నటి దీప్‌శిఖ కన్నడ సినీ పరిశ్రమలోకి ఘనమైన అరంగేట్రం చేయబోతోంది. ఆమె సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో కలిసి తెరను పంచుకోనుండటంతో ఈ ప్రకటన అభిమానులు, సినీ వర్గాల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేపింది. ఇది దీప్‌శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అభిమానులు ఇప్పటికే ఆమెను “మార్క్ క్వీన్”గా పిలుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫిషియల్ డెబ్యూ కి ముందే, దీప్‌శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, కొత్తదనం నిండిన ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా నుంచి వచ్చిన ప్రారంభ అప్‌డేట్స్, లుక్స్‌తో సోషల్ మీడియా మొత్తం ఆమెపై ప్రశంసలతో మార్మోగుతోంది. ఆమె వేసిన ప్రభావానికి గుర్తింపుగా అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఈ అవకాశంపై తన కృతజ్ఞతను వ్యక్తం చేసిన దీప్‌శిఖ, కిచ్చా సుదీప్‌తో కలిసి పనిచేయడం తనకు ఒక…
Category: FILM NEWS
‘పతంగ్’ టీమ్‌ను అభినందించిన దర్శకుడు త్రివిక్రమ్
సినీ పరిశ్రమలో నూతన టాలెంట్ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్ క్రియేటివిటిని, వర్క్‌ను అభినందిస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవల పతంగ్ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్ చేస్తున్నప్రమోషన్ కంటెంట్, ఆ సినిమా కాన్సెప్ట్ గురించి విని ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ టీమ్‌ను పిలిచి అభినందించడంతో పాటు టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందజేశాడు. పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్ ఇండియాలోనే మొదటిసారిగా మీ టీమ్ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు.నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిపిస్తుంది అని త్రివిక్రమ్ గారు ఎంతో పాజిటివ్‌గా మాట్లాడటంతో పతంగ్ టీమ్ ఎంతో ఎనర్జీతో ఉంది. త్రివిక్రమ్‌ను కలిసిన వారిలో పతంగ్ హీరోలు వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్,…
నయనతార..హీరోలకు మించిన స్టార్ డమ్!
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్క సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు.. దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో చక్రం తిప్పుతోంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. ఈ అమ్మడు సినిమాలతోపాటు ఎప్పుడూ వివాదాల్లోనూ చిక్కుకుంటుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ నయనతార తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇప్పుడు నయన్ సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. అలాగే ఈ చిత్రానికి నయన్ రూ.10…
మెగాస్టార్ జోరు తగ్గేలా లేదు..
* సెట్స్ పై ఏకంగా నాలుగు సినిమాలు మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది ఆగస్టు 22తో 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. గత రెండేళ్ళుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ రానుంది. ఇక రెండేళ్ళ నుంచీ రూపొందుతోన్న ‘విశ్వంభర’ను కూడా వచ్చే యేడాది విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు. ‘భోళాశంకర్’ తరువాత ‘విశ్వంభర’లో నటించారు చిరంజీవి. ఆ మూవీ ఈ యేడాది సంక్రాంతికే విడుదల కావలసింది. అయితే కథానుగుణంగా ‘విశ్వంభర’లో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకొని దానిని చక్కగా…
ఆ మాటలు నన్ను వెంటాడాయి… 36 గంటలు నిద్ర పట్టలేదు
దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన శివాజీ దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంతో క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని శివాజీ తెలిపారు. స్టేజ్‌పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో .. నటుడు శివాజీ మాట్లాడుతూ ‘‘నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ రెండు పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా పదాలను ఎప్పుడూ దొర్లలేదు. నేను ఇక్కడకు వచ్చి 30…
‘డైమండ్ డెకాయిట్’ టీజర్ రిలీజ్
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాలనుండి జర్నీ చేస్తూ చాలా ఒడి దుడుకులు ఎదుర్కొని ఇ చిత్రాన్ని తెర కేక్కించ్చినాము ఈరోజు మీ అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయటం చాలా ఆనందం గా వుంది, డైమండ్ డెకాయిట్ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి సపోర్ట్ కావాలి అని ముగించారు. హీరోయిన్ మేఘన మాట్లాడుతూ ఇ సినిమా ని…
‘ఫంకీ’ చిత్రం నుంచి తొలి పాట ‘ధీరే ధీరే’ విడుదల
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘ధీరే ధీరే’ విడుదలైంది. ‘ఫంకీ’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తొలి పాట ‘ధీరే ధీరే’కి అద్భుతమైన సంగీతం అందించి, విడుదలైన తక్షణమే శ్రోతల మనసులో చోటు సంపాదించుకునేలా చేశారు. ఈ మధురమైన పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం. వినసొంపుగా ఉన్న ఈ ‘ధీరే ధీరే’ మెలోడి, వినగానే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయేలా ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ జోడి…
సమంత లాంచ్ చేసిన ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’
ఛాంపియన్ నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. గిర గిర సాంగ్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతూనే ఉండగా, మనసుని కదిలించే సెకండ్ సింగిల్ సల్లంగుడాలే కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం నుంచి మూడవ పాటను ఇప్పుడు మేకర్స్ లాంచ్ చేశారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మూడో సింగిల్ ఐ యామ్ ఎ ఛాంపియన్ సాంగ్ ఒక ప్రత్యేకమైన, పూర్తి స్థాయి డాన్స్ నంబర్‌గా అలరించింది. గ్రాండియర్‌తో పాటు రిథ్మిక్ ఎలిగెన్స్‌ను కలిపిన ఈ పాట, భారీ సెట్‌పై, అద్భుతమైన డాన్స్‌లతో కన్నుల పండువైన విజువల్ స్పెక్టాకిల్‌గా…
‘ఛాంపియన్’ తో హిట్ కొడుతున్నాం : హీరో రోషన్
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు. ఛాంపియన్ నైట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే మాకు ఎంతగానో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ప్రదీప్ గారు ఈ ప్రాజెక్టు…
యానిమేటెడ్ అడ్వెంచర్ ‘మిషన్ సాంటా’
ఇటీవల యానిమేషన్ చిత్రంగా రూపొంది భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందిన ‘నరసింహా అవతార్’ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో యానిమేషన్ ఫీచర్ ఫిలిం రిలీజ్ కాబోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ భారీ యానిమేటెడ్ ఫిలిం ‘మిషన్ సాంటా’. ఈ అత్యుత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిలిం ఈ నెల 25న కిస్మస్ కానుకగా భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఒకేసారి ఈ చిత్రం థియేటర్‌లో సందడి చేయబోతుంది. ఇందులో భాగంగా ఈనెల 25న అంటే అదే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లోని పలు థియేటర్‌లో ‘మిషన్ సాంటా’ రిలీజ్ కాబోతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథతో రూపొందిన హై ఎనర్జీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిత్రం ఇది. యానిమేషన్ క్వాలిటీ, సినిమాలో ఉండే…
