‘సీతారామం’ థియేటర్లోనే చూడాల్సిన సినిమా : ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

'సీతారామం' అందరూ థియేటర్లోనే చూడాల్సిన సినిమా: ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రీరిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. సీతారామం ట్రైలర్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. దుల్కర్ సల్మాన్ హ్యాండ్ సమ్ హీరో, సూపర్ స్టార్. మహానటి లాంటి గ్రేట్ ఫిల్మ్ లో చేశారు. మృణాల్…

‘మసూద’ టీజర్ కు ట్రైమండస్ రెస్పాన్స్‌!!!

‘మసూద’ టీజర్ కు ట్రైమండస్ రెస్పాన్స్‌!!!

-టాబ్లెట్స్ తో తనకు నయం అవుతుందని నాకు అనిపించట్లేదు గోపి అంటూ ‘మసూద’ టీజర్ లో సంగీత చెప్పే డైలాగ్స్ వాహ్.. అనిపించింది. – ఇప్పుడైతే బానే ఉంది కదండి… – అప్పుడప్పుడు తను చేసేది చూస్తుంటే ఎప్పుడైనా పీర్ బాబాకు చూపిస్తుంటే మంచిదేమో ఏమంటావ్ ? అని సంగీత అంటే.. – నాకు అస్సలు ఐడియా లేదు.. ఇలాంటి డైలాగ్స్ తో ప్రారంభమైన ‘మసూద’ టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ట్రైమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. మంగళవారం న్యాచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి.. టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ…

First glimpses of the movie starring Siva Kandukuri as Bhootadham Bhaskar Narayana in complete new avathar.

First glimpses of the movie starring Siva Kandukuri as Bhootadham Bhaskar Narayana in complete new avathar.

The current trend is not how great the movie is made but how unique the promotion is. Bhaskar Narayana is taking all precautions to attract the audience to the cinema theatres. Introducing Purushottam Raj as a director, Bhootaddham Bhaskar Narayana is a film produced by Snehal Jangala, Shasidhar Kashi, and Karthik Mudumbai jointly under the banners of Million Dreams Creations and Vijay Saraga Productions without compromising on the production values. The first glimpse of the film was released today. Shiva Kandukuri plays the hero role, and Rashi Singh plays the…

డిఫరెంట్‌ ప్రజెంటేషన్‌లో ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’గా శివ కందుకూరి నటించిన సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌

buthaddam bhaskar narayana movie news

సినిమా ఎంత గొప్పగా నిర్మించామన్నది కాదు, ప్రమోషన్‌ ఎంత డిఫరెంట్‌గా చేశామన్నదే ఇప్పటి ట్రెండ్‌. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి ఇప్పటి నుంచే ప్రేక్షకులకు నచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని వారి అభిరుచిని భూతద్ధంలోంచి చూస్తున్నాడు మా భాస్కర్‌ నారాయణ. పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రొడక్షన్‌ విలువలు ఎక్కడా తగ్గకుండా, కథని నమ్మి నిర్మించిన చిత్రమే ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ని ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌ లో ఓపెన్‌ చేస్తే శేషపాన్పుపై పవళించిన…

ఆగస్ట్ 6న విడుదల కానున్న యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ థియేట్రికల్ ట్రైలర్

ఆగస్ట్ 6న విడుదల కానున్న యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ థియేట్రికల్ ట్రైలర్

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 1 పై అద్భుతమైన స్పందన వచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 6నా కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు…

ప్రముఖ హస్యనటుడు సారధి కన్నుమూత

haasyanatudu saradhi nomore

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి (83) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణావార్తతో టాలీవుడ్‌లో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు తెలుగు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన దాదాపు 372 పైగా చిత్రాల్లో నటించారు. అందులో సీతారామ కళ్యాణం, పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, జగన్మోహిని, మన ఊరి పాండవులు, డ్రైవర్‌ రాముడు వంటి మరెన్నో చిత్రాలతో గుర్తింపు పొందారు. అంతేకాదు తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు.…

‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్ లుక్ విడుదల

'అలిపిరికి అల్లంత దూరంలో' ఫస్ట్ లుక్ విడుదల

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా వుంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.…

‘బింబిసార’కు కళ్యాణ్ రామన్న తప్ప మరొకరు న్యాయం చేయలేరు : ఎన్టీఆర్‌

BIMBISARA Movie pre relese event

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్. వ‌శిష్ట్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో.. స్టార్ హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ‘‘రెండేళ్ల క్రితం కళ్యాణ్ అన్న ఫోన్ చేసి.. చాలా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను.. నువ్ ఒకసారి వింటే బాగుంటుందని అని అన్నారు. ఇప్పుడు వశిష్ట అంటున్నారు.. అంతకు ముందే వేణు అనేవాళ్లు. నాకు కూడా తనని వేణు అని పిలిస్తే బావుంటుంది. ఆ రోజు ఒక…

షూటింగ్స్ నిలిపేసే ప్ర‌స‌క్తే లేదుః టియ‌ఫ్‌సీసీ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌

షూటింగ్స్ నిలిపేసే ప్ర‌స‌క్తే లేదుః టియ‌ఫ్‌సీసీ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌ ఆగ‌స్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా ఖండిస్తూ... ఆ న‌లుగురు త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగ‌తా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నార‌నీ మండిప‌డ్డారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మ‌లో మాట్లాడుతూ...`` ఫిలిం ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటోన్న కొన్ని స‌మ‌స్య‌ల పై స్పందిచ‌డానికి ఈ రోజు మా తెలంగాణ ఫిలించాంబ‌ర్ త‌ర‌ఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మా టియ‌ఫ్‌సీసీ లో ప్ర‌స్తుతం యాభై మంది నిర్మాత‌లు సినిమా షూటింగ్ లు నిర్వ‌హిస్తున్నారు. నా సినిమా షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ఇంకా రెండు రోజులే బేల‌న్స్ ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో షూటింగ్స్ ఆక‌స్మాత్తుగా ఆపేస్తే వ‌ర్క‌ర్స్ తో పాటు మిగ‌తా వారంద‌రికీ ఇబ్బంది క‌లుగుతుంది. ఆగ‌స్ట్ 1 నుండి షూటింగ్స్ నిలిపివేస్తున్నార‌ని ప‌త్రిక‌ల్లో, ఛాన‌ల్స్ లో వార్త‌లు చ‌దువుతున్నాం. అస‌లు షూటింగ్స్ ఎందుకు నిలిపివేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థ‌తి. కొంద‌రు త‌మ స్వార్థం కోసం ముఖ్య‌మంత్రుల‌ను ఒక‌టికి నాలుగుసార్లు క‌లిసి టికెట్ రేట్లు పెంచుకున్నారు. మ‌ళ్లీ థియేట‌ర్స్ కి ఆడియ‌న్స్ రావ‌డం లేద‌నీ షూటింగ్స్ నిలిపివేయాలంటున్నారు. అస‌లు ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్టో అర్థం కావ‌డం లేదు. సినిమా షూటింగ్స్ అయితే ఆపే స‌మ‌స్య లేదు. అంద‌ర్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కానీ, మీకు మీరే టికెట్ రేట్లు పెంచాలి, షూటింగ్స్ బంద్ చేయాలంటూ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం క‌రెక్ట్ కాదు. ఇప్ప‌టికే క‌రోనా వ‌ల్ల ఎంతో మంది వ‌ర్క‌ర్స్ షూటింగ్స్ ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. క‌రోనా స‌మ‌యంలో మా చాంబ‌ర్ త‌ర‌పున 20 వేల మంది కార్మికుల‌కు సాయం చేశాం. అలాంటి ప‌రిస్థితుల నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే షూటింగ్స్ జ‌రుపుకుంటోన్న స‌మ‌యంలో ఇలా షూటింగ్స్ ఆక‌స్మాత్తుగా ఆప‌డం స‌మ‌జసం కాదు. వాళ్ల‌కు క‌లెక్ష‌న్స్ రావ‌డం లేదనీ ఓటీటీ కి ఇవ్వొద్దు అని అంటున్నారు. మా సినిమాల‌కు మీరు థియేట‌ర్స్ ఇవ్వ‌రు, ఓటీటీ కి సినిమాలు ఇవ్వొద్దు అంటే చిన్న నిర్మాత‌లు బ‌తికే దెలా? ఆ ప‌దిమంది నిర్మాత‌లే బ‌త‌కాలా? మీకు లాభాలు వ‌చ్చిన‌ప్పుడు సైలెంట్ గా ఉండి..మీకు ఇబ్బంది వ‌స్తే రూల్స్ మార్చ‌డం, షూటింగ్స్ నిలిపేయ‌డం క‌రెక్టా? ప‌ర్సెంట్ విధానం ఎందుకు తీసుక‌రావ‌డం లేదు. ఇండ‌స్ట్రీ మీద అంత ప్రేమ ఉంటే ప‌ర్సెంట్ విధానం మీద సినిమాలు రిలీజ్ చేయండి. నిర్మాత‌లు , డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబీట‌ర్స్ అన్నీ ఆ న‌లుగురు నిర్మాత‌లే. తెలంగాణ‌లో ఇంత‌కు ముందు 200 మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ ఉండేవారు. ఇప్పుడు ఒక్క‌రూ లేరు. కేవ‌లం న‌లుగైద‌రు నిర్మాత‌ల చేతుల్లో థియేట‌ర్స్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎప్పుడూ వాళ్ల స్వార్థ‌మే త‌ప్ప మిగ‌తా వాళ్ల‌కు ఎప్పుడూ స‌పోర్ట్ చేయ‌లేదు. వాళ్ల‌కు వాళ్లే స‌ప‌రేట్ గా మీటింగ్స్ పెట్టుకుని వాల్లే డెసిష‌న్స్ తీసుకోవ‌డం చాలా త‌ప్పు. దీన్ని మేము తీవ్రంగా వ్య‌తిరేఖిస్తున్నాం. షూటింగ్స్ క‌చ్చితంగా జ‌రుగుతాయి. ఎవ‌రి షూటింగ్స్ అయినా ఆపితే ప్ర‌భుత్వం ద్వారా, మా చాంబ‌ర్ ద్వారా వారిని ఎదుర్కొంటాం. పెద్ద హీరోల‌ను తీసుకెళ్లి థియేట‌ర్స్ టికెట్ రేట్లు పెంచ‌మ‌ని ముఖ్యమంత్రుల‌ను అడిగింది మీరు. ఒక సామాన్యుడు కుటుంబంతో క‌లిసి సినిమా చూడాలంటే జేబుకు చిల్లి ప‌డే ప‌రిస్థితి. ఒక్క సినిమా హిట్ కాగానే పోటీ ప‌డి హీరోల‌కు రెమ్యూనిరేష‌న్స్ పెంచేది మీరే. అవ‌స‌ర‌మైతే మీరు సినిమాలు తీయ‌డం ఆపేయండి. అంతే కానీ ఇండ‌స్ట్రీని బంద్ చేయ‌డానికి మీరెవ‌రు. ఆ ప‌దిమంది ప్రొడ్యూస‌ర్స్ ఏడాదికి 40 సినిమాలు చేయ‌వచ్చు...వాళ్ల వ‌ల్ల వ‌ర్క‌ర్స్ బ‌త‌కడం లేదు. చిన్న సినిమాల వల్లే క‌ళాకారులు బ‌తుకుతున్నారు. నిజంగా ఏదైనా స‌మ‌స్య ఉంటే అంద‌ర్నీ పిలిచి మాట్లాడి నిర్ణ‌యం తీసుకోండి. అంతేకానీ ఇలా అక‌స్మాత్తుగా షూటింగ్స్ ఆపేయాలంటే అంద‌రికీ ఇబ్బంది. చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. కాబ‌ట్టి థియేట‌ర్స్ బంద్ అనే నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి. టికెట్స్ రేటు త‌గ్గించాలి. థియేట‌ర్స్ లో అమ్మే తినుబండారాల రేట్లు త‌గ్గించాలి. ఓటీటీకి ఎనిమిది, ప‌ది నెల‌ల త‌ర్వాతే ఇవ్వాలంటే నిర్మాత‌కు ఇబ్బంది అవుతుంది. దీనిపై కూడా పున‌రాలోచించాలి. అంద‌ర్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి త‌ప్ప ఎవ‌రికి వాళ్లే నిర్ణ‌యాలు తీసుకొని మిగ‌తా వాళ్ల‌ను ఇబ్బంది పెట్టొద్దు`` అన్నారు. తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ వైస్ ప్రెసిడెంట్ ఏ.గురురాజ్ మాట్లాడుతూ...`` కొంత మంది సినిమా ఇండ‌స్ట్రీని శాసిస్తున్నారు. పెద్ద నిర్మాత‌లు, చిన్న నిర్మాత‌లు అంటూ ఎవ‌రూ లేరు. ప్ర‌తి ఒక్క‌రూ చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత‌గా ఎదిగిన‌వారే. నేను కూడా చాలా చిత్రాలు నిర్మించాను. కానీ స‌రైన థియేట‌ర్స్ దొర‌క్క ఎంతో న‌ష్ట‌పోయాను. షూటింగ్స్ బంద్ చేయ‌డానికి మీకు అధికారం లేదు. సామాన్యుడు ప్ర‌స్తుతం సినిమా చూడాలంటే భ‌య‌ప‌డుతున్నాడు. కార‌ణం టికెట్ల రేట్లు, తినుబండారాల రేట్లు పెంచ‌డం. ముందు వీటిని త‌గ్గించండి. అంతే కానీ షూటింగ్స్ నిలిపేస్తే వ‌చ్చేది ఏం లేదు. ఎవ‌రైనా త‌మ షూటింగ్స్ ఆపార‌ని మ‌మ్మ‌ల్ని సంప్ర‌దిస్తే మేము ప్ర‌భుత్వం సపోర్ట్ తో వారిని ఎదుర్కొంటాం`` అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సెక్ర‌ట‌రి సాగ‌ర్, హీరో సురేష్ బాబు, చెన్నారెడ్డి, కిషోర్‌, స‌తీష్, రాఖీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆగ‌స్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా ఖండిస్తూ… ఆ న‌లుగురు త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మిగ‌తా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నార‌నీ మండిప‌డ్డారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మ‌లో మాట్లాడుతూ…“ ఫిలిం ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటోన్న కొన్ని స‌మ‌స్య‌ల పై స్పందిచ‌డానికి ఈ రోజు మా తెలంగాణ ఫిలించాంబ‌ర్ త‌ర‌ఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మా టియ‌ఫ్‌సీసీ లో ప్ర‌స్తుతం యాభై మంది నిర్మాత‌లు సినిమా షూటింగ్ లు నిర్వ‌హిస్తున్నారు. నా సినిమా షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ఇంకా రెండు రోజులే బేల‌న్స్ ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో షూటింగ్స్ ఆక‌స్మాత్తుగా ఆపేస్తే వ‌ర్క‌ర్స్ తో పాటు మిగ‌తా వారంద‌రికీ ఇబ్బంది క‌లుగుతుంది. ఆగ‌స్ట్ 1 నుండి షూటింగ్స్ నిలిపివేస్తున్నార‌ని ప‌త్రిక‌ల్లో, ఛాన‌ల్స్ లో వార్త‌లు చ‌దువుతున్నాం. అస‌లు…

దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన శివ నాగేశ్వరరావు ‘దోచేవారెవరురా’ టీజర్‌

dochevarevarura treser relese

IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతల మీదుగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా “దోచేవారెవరురా” సినిమా టీజర్ విడుదల చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను శివ నాగేశ్వరరావు గారి సినిమాల్లోని కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఈయన తెరకెక్కిస్తున్న “దోచేవారెవరురా” కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. అన్ని కార్యక్రమాలు…