వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, తానే ప్రధాన పాత్రలో నటిస్తూ పక్కా ప్లానింగ్, క్లియర్ విజన్‌తో అనుకున్న సమయానికి షూటింగ్‌ను పూర్తిచేశారు. ఫైనల్ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ‘సరస్వతి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. సరస్వతి చిత్ర షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో…
Category: FILM NEWS
సామాజిక సంస్కర్తల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం : ఆలేరు శానసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
The lives of social reformers are inspiring to today’s generation: Aleru Sanasupulu, Government Whip Beerla Ailaiah
వినోదాత్మక చిత్రాల్నే నిర్మించాలనుకుంటున్నాం : నిర్మాత అనిల్ సుంకర
శర్వానంద్ హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య లు హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివే.. సంక్రాంతికి గట్టి పోటీ ఉంది కదా? ముందు నుంచే సంక్రాంతి సినిమాగానే రూపొందించారా? -సంక్రాంతికి సరిపడే మూవీగానే ‘నారీ నారీ నడుమ మురారి’ని రూపొందించాం. ఇదొక పండుగ మూవీ. సినిమాలకు సంక్రాంతి సీజన్ అనేది వర్కౌట్ అవుతుంది. మేం అనుకున్నట్టుగానే సినిమా వచ్చింది. సంక్రాంతి సీజన్‌లో…
అమ్మవారి మహిమలతో’దక్షిణ కాళీ’
సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘దక్షిణ కాళీ’. హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ – అమ్మవారి మహిమలు తెలిపేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించాం. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పాలి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ కు మా మూవీ షోస్ వేస్తున్నాం. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి మంచి కథను అందించి ఎక్కడా కాంప్రమైజ్…
‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచింది. సినిమా ప్రమోషన్‌లు ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లింప్స్, పాటలు, పోస్టర్ అంచనాలను పెంచాయి. మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఒకప్పుడు దేశ భద్రతా సంస్థల్లో కీలకంగా సేవలందించిన శంకర వర ప్రసాద్, శశిరేఖను ప్రేమించి పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కి మారుతాడు. ఫ్యామిలీ మ్యాన్ గా ప్రశాంతంగా కనిపించినా, అతనిలోని వింటేజ్ ఫైర్, నేచురల్ ఇన్‌స్టింక్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు వచ్చినప్పుడు, వాటిని శంకర వర…
నయన్ వదులుకున్న సూపర్‌హిట్ మూవీస్ ఇవే…
వాళ్ళ చిత్రాలలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సీనియర్ హీరోలందరికీ ఆమె ఒక పర్ఫెక్ట్ మ్యాచ్‌గా నిలవడానికి ముఖ్య కారణం.. పాత్రలను ఎంచుకునే విధానం, ఆమె పర్సనాలిటీ. ఆ పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మేకోవర్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. అందుకే ఆమె దక్షిణాదిన కదిలించలేని కోట కట్టేసుకుంది. సీనియర్ హీరోల చిత్రాలతో పాటు.. నయనతారకు మరో అరుదైన ఘనత ఉంది. తెలుగు, మలయాళం, తమిళంతోపాటు హిందీలోనూ సత్తా చాటుతూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. తన 20 ఏళ్ల కెరీర్‌లో 75కి పైగా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా విజయవంతంగా రాణిస్తుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘నయనతారా: బియాండ్ ది ఫెయిరీ టేల్’తో మరోసారి హైలైట్స్ అయిన ఆమె, ధనుష్‌తో కాంట్రవర్సీలో కూడా స్ట్రాంగ్‌గా…
4న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు’, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, ‘శశిరేఖ’ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేష్ నటించిన పాట ‘సంక్రాంతి అదిరిపోద్ది’ ఒక ఫెస్టివల్ సాంగ్ లా మారింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి…
Horror Comedy Movie “Rukmini” First Look Poster Launched by Nata Kireeti Rajendra Prasad on New Year
“Rukmini” is an upcoming film produced under the G Cinema banner by Nelaballi Subrahmanyam Reddy and Katta Gangadhara Rao, with Smt. Nelaballi Kumari presenting the film. The movie stars Niranjan, Greeshma Netrika, Priyanka, and Deepti Srirangam in the lead roles. Director Simhachalam Gudupuri is bringing this film to the screen with a fresh horror-comedy storyline. On the occasion of New Year’s Day, the first look poster of “Rukmini” was officially launched by Nata Kireeti Rajendra Prasad. Speaking at the event, Rajendra Prasad said: “Gangadhar has worked with me for many…
హారర్ కామెడీ మూవీ ‘రుక్మిణి’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్
నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియాంక, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా “రుక్మిణి”. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు న్యూ ఇయర్ డే సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా “రుక్మిణి” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. అనంతరం… నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – గంగాధర్ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం వంటి ఎన్నో హిట్ మూవీస్ కు మాతో వర్క్ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా “రుక్మిణి” సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అప్పుడైనా…
విడుదలకు ‘వశం’ సిద్ధం
చేతన్, కావ్య, రాజీవ్ హీరో హీరోయిన్లుగా ఆలాపన స్టూడియోస్ సమర్పణలో కోన రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘వశం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా .. దర్శక, నిర్మాత కోన రమేష్ మాట్లాడుతూ .. సిటీ మరియు గిరిజన ప్రాంతంలో జరిగే కథ. సిటీలో పెరిగిన ఒక వ్యక్తి గిరిజన ప్రాంతంలోని అమ్మాయిని ఎంతగానో ప్రేమించి, చివరికి సీటీలోనే అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది? ఇంతకీ వాస్తవానికి ఏమి జరిగిందనే ఆసక్తికరమైన కథ. గిరిజన ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది . బెంగళూరు.. హైదరాబాద్‌లలో తదితర ప్రాంతాల్లో తెరకెకెక్కించాం. కాండ్రేగుల చందు, సలాపు మోహనరావు, కుబిరెడ్డి వెంకన్న దొర గార్ల సహకారం మరువలేనిది. వారి సంపూర్ణ సహకారంతో సినిమా చక్కగా తెరకెక్కింది. తెలుగు, కన్నడ భాషల్లో ఫిబ్రవరిలో భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.…
