పిట్టగోడ అనే ప్లాప్ మూవీతో దర్శకుడిగా ఇండస్టీక్రి పరిచయమైన అనుదీప్ .. ఆ తర్వాత ’జాతిరత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ఒక్క సారిగా టాక్ ఆఫ్ ది ఇండస్టీ అయ్యారు. ఇదే జోష్ లో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ’ప్రిన్స్’ అనే ద్విభాషా చిత్రం చేయగా అది బోల్తా కొట్టింది. అయితే దర్శకుడిగా ఆయన తనలోని మరో కొత్త కోణాన్ని బయటపెట్టేందుకు రెడీ అయిపోయారు. నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన ఫన్నీ కామెడీ మాటలతో, ఇనోసెంట్ ఎక్స్ ప్రెషన్ తో పాపులర్ అయ్యారు అనుదీప్. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో యాంకర్ల ముఖాల్లో ఓ క్వశ్చన్ మార్క్ రెయిజ్ చేయడం, షార్ట్ ఆన్సర్స్ చెప్పడం.. ఇలా రకారకాలుగా సోషల్ విూడియాలో బాగా హైలైట్ అయ్యారు. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.…
Category: Entertainment
మేకోవర్ మార్చుకుంటున్న వరుణ్ తేజ్!?
తాజాగా ‘గాంఢీవదారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ ప్రాజెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. కాగా కరుణకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కోసం మేకోవర్ మార్చుకునే పనిలో పడ్డాడు వరుణ్ తేజ్. ‘మట్కా’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ జిమ్‌లో చెమటోడుస్తూ.. సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.…
హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న సమంత!
టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ’ఇండియా డే పరేడ్’ కోసం న్యూయార్క్ వెళ్లిన సామ్.. ప్రస్తుతం అక్కడే ఉంటోంది. ఈ సందర్భంగా ఖుషి చిత్రాన్ని ప్రొమోట్ చేస్తోంది. తాజాగా సామ్ కాలిఫోర్నియా లో ఉంది. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. తన విలువైన సమయాన్ని ప్రకృతితో గడుపుతోంది. ఈ మేరకు ఫొటోలను పంచుకుంది. ఫొటోల్లో సామ్.. స్విమ్మింగ్ పూల్‌లో రిలాక్స్ అవుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన ’ఖుషి’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరెక్కిన ఈ చిత్రానికి నిన్ను కోరి, మజిలీ ఫేం శివనిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళం,…
‘లూసిఫర్’ సీక్వెల్‌కు సన్నాహాలు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ , టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘లూసిఫర్’ ఈ సినిమాకు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. ఈ చిత్రానికి ‘తని ఓరువన్’ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ చిత్రం నుంచి సీక్వెల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లూసిఫర్ 2’ ఎంపురాన్ అనే టైటిల్‌తో ఈ సినిమా రానుండగా.. ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.…
Kushi Movie Review in Telugu : ‘ఖుషి’ : మరో వైవిధ్యమైన ప్రేమకథ!
(విడుదల తేదీ : 1, సెప్టెంబర్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు. దర్శకత్వం : శివ నిర్వాణ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్, సంగీతం: హిషామ్ అబ్ధుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ: మురళి.జి, ఎడిటర్: ప్రవీణ్ పూడి) శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్ లో వచ్చిన తాజా సినిమా ఖుషి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నేడు ( 1, సెప్టెంబర్ 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఖుషి’తో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలనే తపనతో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పట్టుదలగా ఉన్నాడు. మ్యూజికల్ లవ్‌స్టోరీలో విజయ్ దేవరకొండతో సమంత జోడీ కట్టడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా…
మరో మహిళా ప్రాధాన్య పాత్రలో అనుష్క!
మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు అనుష్కశెట్టి. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో దేవసేన లాంటి పాత్రలతో మెప్పించిన ఆమె ఆ తరహాలోనే మరో పాత్ర చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకే పరిమితమైన అనుష్క తాజాగా ఓ అడుగు ముందుకేసి మలయాళ ఇండస్టీల్రో కూడా అడుగు పెడుతున్నారు.’కథనార్ ది వైల్డ్ సోర్సెరర్’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జయసూర్య హీరోగా నటించబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో అనుష్క పాత్ర ‘అరుంధతి’ తరహాలో ఉంటుందని సమాచారం. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ…
శివకార్తికేయన్ #SK21 కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి!
స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ కు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం సంబధించి హ్యుజ్ కాశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది. 75 రోజులు పాటు జరిగిన ఈ షెడ్యుల్ లో చిత్రంలోని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. కాశ్మీర్‌లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతున్నాయి. SK21 శివకార్తికేయన్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. ‘గట్స్ అండ్ గోర్’ దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజీవన్…
డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో ‘జీబ్రా’
సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించి.. జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్. సినిమాలు భారీ రేంజ్‌లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్‌ఫార్మ్ చేస్తుంటాయి. ప్రస్తుతం సత్యదేవ్ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ’జీబ్రా’ ఒకటి. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించారు. కెరీర్ బిగినింగ్ నుంచి సత్యదేవ్ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. సినిమాకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు.. సత్యదేవ్ కూడా తన రోల్‌కి డబ్బింగ్ చెబుతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాకుండా ‘జీబ్రా’ చిత్రం…
‘ఓజీ’ టీజర్ పై అభిమానుల్లో ఆత్రుత!
ఒక టీజర్ కోసం ఈ రేంజ్‌లో హడావిడి ఎప్పుడూ చూడలేదు. కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎగ్‌జైట్ అవుతారో ‘ఓజీ’ టీజర్ గురించి కూడా అదే స్థాయిలో ఎగ్‌జైట్‌కు గురవుతున్నారు. దానికి తగ్గట్లే మేకర్స్ సైతం టీజర్ గురించి బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లు ఇస్తూ ఎక్కడలేని హైప్‌ను తీసుకొస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2న టీజర్ వస్తుందని తెలుసు కానీ.. ఫలానా టైమ్ అని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. దీని గురించి ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ డీవివి సంస్థను ట్యాగ్ చేసి టైమ్ చెప్పండంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి డీవివి సంస్థ ఫ్యాన్స్‌కు గాడ్ లెవల్ రిప్లయి ఇచ్చింది. పవన్ బర్త్‌డేన అంతా పండగే కాబట్టి మీరే చెప్పండి సెప్టెంబర్ 2న ఏ టైమ్‌కు టీజర్ రిలీజ్ చేద్దామో అని పోస్ట్ చేసింది. అంతేకాకుండా…
‘జనగణమన’ ప్రాజెక్ట్…పట్టాలు తప్పలేదు!
పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమాకు మోక్షం మాత్రం కలగడం లేదు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట మహేష్‌తో చేయాలని రాసుకున్న కథ.. అలాగే ఓ మూలన పడి ఉంది. పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత మహేష్‌తో మరో సినిమా చేయాలని పూరి ‘జనగణమన’ కథను రాసుకున్నాడు. టైటిల్‌ను కూడా రిజస్టర్ చేయించాడు. అయితే మహేష్‌తో ఈ సినిమా తీయాలని ఎన్ని విశ్వ ప్రయత్నాలు జరిపినా వర్కవుట్ అవలేదు. దాంతో ప్రతీ ఏటా ఆ టైటిల్‌ను రిన్యువల్ చేస్తూ వస్తున్నాడు. ఇక అన్ని కుదిరి రౌడీ స్టార్ విజయ్‌తో ఈ సినిమాను పట్టాలెక్కించాడు. లైగర్ చేస్తున్న టైమ్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన కొంత షూట్ కూడా చేశాడు. యుద్ద విమానాలు, సైనికులు, మిస్సైల్స్, బులెట్లతో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ…
