ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల ఈ సినిమా అవుట్‌పుట్ చూసి నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యూచర్‌లో నితిన్‌తో స్ట్రైయిట్ సినిమా కూడా చేస్తా నితిన్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. నభ నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ ‘అందాధున్’ సినిమా చూశా. ‘అందాధున్’…
Category: INTERVIEWS
‘తలైవి’ సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చింది : నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి
సినీనటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషించగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేశారు. ‘తలైవి’ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న సినిమా విడుదల కాగా.. విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి మీడియాతో ముచ్చటించారు. ‘తలైవి’ సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. మంచి సినిమా చేశాను అనే ప్రశంసలు కూడా వచ్చాయి. అదే సమయంలో పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి. అలా వ్యాపారపరంగా లాభాలు కూడా వచ్చాయి. మొత్తానికి ‘తలైవి’ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్‌తో బడ్జెట్ మొత్తం రికవరీ…
హీరో గోపీచంద్ అభిమానులు సంతోషపడేలా ‘సీటీమార్’ తీసినందుకు దర్శకుడిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా: సంపత్ నంది
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదలై విజయవంతమైంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది ఇంటర్వ్యూ విశేషాలు… యూనానిమస్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. చెన్నై, నార్త్ ఇండియాలోనూ షోలు పడ్డాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లోని సినిమాలతో కలిపి పోల్చి చూసి ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమా అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అవి నిర్మాతలు తెలియజేస్తారు. ముందు నుంచి మాస్ సినిమాలు చేస్తూ వస్తున్నాను. స్పోర్ట్స్…
మాస్, క్లాస్ సహా అందరికీ నచ్చే కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ : హీరో గోపీచంద్
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ ఇంటర్వ్యూ విశేషాలు… ‘సీటీమార్’ సినిమా చేయాలనుకున్నప్పుడు సంపత్ నంది ఎడ్యుకేషన్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ కథ నెరేట్ చేశాడు. ఆ కథ నాకెందుకో నచ్చలేదు. తర్వాత ఒక నెల తర్వాత మరో కథను వచ్చాడు. తను చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలేవీ చేయలేదు.…
అతడే హీరో అతడే విలన్!
హీరోగా విలన్ గా రాణిస్తున్న హీరో విజయ్ క్రిష్ణ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి కొత్త గా వచ్చిన ఆర్టిస్ట్ విజయ్ క్రిష్ణ ఈయన దుర్మార్గుడు ఫ్రేమ్ హీరో గా ఆంధ్ర, తెలంగాణ లో అందరికి సుపరిచితులు అయ్యారు, రీసెంట్ గా బెక్కం వేణుగోపాల్ గారి పాగల్ మూవీ లో డైరెక్టర్ నరేష్ గారు విలన్ గా ఛాన్స్ ఇవ్వటం జరిగింది, ఈయన తన నటన తో అందరిని ఆకట్టుకున్నారు. -సార్ మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు. హీరోగా గోవిందా భజ గోవిందా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది డైరెక్టర్ సూర్య కార్తికేయ డబ్బింగ్ దశలో వుంది ప్రెసెంట్, రీసెంట్ గా విలన్ గా రెండు సినిమాలు చేశాను దూరదర్శన్ ఒక మూవీ ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారు, మరొక ప్రేమకధ అని ఒక మూవీ ఈ…
కథ విన్నప్పటి నుండి జయమ్మకు అభిమానిగా మారా : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్
సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేశారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశా విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా కంగనా రనౌత్ టాలీవుడ్ టైమ్స్ తో ముచ్చటించారు.ఆ విశేషాలు..ఇది ప్యాన్ ఇండియన్ చిత్రంగా విడుదలవడం లేదు ఎందుకంటే ఇంకా బాలీవుడ్‌లో పరిస్థితులు సద్దమణగలేదు. కొన్ని చోట్ల థియేటర్లు తెరవలేదు. ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని…
హైదరాబాద్‌లోని కరాచీ బేకరి ఫార్టీ ఫిఫ్త్ అవెన్యూలో ఆహా తెలుగు వెబ్ సీరీస్ ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ ట్రైలర్ విడుదల
అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా. ప్రతి తెలుగు లోగిలిలోనూ సుపరిచితమైన వినోదం పేరు ఆహా. లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ నీ, పాత్ బ్రేకింగ్ షోలనీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన మోస్ట్ ఎంగేజింగ్ ఓటీటీ ఆహా. సెప్టెంబర్ 10న రొమాంటిక్ డ్రామా ది బేకర్ అండ్ ద బ్యూటీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, విష్ణుప్రియ, సాయి శ్వేత, వెంకట్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. జొనాథన్ ఎడ్వర్డ్స్ ఈ వెబ్‌సీరీస్‌కి దర్శకత్వం వహించారు. పది ఎపిసోడ్‌లున్న వెబ్ షో ఇది. ఆరు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్, ఆహా కలిసి తెరకెక్కించిన షో ఇది. ట్విన్ సిటీస్‌లో బెస్ట్ బేకరీ కరాచీ బేకరీ 45త్ అవెన్యూలో కాస్ట్ అండ్ క్రూ కలిసి ది బేకర్ అండ్ ది…
Indian Idol Fame Shanmukha Priya Renders A Chartbuster In Vijay Deverakonda’s Liger
Telugu girl Shanmukha Priya was one of the finalists of the popular singing reality show Indian Idol season 12. She got a pleasant surprise when the most happening star and her favorite actor Vijay Deverakonda extended his wishes. Vijay Deverakonda also promised that she will sing in his next film.On the grand finale, Vijay appeared on the big screen, much to the surprise of Shanmukha Priya who was jumping in joy. The actor then said, “Today, is the finale. Forget winning forget losing forget everything just have a blast. Give…
కమర్షియల్ గ్రాఫ్ ఉంటూనే.. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా ‘టక్ జగదీష్` : దర్శకుడు శివ నిర్వాణ
‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. టక్ జగదీష్ సరదాగా ఉండే కుర్రాడు. అది టైటిల్‌లోనే తెలియాలని అలా టైటిల్ ఫిక్స్ చేశాం. ఆ టక్ వెనకాల ఓ సిన్సియర్ కారణం కూడా ఉంటుంది. ఆ కారణం చూసి సెన్సార్ వాళ్లకు కళ్లలో నీళ్లు తిరిగాయి ఈ సినిమాపై మా ఫీలింగ్ మారింది అని చెప్పారు.…
డియర్ మేఘ: ఓ ఫెల్యూర్ డ్రామా!
స్లో నేరేషన్.. బోరింగ్ ట్రీట్ మెంట్.. రేటింగ్ : 1.75 /5 విడుదల : 03-09- 2021 తారాగణం: ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల, పవిత్రాలోకేష్ తదితరులు. సంగీతం: హరి గౌర సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ ఎడిటర్: ప్రవీణ్ పూడి ఆర్ట్ డైరెక్టర్ : పీఎస్ వర్మ నిర్మాత : అర్జున్ దాస్యన్ రచన, దర్శకత్వం : సుశాంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా దురదృష్టకరమే! ఎందుకంటే అసలే కరోనా పుణ్యమాని వెండితెర వెలుగులు మసిబారిపోయాయి. ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయోనని ఎంతగానోఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందుకు ఓ పసలేని ఫెల్యూర్ డ్రామా ముందుకొచ్చి అందరి మనసుల్ని కాకావికలం చేసి తీవ్రంగా నిరాశపరిచింది. మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా…
