సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం హీరోయిన్ శివాని నాగరం బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో ఆమె నటిస్తున్న వరలక్ష్మి క్యారెక్టర్ లుక్ ను ఈ బర్త్ డే పోస్టర్ లో రివీల్ చేశారు. వరలక్ష్మి లుక్ చూస్తుంటే ఆమె పాత్ర సినిమాలో పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ లా ఉంటుందని తెలుస్తోంది. క్యాజువల్ డ్రెస్ లో ఆమె కాలేజ్ కు వెళ్తున్నట్లు పోస్టర్ లో చూపించారు. హీరో మల్లి లాగే వరలక్ష్మి క్యారెక్టర్…
Category: Entertainment
Ambajipeta Marriage Band team wishes happy birthday to heroine Shivani Nagaram, Teaser coming very soon
Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like ‘Colour Photo’ and ‘Writer Padmabhushan’. He is now ready to entertain the audience with his upcoming film “Ambajipeta Marriage Band.” The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha’s Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment. The film is directed by newcomer Dushyanth Katikineni, and its first look poster was released recently, creating quite a buzz among movie lovers. Today makers wished…
‘పుష్ప’కు గ్రీటింగ్స్ చెప్పిన శ్రీవల్లి
’పుష్ప: ది రైజ్’ చిత్రంలో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. దీంతో ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు స్టార్‌గా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భంలో రష్మిక మందన్న తన సహనటుడు అల్లు అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ ని ప్రేమించి పెళ్లాడే ఇష్టసఖి శ్రీవల్లిగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డురావడంపై రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. ఉల్లాసంగా ఉరుములతో కూడిన చప్పట్లతో నిండిన గదిలో బన్ని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను రష్మిక రీషేర్ చేసింది. బన్నీకి హృదయపూర్వక అభినందనలు తెలిపింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ’పుష్పరాజ్.. అసలు తగ్గేదేలే..అభినందనలు.. ఇది…
మహేష్ సినిమాతో బిజీగా రాజమౌళి!
‘బాహుబలి’తో పాన్ ఇండియాని ‘ఆర్‌ఆర్‌ఆర్’ తో పాన్ వరల్డ్ ని షేక్ చేసిన దర్శధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ తరవాత మహేష్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ సినిమాకు ఎలా లేదన్నా 3 ఏళ్లు టైం తీసుకునే ఆలోచనలో ఉన్న రాజమౌళి ఆ సినిమా తర్వాత నెక్ట్స్ సినిమా ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది. మహేష్ తో చేసే సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని టాక్. అలా అయితే మరో ఏడాది అంటే నాలుగేళ్ల పాటు రాజమౌళి మహేష్ సినిమా ఉంటుంది. ఇక ఆ తర్వాత జక్కన్న తన లిస్ట్ లో ఒకరిద్దరి హీరోల పేర్లు ఉంచుకున్నాడు. అందులో ఎన్.టి.ఆర్, ప్రభాస్ లు ఉన్నారు. ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో సినిమాలు చేసిన రాజమౌళి మరో సినిమా ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క…
ట్రాన్స్ జెండర్‌గా నవాజుద్దీన్ సిద్దిఖీ!
భజరంగీ భాయిజాన్, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, బద్లాపూర్, సాక్రేడ్ గేమ్స్ , లాంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడం, భయపెట్టించడం, ఏడిపించడం ఈ యాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్న తాజా చిత్రం హడ్డి. ఇప్పటికే ’తాల్’ సినిమా ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా సుస్మితసేన్ అలరించగా.. నవాజుద్దీన్ కూడా హడ్డి చిత్రంలో అలాంటి పాత్రతో వస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫప్ట్ లుక్, టీజర్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా నవాజుద్దీన్ కనిపించనున్నట్లు ట్రైలర్ గమనిస్తే తెలుస్తుంది. అమ్మాయిగా మారాలనుకునే హరి పాత్రలో నవాజుద్దీన్ నటిస్తుండగా. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతనికి జరిగిన అన్యాయ్యానికి ఎలా…
‘శ్యామ్‌సింగరాయ్’కు దక్కని అవార్డులు.. సోషల్ మీడియాలో అవార్డులపై రచ్చ!
అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’కు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్ సహా పలువురు నెటిజన్లు ట్వీట్స్ వేస్తున్నారు. అవార్డు గెలుచుకోవడానికి అన్ని అర్హతులున్నా ‘శ్యామ్‌సింగరాయ్’కు జాతీయ పురస్కారం వరించలేదు. దీనిపై ట్విట్టర్‌లో పెద్ద రచ్చ రచ్చజరుగుతోంది. ఇక నాని ‘జై భీమ్’ సినిమాకు అవార్డు రాకపోవడంపై హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన’శ్యామ్ సింగరాయ్’ సినిమా ఏడాదినర్థం కిందట విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ద్విపాత్రాభినయంలో నాని నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా బెంగాళీ రచయిత శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో అతిశయోక్తి లేదు. పునర్జన్మల కాన్సెప్ట్‌తో రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అంతే అద్భుతంగా…
పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా ‘కింగ్ ఆఫ్ కొత్త’
పాన్ ఇండియా స్టార్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్‌తోపాటు అంచనాలు మామూలుగా ఉండవు. ఈ స్టార్ యాక్టర్ తాజాగా ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కెరీర్‌లో తొలిసారి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ అభిమానులకు కావాల్సిన మాస్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌ను అందిస్తున్నట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కథపరంగా కొత్తదనం ఏమీ లేకున్నా.. మేకింగ్ స్టైల్, ప్రజెంటేషన్, షబీర్, నైలా అద్భుతమైన యాక్టింగ్ ఈ చిత్రాన్ని పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా మార్చేశాయని అంచనా వేస్తున్నారు. ‘కింగ్ ఆఫ్ కొత్త’ పక్కా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలువడం ఖాయమంటున్నారు. అభిలాష్ జోషి దుల్కర్ సల్మాన్‌ను పక్కా మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడని…
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి సూపర్ ఫాలోయింగ్!
యువ హీరోల్లో తన సినిమాలతోనే కాదు ఆన్ స్టేజ్ తన కామెడీతో కూడా అలరిస్తూ వస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. ‘జాతిరత్నాలు’ సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా వల్ల నవీన్ కి యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పడిరది. ప్రస్తుతం నవీన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. మామూలుగా అయితే ట్రైలర్ రిలీజ్ ని ఏ సెలబ్రిటీతోనే స్టార్ హీరోతోనో చేయిస్తారు. కానీ నవీన్ అందుకు భిన్నంగా తన సినిమాలను ఆదరిస్తున్న ఆడియన్స్ నుంచి ట్రైలర్ రిలీజ్ కు గెస్ట్ లను ఆహ్వానించాడు. ట్రైలర్ రిలీజ్ కు వచ్చిన ఆడియన్స్ లో ఇద్దరు మేల్ పర్సన్స్, ఇద్దరు ఫిమేల్ పర్సన్స్…
‘ఆర్‌ఎక్స్ 100’కు సీక్వెల్!
కార్తికేయ హీరోగా, పాయల్ రాజ్ పూత్ హీరోయిన్ గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ ను నెగిటివ్ షేడ్స్ ఉన్న లేడీ పాత్రలో చూపించడం జరిగింది. హీరోయిన్‌గా ఆ సినిమా పాయల్ కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ ఒక్క సినిమా హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ తో పాటు దర్శకుడు అజయ్ భూపతికి మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. పాయల్ రాజ్ పూత్ పదుల కొద్ది సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకుంది. హీరో కార్తికేయ కూడా చాలా సినిమాల్లో నటించాడు. దర్శకుడు అజయ్ భూపతి కి కూడా మంచి క్రేజ్ దక్కింది కానీ ‘మహాసముద్రం’ సినిమాను తీసి పోగొట్టుకున్నాడు. ‘ఆర్‌ఎక్స్…
సీత పాత్రకు నో చెప్పిన ఆలియా భట్!
రామాయణ ఇతివృత్తంతో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం కూడా రామాయణ ఇతివృత్తంతో వచ్చిన విషయం అని తెలిసిందే. ‘ఆదిపురుష్’ లో జానకి పాత్రను బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ పోషించింది. ఇక గత కొన్నాళ్లుగా మధు మంతెన రామాయణం కథతో సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నితీష్ తివారి, రవి ఉద్వావర్ దర్శకత్వంలో ఈ సరికొత్త రామాయణం సినిమా మూడు లేదా నాలుగు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం. రాముడి పాత్రకు గాను రణబీర్ కపూర్ ను దాదాపుగా ఖరారు చేశారని తెలిసింది. ఇక జానకి పాత్రకు గాను ఆలియా భట్ ను సంప్రదించడం జరిగింది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతోంది. అయితే రామాయణం సినిమాలో భర్తతో కలిసి…
