృందం -కఠినచర్యలు తప్పవు కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా హామీ ఇచ్చారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్…
