దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విభిన్నమైన సబ్జెక్ట్‌లతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, U&I హలో వరల్డ్ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు…
Category: Entertainment
‘నా సామిరంగ’ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: కింగ్ నాగార్జున అక్కినేని
కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఆదివారం (జనవరి14న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని ‘సంక్రాంతి కింగ్’ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది. థాంక్ యూ మీట్ లో కింగ్ నాగార్జున…
Saindhav Movie Review in Telugu : ఎమోషనల్ యాక్షన్ డ్రామా !
(చిత్రం : సైంధవ్, విడుదల : 13 జనవరి-2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా తదితరులు. దర్శకత్వం : శైలేష్ కొలను, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, సంగీతం: సంతోష్ నారాయణన్, సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్) విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “సైంధవ్”. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 13 జనవరి-2024న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. సంక్రాంతి…
Ultra Media and Entertainment Enters into a Strategic Partnership with Einstin Media
– The Partnership marks Ultra’s Entry to South India – Ultra has acquired the digital rights of Einstein Media’s Joshiy directorial ‘Antony’ for a staggering amount. Ultra Media and Entertainment Mumbai a leading name in the Entertainment industry, has entered in a landmark partnership with Einstin Media, marking Ultra’s Significant entry into the South India region. Ultra marks its grand entry into the Malayalam film Industry, creating a buzz by acquiring the digital rights of the Einstin Media’s blockbuster film ‘Antony’ for a staggering amount. The collaboration aims to bring…
ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిక !!!
ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్ గౌడ్ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ గారి కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్ బాగా పెరిగినట్లుగా…
కమల్ మరో సినిమాతో రెడీ!
ఉలగనాయగన్ కమల్ హాసన్ మరో సినిమాకు సైన్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ‘విక్రమ్’ సినిమా కమల్ హాసన్‌లో ఎనర్జీని నింపడంతో.. ఇక వరసగా సినిమాలు చేస్తానని ప్రకటించిన ఈ యూనివర్సల్ స్టార్.. చెప్పినట్లుగానే వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షనర్ ’థగ్ లైఫ్’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ.. ’ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరివ్ రాజ్ కమల్…
సైంధవ్: విక్టరీ వన్ మ్యాన్ షో!
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా శనివారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. సంక్రాంతికి భారీ పోటీ ఉన్నప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ సంక్రాంతి బరిలోకి ‘సైంధవ్’ని దింపారు. ట్రైలర్‌లోనే స్టోరీ మొత్తం చెప్పేసినా.. సినిమా వెంకీ కెరీర్‌లోనే ది బెస్ట్ అని చెప్పుకునే కంటెంట్ ఉంటుందని దర్శకుడు శైలేష్ కొలను మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. శైలేష్ చెప్పినట్లే.. ఈ సినిమాలో కంటెంట్ బాగుందని, వెంకటేష్ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రం అవుతుందని.. ఇప్పటికే ఈ సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ‘సైంధవ్’ రివ్యూస్ డిఫరెంట్‌గా చూపారు. వెంకీమామ ఇంతకు ముందు సినిమాలతో పోల్చితే.. ‘సైంధవ్’…
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : ‘కల్కి’ విడుదల తేదీ ఖరారు!
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. చాలా కాలంగా వాళ్లు ఎదురుచూస్తున్న ‘కల్కి 2898’ సినిమా విడుదలపై స్పష్టత వచ్చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగానే.. కల్కి సినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ సెంటిమెంట్ ను వాడేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చి సూపర్ హిట్ అయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజైన మే 9న కల్కి ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ నెక్ట్స్ లెవల్లో ఉంది. ఆ లుక్ కల్కి సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ రిలీజ్ డేట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని…
విడుదలైన 10 రోజులకే ఓటీటీలోకి ‘సర్కారు నౌకరి’!
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమైన సినిమా ‘సర్కారు నౌకరి’ సినిమా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకున్న ఈ సినిమా.. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఆకాష్ సరసన భావన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదలైన 10 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో జనవరి 12 నుండి ఈ సినిమా స్ట్రీమిగ్ అవుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం, థియేటర్లు అన్ని పెద్ద సినిమాలకే బుక్కయిపోవడంతో.. మేకర్స్ ఈ సినిమాని ఓటీటీలోకి వదిలేశారు. ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణనే రాబట్టుకుంటున్నట్లుగా…
హనుమాన్ : మన సూపర్ మేన్ కథ!
అంజనాద్రి అనే వూరిలో హనుమంతు (తేజ సజ్జ) అతని అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) వుంటారు. హనుమంతు ఆ వూర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్నచిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ వూరికి హనుమంతు చిన్నప్పటి స్నేహితురాలు విూనాక్షి (అమృత అయ్యర్) డాక్టర్ గా చదువు పూర్తి చేసుకొని వస్తుంది. అదే వూరిలో వున్న ఒక బలమైన వస్తాదు ఆ వూరిలో దోపిడీ దొంగతనాలు చేయించి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు. ఒకసారి మీనాక్షి వెళుతున్న బస్సు మీదకి దోపీడీ దొంగలు వస్తే, అందరూ బస్సు దిగి ప్రాణాలు కాపాడుకోవటానికి అడివిలోకి పారిపోతారు. ఆ సమయంలో హనుమంతు వచ్చి మీనాక్షిని కాపాడతాడు, అదే సమయంలో దొంగలు హనుమంతుని పొడిచి అక్కడ నదిలో పడేస్తారు. హనుమంతు నీటి అడుగుకి కొట్టుకుపోతున్నప్పుడు అతనికి ఒక మణి దొరుకుతుంది,…
