సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల ఆయన క్షణం నుంచే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే….. “లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్ ల టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల” అనే ఈ పల్లవి గల గీతాన్ని గీతా రచయిత…
Category: MOVIE REVIEWS
ఒమిక్రాన్ దెబ్బకు అజిత్ ‘వాలిమై’ విడుదల వాయిదా
అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కావాల్సివుంది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులు.. రోజు రోజుకి పెరిగిపోతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో.. ఈ భారీ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని నిర్మాత బోనీకపూర్ తెలియచేసారు. ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ: “అభిమానులు, సినీ ప్రేక్షకజనం ఎంతో ఆసక్తి గా మీరు ఎదురుచూస్తున్న ‘వాలిమై’ చిత్రాన్నివాయిదా విడుదల వేసినందుకు మేము చాలా చింతిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్యా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం. మీరు సురక్షితంగా, ఎంతో ఆనందంగా థియేటర్లలో స్వేచ్ఛగా వీక్షించాల్సిన అవసరాన్ని దృష్టిలో…
సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను ‘హీరో’ తీరుస్తుంది : ఆదిశేషగిరి రావు
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మనం అశోక్ గురించి మాట్లాడాలి. అతని గురించి ఎవ్వరికీ తెలియదు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి గల్లా జయదేవ్ పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్ల నుంచి వేసిన ముద్ర అందరికీ తెలిసిందే. ఆయన నానమ్మ గల్లా అరుణ గారు ఎమ్మెల్యేగా సేవలు…
Ashoka Galla Has Done Humour With Ease In Hero: Sriram Aditya
Superstar Krishna’s grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla is getting introduced as hero with an upcoming film Hero Hero directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment banner. The film is all set for a grand release worldwide on January 15th for this Pongal. The team hold a press meet today and it was attended by Ashok Galla, Nidhhi Agerwal, Sriram Aditya, Jayadev Galla, Padmavathi Galla and Adiseshagiri Rao. Adiseshagiri Rao informed that his brother superstar Krishna…
‘మా ఏపీ’ ఎన్నికలకు రంగం సిద్ధం : ‘ఏపీ మా’ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దిలీప్ రాజా
‘మా ఏపీ’ ఎన్నికలకు రంగం సిద్ధం చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. గతంలో కరోనా వలన యూనియన్ నియమ నిబంధనల మేరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కార్యవర్గంలో అధ్యక్షులుగా ఉన్న సీనియర్ నటి కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శి అన్నపూర్ణల పదవీ కాలం ముగిసిందని ఆయన తెలిపారు. జాయింట్ సెక్రటరీగా ఉన్న సీనియర్ హాస్య నటి శ్రీలక్ష్మి తెలంగాణా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా ఆమెను పదవి నుంచి నియమ నిబంధనల మేరకు రెండు యూనియన్‌లలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఆమెను మా ఏపి నుండి తొలగించినట్లుగా దిలీప్ రాజా వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టం నిబంధనల మేరకు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలనే ఆలోచనతో 2018లో…
‘అతిథి దేవో భవ’ ఏ ఒక్కరినీ నిరాశ పరచదు: ‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి
ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్‌గా ‘అతిథి దేవో భవ’ అనే సినిమాను డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించారు. రాం సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీ మెంబర్స్ సినిమా తీస్తే మంచిదే తీస్తారు.. చెడ్డది తీయరని నాకు తెలుసు. మొన్నే ఈ సినిమాను తీశాను. డీసెంట్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంది. సప్తగిరి గారు సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తారు. ఓ రెండు మూడు నిమిషాలుండే దొంగ కారెక్టర్ చాలా బాగుంది. రోహిణి గారు బాగా చేశారు.…
‘అతిధి దేవోభవ’ అందరినీ మెప్పిస్తుంది: ఆది సాయి కుమార్
ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన ‘అతిథి దేవోభవ’ జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఇందులో నువేక్ష కథానాయిక. బుధవారంనాడు హీరో ఆది చిత్రం గురించి పలువిషయాలు తెలియజేశాడు. – నా నటన అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. స్క్రిప్ట్‌లో అంతర్లీన భావోద్వేగ అంశం ఉంది. నా రాబోయే సినిమాలు డిఫరెంట్ జోనర్‌లకు చెందినవి. సినిమాలు బాగా చేస్తాయనే నమ్మకం ఉంటేనే ఒప్పుకుంటున్నాను. – నా సినిమాల్లో కొన్ని రిలీజ్ డేట్ ఆలస్యం కారణంగా నష్టపోయాయి. ‘రఫ్’, ‘చుట్టాలబ్బాయి’ చిత్రాలకు సరైన డేట్స్ వచ్చాయి. – ఇక తాజా సినిమా ఎగ్జిక్యూషన్ పార్ట్‌ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేసిన ‘అతిథి దేవోభవ’పై నాకు నమ్మకం ఉంది. పాటలు…
రాజశేఖర్ ‘శేఖర్’ ఫస్ట్ సింగిల్ ‘లవ్ గంటే మోగిందంట..’ విడుదల
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. బుధవారం (జనవరి 5న) ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. “ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా” అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్ కి చంద్రబోస్ గారి సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్,…
నందమూరి బాలకృష్ణ # NBK107లో వరలక్ష్మీ శరత్ కుమార్
‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నటిసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా ‘క్రాక్’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ మూవీ రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’ చిత్రం నటిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో పవర్…
‘ట్రిపుల్ ఆర్’కు ఎన్టీఆర్ పారితోషికం ఎంతో తెలుసా?
టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆ ఇమేజ్ కోసం దేనికైనా రెడీయే అంటున్నారు. అలాంటి ఇమేజ్ వస్తే వంద కోట్లకు పైగా పారితోషికం వస్తుందని కలలుగంటున్నారు. కానీ అదే సమయంలో పరుగెడుతున్న కాలం గురించి మాత్రం మరచిపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ‘ట్రిపుల్ ఆర్’ విషయానికొద్దాం.. పాన్ ఇండియా ఇమేజ్ కోసం చూసుకుంటే ఈ సినిమాకు సంబంధించి అతడికి నాలుగేళ్ల కాలం వృధా అయిపోయిందిట. కనీసం ఈ సమయంలో ఆరేడు సినిమాలు చేసినా రెండు నుంచి మూడు వందల కోట్ల పారితోషికం అయినా వచ్చి వుండేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. పైగా ఆ సినిమాల్లో ఏ రెండో మూడో బ్లాక్ బస్టర్ అయినా ఈ పారితోషికం మరి కాస్త ఎక్కువే అయి వుండేదని అంటున్నారు. అయితే.. డి.వి.వి సినిమాస్ బ్యానర్ పై…
