నాటకరంగ అనుభవంతో వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు తెలంగాణ నటుడు తిరువీర్ ఈ యువకుడు ’జార్జ్ రెడ్డి’, ’పలాస’, ’మల్లేశం’ తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఇటీవలే మసూద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం ’పరేషాన్’. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా దగ్గుబాటి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించారు. తెలంగాణలోని ఓ గ్రామంలో స్నేహితుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫన్ ఎంటర్ టైనర్‌గా ఆలరించి మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం సోనీలివ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా నేటి నుంచి ఈ సినిమా…
Category: Entertainment
‘గేమ్ ఛేంజర్’ బాగా డిజైన్ చేశారు : కియారా అద్వానీ కితాబు
బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రాంచరణ్ తో గేమ్ ఛేంజర్‌లో నటిస్తోన్నది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి కియారా అద్వానీ ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్ చెప్పి.. మూవీ లవర్స్‌లో జోష్ నింపింది. టీం అంతా కలిసి ఈ సినిమాను రెండేళ్ల నుంచి షూట్ చేస్తుంది. 2023 చివరికల్లా సినిమా పూర్తవుతుందని చిత్రయూనిట్ ఆశిస్తోంది. రాంచరణ్ తనకు ప్రియమైన స్నేహితుడని, శంకర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. గేమ్ ఛేంజర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమా కోసం నా వేళ్లు వంకర పోయాయంటే అర్థం చేసుకోండి. ప్రతీ ఒక్కరి అంచనాలకు మించి సినిమా ఉంటుంది. మేమంతా అహర్నిశలు చెమటోడ్చి పనిచేశామంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క అప్‌డేట్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్న…
Dil Se (2023) Telugu movie review & Rating : ‘దిల్ సే’ దేఖ్ సక్తే !
చిత్రం: దిల్ సే బ్యానర్: సాయి రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ చైతన్య క్రియేషన్స్, నటీనటులు: అభినవ్ మేడిశెట్టి, శాషా సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ, వెంకటేష్ కాకుమాను ,శివ రామ కృష్ణ బొర్రా ,తదితరులు కథ, డైరెక్టర్, నిర్మాత: మంఖాల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని లైన్ ప్రొడ్యూసర్: పార్థు రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్ : శివ రామ కృష్ణ కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్ మ్యూజిక్: శ్రీకర్ వెళమురి స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రఘుపతి రెడ్డి.జి ఎడిటర్: ఉద్ధవ్ కో డైరెక్టర్: శంతన్ గద్వాల్ విడుదల: ఒన్ మీడియా కథ: హీరో అభినవ్ సరదాగా గడిపే ఒక అబ్బాయి. తను అద్దెకు ఉన్న ఇంటి ఓనర్ కుమార్తె సాషా సింగ్ ను చూసి ఇష్టపడతాడు. అభినవ్ కు ఫ్లాష్ బ్యాక్ లో లవ్లీ సింగ్…
Rajugaari kodipulav Telugu Movie Review : భలే పసందు ‘రాజుగారి కోడిపులావ్’ విందు!
(చిత్రం: రాజుగారి కోడిపులావ్, నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు. బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా, నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన, డైరెక్టర్ : శివ కోన, సంగీతం : ప్రవీణ్ మనిసినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు, ఎడిటర్ : బసవా- శివ కోన, సౌండ్ డిజైన్ : జీ. పురుషోత్తమ్ రాజు, వీఎఫ్ ఎక్స్ : విష్ణు పడిలోజు, సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్, రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన, పీఆర్ఓ : హరీష్, దినేష్, విడుదల: 04-08-2023) శివ కోన స్వీయ దర్శకత్వంలో ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం…
‘స్పార్క్L.I.F.E’ టీజర్ విడుదల
విక్రాంత్, మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విక్రాంత్ హీరోగా నటిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో… నటుడు గురు సోమసుందరం మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో చేయడం. విలన్‌గా నటించాను. అంతే కాదు, నేనే ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పాను. విక్రాంత్ రెడ్డితో పనిచేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. నేను కొచ్చిలో ఉన్నప్పుడు వచ్చి నన్ను కలిశారు. నేనే విలన్‌గా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలిపారు. చాలా మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ.…
Spark L.I.F.E starring Vikranth, Mehreen Pirzada and Rukshar Dhillon electrifying teaser unveiled today
The most ambitious project ‘Spark’ making headlines from the moment it was announced. Spark L.I.F.E is high budget action thriller starring new entrant Vikranth, Mehreen Pirzada and Rukshar Dhillon are playing lead roles in the film. The recently released first look poster has grabbed everyone’s eyeballs. This ambitious project got good buzz in the audience. The ‘Spark The LIFE’ teaser video is 2 minutes and 2 seconds long, and it appears that Vikranth has chosen a high-octane action route to excite the audience. The teaser begins with fire, dead bodies,…
రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం. 1
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకెళ్తుంది. తాజాగా గణపతి పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా సెట్ లో చిత్ర యూనిట్ అందరితో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. ఈ ప్రొడక్షన్లో సినిమా చేయడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ ఆనందం వ్యక్తం చేసింది. రవితేజ మహదాస్య హీరోగా, బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా, ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధానపాత్రలో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తన నటనా ప్రతిభతో…
‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’
కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల…’, ‘సొల్లుడా శివ…’ పాటల్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో మూడో పాట ‘దొంగోడే దొరగాడే’ను విడుదల చేశారు. ”లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడికాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే.. ఇల్లు వొళ్ళు గుల్లే చేసే బేరం ఇదిగో.. పట్టేసేయ్.. అడిగేటోడు ఎవడూ లేడు, అంతా నీదే లాగేసేయ్.. కొట్టేయి తాళం.. తీసేయి గొళ్ళెం.. దొరికిందంతా దోచేయ్ రా.. పట్టిస్తారు హారతి పళ్లెం.. దర్జాగా ఖాళి చెయ్యండ్రా.. దొంగోడే దొరగాడు.. దొంగోడే…
అనుపమ పరమేశ్వరన్ న్యూ ఏజ్, పెప్పీ తెలుగు మ్యూజిక్ వీడియో ఇన్ టౌన్
తెలుగు సినిమాలానే మ్యూజిక్ కల్చర్ కూడా అద్భుతం గా ఎదుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన న్యూ ఏజ్ మ్యూజిక్ వీడియో ఆసక్తికరంగా కనిపించడమే కాకుండా మ్యూజిక్ కల్చర్ ని న్యూ లెవల్ తీసుకువెళుతుందని భరోసా ఇస్తోంది. ఈ పాటకు డెన్నిస్ నార్టన్ సంగీతం అందించారు. ఈ పాటకు రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పాడగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. పద పద అని సాగే ఈ పాట టోక్యోలో చిత్రీకరించబడిన మొదటి సౌత్ ఇండియన్ మ్యూజిక్ వీడియో. బాబీ ఫిల్మ్స్, అయేరా స్టూడియోస్, యు రూబీ నాజ్ నిర్మిస్తున్నారు. సాహిత్యం కృష్ణకాంత్, కొరియోగ్రఫీ విష్ణుదేవా. విజువల్స్ టోక్యో కొని అందమైన దృశ్యాలతో ఆహ్లాదకరంగా వున్నాయి. పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. మ్యూజిక్ వీడియో జపాన్ స్పిరిట్, స్వేచ్ఛాయుతమైన అమ్మాయిని ప్రజంట్…
