వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ విలేఖరుల సమావేశంలో ‘కృష్ణ వ్రింద విహారి’ విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం నాగశౌర్యని ఎప్పుడు కలిశారు ? – నాగశౌర్య గారికి 2020లో ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన హోమ్ బ్యానర్ లోనే ఈ కథ చేయాలని నిర్ణయించారు. నాగశౌర్య స్వతహగా రచయిత కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ? – చాలా…
Category: INTERVIEWS
నటిగా గొప్ప తృప్తిని ఇచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ : అమల అక్కినేని ఇంటర్వ్యూ
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో అమల అక్కినేని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు. ‘ఒకే ఒక జీవితం’ చూసిన తర్వాత ఎమోషనల్ మదర్ పాత్రలకు మీరే కరెక్ట్ ఛాయిస్ అంటున్నారు.. భవిష్యత్ లో ఇలాంటి పాత్రలు చేస్తారా ? – ఒక…
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ గ్రేట్ ఎమోషన్ వున్న సినిమా : సుధీర్ బాబు ఇంటర్వ్యూ
నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతున్న నేపధ్యంలో హీరో సుధీర్ బాబు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. దర్శకుడు ఇంద్రగంటి గారితో ఇది మూడో చిత్రం. మీ కాంబినేషన్, ఆయనతో మీ ప్రయాణం గురించి చెప్పండి? – ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్ లో ఒక ఒక డైలాగ్ వుంది. ”మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం.…
‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు… ముత్తు మాత్రమే కనిపిస్తాడు : దర్శకుడు గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఇంటర్వ్యూ… ప్రశ్న: ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’… సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్‌గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి! గౌతమ్ మీనన్ : మేం ఇద్దరం ఇంతకు ముందు చేసినవి రొమాంటిక్ ఫిల్మ్స్.…
నా కల ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’తో నెరవేరింది : హీరోయిన్ సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ..
శింబు కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన హ్యాట్రిక్ సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఇందులో సిద్దీ ఇధ్నానీ కథానాయిక. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ… ప్రశ్న: హాయ్ అండీ… ఎలా ఉన్నారు? సిద్దీ ఇధ్నానీ : చాలా బావున్నాను. ఈ వారమే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదల కదా… అందువల్ల చాలా అంటే చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ప్రశ్న: సినిమా విడుదలకు కొన్ని గంటలే సమయం ఉంది.…
Srirangaapuram Movie Review : మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీరంగాపురం’!!
తెలుగు చలనచిత్రసీమలో నేడు వస్తున్న సినిమాల్లో కథ కొంచెం బాగా అనిపించినా ప్రేక్షకులు ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఇది ఎంతో మంచి పరిణామం. ఫలితంగా దర్శక, నిర్మాతలు మరిన్ని చిత్రాలతో మనముందుకొస్త్తున్నారు. వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ జంటగా శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై చిందనూరు విజయలక్ష్మి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీరంగాపురం’ ఈ కోవలోకి చెందినదే! ఈ చిత్రాన్ని చిందనూరు నాగరాజు నిర్మించారు. ఎం.ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం స్వర సుందరం. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈచిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం… కథలోకి… శ్రీరంగాపురం అనే గ్రామంలో పెద్దారెడ్డి (చిందనూరు నాగరాజు), కొండారెడ్డి (సత్య ప్రకాశ్)ల మధ్య పగ, ప్రతీకారాలు చోటుచేసుకుంటాయి. ఓ…
ఆలేరుకు చెందిన శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం-2022 ప్రదానం
(ఎం.డి.అబ్దుల్ -టాలీవుడ్ టైమ్స్) హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతి ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం- 2022కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌ను సన్మానించి, అవార్డును అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మాక అవార్డు 2022ను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులుశ్రీరామోజు హరగోపాల్‌కు దక్కడం ఆనందదాయకమని , రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన వైతాళికులు,…
ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, ఒగ్గు ధర్మయ్యలకు ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం- 2022’
తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య 12వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆయన పేరున ఏర్పాటు చేసి ఏటా సాహిత్య, కళారంగాలలో విశేష కృషి చేస్తున్న ఇద్దరికి ‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం’ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పొన్నం రవిచంద్ర తెలిపారు. ఈ పురస్కారానికి జ్యూరీ చైర్మన్ గా పొన్నం రవిచంద్ర, జ్యూరీ సభ్యులుగా ప్రముఖ న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి, తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కవి రచయిత్రి ఐనంపూడి శ్రీలక్మి ఉన్నారని .. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి 25 వేల రూపాయల నగదుతో పాటు ప్రశంసా…
ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ‘కెప్టెన్’ : హీరో ఆర్య ఇంటర్వ్యూ
ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో హీరో ఆర్య ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… ప్రశ్న: ‘కెప్టెన్’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? విన్న తర్వాత మీ స్పందన ఏంటి? ఆర్య : శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో నేను ‘టెడ్డీ’ సినిమా చేశా.…
కిచ్చా సుదీప్ ‘కే3 కోటికొక్కడు’ సెప్టెంబర్ 16న విడుదల.. సినిమా కన్నుల పండగలా వుంటుంది : శ్రేయాస్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ…
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్. ఈ సందర్భంగా నిర్మాతలు శ్రేయాస్ శ్రీనివాస్, సాయి కృష్ణ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి… # ‘కే3 కోటికొక్కడు’ సినిమా గురించి ? –…
