యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెస్‌నోట్ – డేట్: 23/08/2021 తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ ఆగస్టు 20, 2021న మీడియా సమావేశం నిర్వహించింది. దానికి సంబంధించిన ఈ ప్రెస్‌నోట్ విడుదల చేస్తున్నాం.మన చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ ఆఫీసర్ బేరర్స్ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండిస్తోంది.మేం మళ్లీ మళ్లీ చెప్పేది ఏంటంటే…తొలుత సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే. ప్రాథమికంగా థియేటర్లలో విడుదల చేయాలని ఎల్లప్పుడూ భావిస్తాడు. గతంలో శాటిలైట్, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో… ఈ మార్గాలు అన్నిటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ…
Category: MOVIE REVIEWS
దర్శకుడు బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్
గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ” అల్లంత దూరాన”. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు.అనంతరం బాబి మాట్లాడుతూ, “మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్రబృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు.ఇక ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను…
Hombale Films’ ‘SALAAR’ poster reveal: Jagapathi Babu to feature in the mass action adventure as Rajamanaar.
From the producer and director of KGF CHAPTER 1 and KGF CHAPTER 2, comes yet another larger-than-life movie titled ’SALAAR’. Headlined by superstars Prabhas and Shruti Haasan, the film is a mass, action, adventure produced by Hombale Films. Today team SALAAR released an intriguing, new poster of the movie. The poster features Jagapathi Babu in the skin of Rajamanaar, a character who is going to play one of the most pivotal roles in the movie. Leaving the audience even more in anticipation of the movie, the new poster reveals little…
ప్రభాస్, హోంబలే ఫిలింస్ భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో రాజమన్నార్‌గా జగపతిబాబు.. లుక్ పోస్టర్ విడుదల
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ సలార్. కె.జి.యఫ్ ఛాప్టర్ 1తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసి, కె.జి.యఫ్ ఛాప్టర్2తో మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతూ లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను నిర్మిస్తోన్న హోంబలే ఫిలింస్ నిర్మిస్తోన్న భారీ మాస్, యాక్షన్, అడ్వెంచరస్ మూవీ ‘సలార్’.శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని మరో పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాజమన్నార్ అనే పాత్రను విలక్షణ నటుడు జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇది చాలా కీలకమైన పాత్ర. ఈ లుక్ పోస్టర్‌కు టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుంది. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉందీ పోస్టర్.కె.జి.యఫ్ సిరీస్…
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా `సైదులు` చిత్రం లోగో లాంచ్!!
బ్రేవ్ హార్ట్ పిక్చర్స్ పతాకంపై బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం“సైదులు“. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ తన నివాసంలో ఆవిష్కరించారు.అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ…“సైదులు` టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సినిమాకాన్సెప్ట్ కూడా విన్నాను ఎంతో ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించియూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు. చిత్ర దర్శకుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ…“మా చిత్రం టైటిల్ లోగో హీరో శ్రీకాంత్ గారులాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ప్రీ -ప్రొడక్షన్ అంతా పూర్తయింది.అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయడానికిప్లాన్ చేస్తున్నాం. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్ర కథ…
చిరు 154 …బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ విషయాన్ని శనివారం మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందని ఆ పోస్టర్ ద్వారా అర్థమైంది. ఆదివారం(ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు విషెష్ తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.పోస్టర్‌ను గమనిస్తే.. తలకు రెడ్ టవల్ చుట్టుకుని, బీడి కాలుస్తూ, లుంగీ కట్టుకుని నిల్చున్న చిరంజీవి లుక్ ఊరమాస్‌గా అనిపిస్తుంది. చేతిలో లంగరు(యాంకర్) పట్టుకుని బోటుపై చిరంజీవి స్టైల్‌గా ఉన్నారు. అటు పక్కనున్న జెండాపై చిరంజీవి ఇష్టదైవం హనుమంతుడు కనిపిస్తున్నాడు. ఉదయిస్తున్న సూర్యుడు చిరంజీవి అనే విషయాన్ని తెలియజేసేలా అప్పుడే తెల్లవారుతుండగా పైకి వస్తున్న సూర్యుడిని కూడా పోస్టర్‌లో…
Megastar Chiranjeevi’s Vintage Look For Bobby, Mythri Movie Makers Film
Megastar Chiranjeevi’s 154th film under the direction of Bobby was announced officially yesterday with a picture that hinted the film’s story is set in the backdrop of sea. The makers have unveiled another poster on Chiranjeevi’s birthday that presents Chiranjeevi in a mass avatar.Sporting red towel, smoking a beedi, lungi-clad Chiranjeevi looks oora mass in the poster, as he carries an anchor standing on a ship. The flag shows the image of Chiranjeevi’s favorite god- Hanuman. Chiranjeevi is shown as rising sun, as the sun is just about to rise…
భోళా శంకర్‌లాంటి మనసున్న సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తిసురేశ్
ఆదివారం(ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అలాగే రక్షా బంధన్ కూడా. ఈ సందర్భంగా చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం భోళా శంకర్ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. అలాగే నేషనల్ రేంజ్‌లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. రక్షా బంధన్ సందర్భంగా కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ కట్టిచెల్లెలందరీ రక్షాబంధం… అభిమానులందరి ఆత్మ బంధం… మన అందరి అన్నయ్య జన్మదినం.. హ్యాపీ బర్త్ డే అన్నయ్య… అంటూ ఆయనకు పుట్టినరోజు అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో అన్నాచెల్లెల మధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ ..అన్నా చెల్లెలుగా ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో…
Keerthy Suresh Ties Rakhi To His Bholaa Shankar Brother Megastar Chiranjeevi
It’s megastar Chiranjeevi’s birthday today and it’s Raksha Bandhan as well. Title poster of Bholaa Shankar gets overwhelming response and it is trending top nationwide.To be directed by Meher Ramesh, Keerthy Suresh plays Chiranjeevi’s sister in the film which is set in the backdrop of Kolkata. The actress on the eve of Raksha Bandhan has tied the rakhi to Chiranjeevi and also wished him happy birthday.“Chellellandari Raksha Bandham… Abhimanulandari Athma Bandham… Mana Andari Annayya Janma Dinam… Happy Birthday Annayya…”Brother and sister bonding is going to be one of the major…
గణేశ్ బెల్లంకొండ హీరోగా రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం.. లాంఛనంగా ప్రారంభం
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ బెల్లంకొండ మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా చేసిన తొలి రెండు చిత్రాల షూటింగ్ తుది దశకు చేరుకున్నాయి.ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తొలి చిత్రంగా నాంది వంటి డిఫరెంట్ మూవీని నిర్మించి.. సూపర్ హిట్ కొట్టి అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్న నిర్మాత సతీశ్ వర్మ తన బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా గణేశ్ బెల్లంకొండ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్‌కు రాకేశ్ స్క్రీన్ ప్లే రాయగా, కథను అందించిన ప్రముఖ రచయిత కృష్ణ చైతన్య మాటలు, పాటలను కూడా రాస్తున్నారు.సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి…
