అతడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే..

He's just a friend..

‘అబ్బే మా మధ్య డేటింగ్, గీటింగ్స్ ఏమీ లేవు.. అతడు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు’ అంటూ తమపై వస్తున్న డేటింగ్ రూమర్లపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాములుగా గాసిప్స్ వస్తున్నాయంటే ఎవరైనా సరే కాస్త జాగ్రత్త పడతారు కానీ.. ధనుష్-మృణాల్ జోడీ మాత్రం హైలెట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మృణాల్, ధనుష్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే మళ్లీ తమవైపు అటెన్షన్ గ్రాబ్ అయ్యేలా చేస్తున్నారు. ధనుష్-మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త ఇప్పటిదీ కాదు. ఇద్దరు కలిసి పార్టీల్లో సందడి చేయడం, సన్నాఫ్ సర్దార్ 2 ప్రీమియర్స్‌కు ధనుష్ రావడం, ఆమెతో క్లోజ్‌‌గా మూవ్ కావడంతో డేటింగ్ రూమర్లకు రెక్కలొచ్చాయి. తేరీ ఇష్క్ మే రిలీజ్ టైంలోనూ ఇలాంటి కథలొచ్చాయి.…

ఘనంగా ప్రియదర్శి, సాయి కుమార్ “సుయోధన” మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న సినిమా

Priyadarshi, Sai Kumar's "Suyodhana" movie pre-release press meet in grand style, the movie is set to have a grand worldwide release on the 27th of this month

నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రం సుయోధన : సాయి కుమార్ ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం “సుయోధన”. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ “సుయోధన” సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ – నేను ఈ సినిమాలోకి రావడానికి…

‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ… రొమాంటిక్ డ్రామా!

'Band Melam' Movie Review... Romantic Drama!

‘కోర్ట్’ ఫేమ్ జోడి హర్ష్ రోషన్, శ్రీదేవి ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ గురువారం థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం… కథ: చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్న బావా మరదళ్లు యాదగిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి). రాజి చదువులో రాణిస్తుంది, కానీ యాదగిరి స్కూల్ డ్రాపౌట్. రాజి పెరిగి పెద్దయ్యాక యాదగిరిని మర్చిపోతుంది. అయితే.. అతను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతేగాక మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరి యాదగిరి తన జీవితంలో విజయం సాధించి, రాజి ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ. విశ్లేషణ: ‘బ్యాండ్ మేళం’లో మేజర్ డ్రా బ్యాక్ కథ. పాతచింతకాయ పచ్చడిలా సాగే ఈ తరహా కథలు టాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాల్లో…

బర్బరీకుడు ద సన్నాఫ్ ఘటోత్కచ..

The barbarian is the son of Ghatotkacha..

పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ బ్యానర్ లపై టి. మల్లేశ్వరుడు, అంతటి నరేష్ కుమార్, అంతటి రాజేష్ కుమార్ నిర్మాతలుగా శివఝాన్సీరేగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బర్బరీకుడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బర్బరీకుడు చిత్రం ఘనంగా పూజా కార్యక్రమం జరుపుకుంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలోని ఒక యోధుడి కథతో ఈ చిత్రం తెరక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్త శిష్యుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, అలాగే పాటల రచయితగా పనిచేసిన శివఝాన్సిరేగాల ఈ చిత్రంతో దర్శకుడుగా అరంగేట్రం చేస్తున్నారు. తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టేందుకు భారతీయ అతిపెద్ద ఇతిహాసం మహాభారతంలోని ఒక యోధుడి కథను తెరకెక్కించబోతున్నారు. ఈ విషయంలో దర్శకుడు తో పాటు నిర్మాతల అభిరుచిని కూడా…

‘ఫంకీ’ బ్యూటీకి బంపరాఫర్!

A bumper offer for the 'funky' beauty!

అందం, అభినయం కలగలిసిన అస్సాం సుందరి కయాదు లోహర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. వెండితెరపై గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించడమే కాదు, నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించుకున్న ఈ భామకు ఇప్పుడు అదృష్టం గట్టిగా తలుపు తట్టింది. కెరీర్ ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సక్సెస్ రేటుకు మారుపేరుగా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్‌లతో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ జోడీగా కయాదు లోహర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అపజయం ఎరుగని అనిల్ రావిపూడి సినిమాలో అవకాశం దక్కించుకోవడం అంటే ఈ ముద్దుగుమ్మ కెరీర్ మలుపు తిరిగినట్లేనని…

‘పోకిరి’ రీ-రిలీజ్‌ లేనట్టేనా?

Is there no re-release of 'Pokiri'?

హీరోల మేనరిజాన్ని మార్చాలన్నా, వెండితెరపై మాస్ డైలాగులతో మంటలు పుట్టించాలన్నా టాలీవుడ్‌ డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పూరీ జగన్నాథ్ కే సాధ్యం. అతి తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే డైరెక్టర్‌గా ఆయన పేరుగాంచారు. ఆయనలాంటి సీన్స్, డైలాగులు రాసే దర్శకుడు ఇండియాలోనే లేరు అని సాక్షాత్తూ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసించారంటే పూరీ ‘పెన్ పవర్’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం అదే పూరీ జగన్నాథ్ తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పూరీ సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల్లో హాట్ కేక్‌లా అమ్ముడయ్యేది. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన ‘లైగర్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం…

ఆఆహా ఓటీటీలో దుమ్ము రేపుతున్న ‘తురుమ్ ఖాన్’లు.. మొదలు పెడితే నవ్వుతూనే ఉంటారు

Aaah, the 'Turum Khans' that are creating dust in OTT... Once they start, they will keep laughing

స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెలంగాణ యాస, భాష నేపథ్యంలో విలేజ్ నేటివీటితో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తురుమ్ ఖాన్ లు. ఈ సినిమా గురించి తెలిసిన ప్రేక్షకులు ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా తురుమ్ ఖాన్ లు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కామెడీ బిట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ సన్నివేశాలతో ఆధ్యాంతం అలరించేలా సాగే ఈ చిత్రం ఇన్నాళ్లు ఎక్కడ ఉందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు అంటే… ఈ చిత్రం వారి హృదయాలకు ఎంతలా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటికైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్వాహకులకు…

దటీజ్… ప్రియదర్శన్!

That's... Priyadarshan!

ఇలాంటి రికార్డ్ ప్రపంచంలోనే ఏ దర్శకుడికి వుండదు… వుండబోదు కూడా. 100 సినిమాలు తీసిన దర్శకులు చాలామందే వుంటారు. కె. రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, కోడి రామక్రుష్ణ లాంటి వారు. అయితే తొలి సినిమా తీసిన హీరో తోనే 100 వ సినిమా తీసే చాన్స్ వచ్చింది మాత్రం ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కు మాత్రమే. 1984 లో ఆయన మోహన్ లాల్ హీరో గా ‘పూచక్కోరు మూక్కుతి ‘ అనే సినిమా తీశారు. ఇది ప్రియదర్శన్ తొలి సినిమా. ఈ నలభై రెండేళ్ళలో ఆయన అనేక భాషల్లో 99 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తన 100 వ సినిమాను, తన తొలి హీరో మోహన్ లాల్ తో తీస్తున్నట్టు ప్రకటించాడు. ఈ 42 ఇయర్స్ లో వాళ్ళిద్దరూ ఏమాత్రం అలసిపోకుండా,…

శివానీ నాగరం : సింగర్‌ టర్నింగ్‌ యాక్టర్‌!

Shivani Nagaram: Singer-turned-actor!

”కూచిపూడి, సంగీతం నేర్చుకున్నా. సింగర్‌ టర్నింగ్‌ యాక్టర్‌ని. ‘లిటిల్‌ హార్ట్స్‌’ చిన్న హమ్మింగ్‌ ఉంటుంది. ఆరంభం సినిమాలో ఓ పాట పాడాను. అవకాశాలు వస్తే కచ్చితంగా పాడతాను. తెలుగు అమ్మాయినే అయినా సినిమాల్లోకి వెళ్తానంటే, ఇంట్లో వాళ్లు ఎంతో సహకారం అందించారు. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో నిలబెట్టుకున్నా. ఇంట్లో వాళ్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు”అంటూ చెప్పుకొచ్చింది శివానీ నాగరం. ఇటీవల ఓ సందర్భంలో. తనకు వంద సినిమాలు చేసేయాలని లేదని, ప్రేక్షకులు ఇచ్చిన విలువను కాపాడుకోవడమే ముఖ్యమని అంటున్నారు. అందుకే కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ‘లిటిల్‌హార్ట్స్‌’తో వచ్చిన సక్సెస్‌ను అడ్వాంటేజీగా తీసుకుని వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు. కథ నచ్చితే కాంబినేషన్‌తో సంబంధం లేకుండా ఒప్పుకొంటాను. కథ విన్నప్పుడు నేను కథతో కనెక్ట్‌ అవుతున్నానా? నా పాత్రకు…

సారా అలీఖాన్ : విలక్షణమైన వ్యక్తిత్వం

Sara Ali Khan: A unique personality

వారసత్వంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడం కత్తి మీద సామే. తల్లి అమృతాసింగ్‌ గంభీరం.. తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ వాక్చాతుర్యం పుణికిపుచ్చుకున్న సారా అలీఖాన్‌.. నేటి తరం కథానాయికలలో అత్యంత విలక్షణమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె చుట్టూ ముసురుతున్న వివాదాలు, ఆమె ఇంటర్వ్యూలను గమనిస్తే సారా ఒక గ్లామర్‌ డాల్‌ మాత్రమే కాదని, గట్టి పట్టుదల ఉన్న నటి అని అర్థమవుతుంది. గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో సారా అలీఖాన్‌ పేరు మార్మోగుతోంది. దానికి కారణం ఆమె సినిమా మాత్రం కాదు, ఆమె ఆధ్యాత్మిక విశ్వాసాలు. కేదార్‌నాథ్‌ ఆలయానికి ఆమె తరచుగా వెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఆలయ కమిటీలు హిందూయేతరుల దర్శనంపై కొన్ని నిబంధనలు విధుస్తున్నట్టు…