ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత…
Category: Entertainment
‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు: చిత్ర యూనిట్
విలక్షణ డైలాగ్ డెలివరీతో నటుడిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్ గోమఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయ్ కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయంవంతగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. చిన్న సినిమా విడుదల కావాలంటే నేడు ఎంతో కష్టమని, ఈ సినిమా గురించి ఎన్నో అటుపోటులు ఎదుర్కొన్నానని, నేడు సినిమా విడుదలై ప్రేక్షకుల ఆదరణంతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు నిర్మాత భవాని…
‘సిద్ధార్థ్ రాయ్’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు: బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ‘సిద్ధార్థ్ రాయ్’ టీం
పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన్వి నేగి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో దర్శకుడు వి యశస్వీ మాట్లాడుతూ..…
‘సుందరం మాస్టారు’ ద్వారా దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో…!?
ఏ సినిమాకయినా కథలో బలం ఉండాలి. కథనంలో పట్టు ఉండాలి. అప్పుడు చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రముఖ నటుడు రవితేజ నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్తవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ, చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ అనే సినిమాతో కళ్యాణ్ సంతోష్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. హాస్య నటుడిగా పలు చిత్రాలలో నటించిన హర్ష చెముడు ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు, దివ్య శ్రీపాద కథానాయకురాలు. సుందరం (హర్షవర్ధన్) ఒక ప్రభుత్వ కళాశాలలో సోషల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి కట్నం మీద ఆశ ఎక్కువ, అందుకని ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారా అని పెళ్లి ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ ప్రాంత ఎమ్మెల్యే (హర్షవర్ధన్)కి మిరియాలమెట్ట గ్రామం నుండి…
Mukhya Gamanika Telugu Movie Review :’ముఖ్యగమనిక’ మూవీ రివ్యూ : థ్రిల్ కలిగించే క్రైమ్ కథ!
టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే క్రైమ్..ఇన్వెస్టిగేటివ్ కథలకు మంచి స్పందన ఉంటుంది. అలాంటి కథలకు ఆడియెన్స్ బాగా ఎట్రాక్ట్ అవడమేగాక.. సినిమాను ఆదరించి బాక్సాఫీస్ వద్ద కాసులపంట పండిస్తుంటారు. సరైన కథ.. అందుకు తగ్గ స్క్రీన్ ప్లే తో క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరి స్తే… బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్టే. సరిగ్గా ఇలాంటి కథ ఒకటి ప్రేక్షకుల మనసులను దోచుకోవడానికి వచ్చింది. ఆ కథే ‘ముఖ్యగమనిక’. టైటిలోనే ఎంతో క్యాచీనెస్ కనిపిస్తుంది. దర్శకుడు వేణు మురళీధర్. వి. ‘ముఖ్య గమనిక’ అనే ఈ కథను ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కజిన్ … అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడక్షన్స్…
‘మార్కెట్ మహాలక్ష్మి’ టీజర్ సూపర్బ్: హీరో శ్రీ విష్ణు
హీరో “శ్రీ విష్ణు” చేతుల మీదగా “మార్కెట్ మహాలక్ష్మి” టీజర్ లాంచ్… కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ ‘టీజర్’ ని టాలీవుడ్ హీరో “శ్రీ విష్ణు” ఘనంగా లాంచ్ చేసారు. అనంతరం… హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ: ‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ టీజర్ చూసాను చాలా ఫన్నీ గా ఉంటూనే హీరో & హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుంది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి, అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి…
“Actor Sree Vishnu Unveils ‘Market Mahalakshmi’ Teaser!”
‘Kerintha’ fame Parvateesam and newcomer Praneekaanvikaa will be seen in a family-friendly movie titled ‘Market Mahalakshmi’. Directed by VS Mukkhesh, the film is produced by Akhilesh Kalaru. Bankrolled by B2P Studios, the entertainer also stars Harsha Vardhan, Mahaboob Basha, and Mukku Avinash in other roles. Days after its Concept Motion Poster was released, the makers unveiled a Teaser today. Actor Sree Vishnu released the Teaser and praised the team. Actor Sree Vishnu said, “I have seen the teaser. The characterizations of the male and female leads are so good while…
స్మశానంలో ‘గీతాంజలి మళ్లీ వచ్చేసింది’ టీజర్ లాంచ్ కార్యక్రమం!?
ఈమధ్య సినిమాల ప్రచారాలు కొంచెం విచిత్ర ధోరణిలోనే వెళుతున్నాయని చెప్పుకోవచ్చు. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చిత్ర నిర్వాహకులు కూడా వైవిధ్యంగా ఉండటం కోసమని ఏకంగా స్మశానవాటికలోనే తమ సినిమా టీజర్ లాంచ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ లాంచ్ చేస్తున్నాం అని ఆ చిత్ర పీఆర్ విూడియా వాళ్ళకి మెసేజ్ లు పంపాడు. ఈ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ఇంతకు ముందు విడుదలై ఘన విజయం సాధించిన ‘గీతాంజలి’ కి సీక్వెల్ గా వస్తోంది. ఇందులో అంజలి ప్రధానపాత్రలో నటించింది. శివ తుర్లపాటి దీనికి దర్శకుడు, కోన వెంకట్ కథని సమకూర్చారు, ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగం అయ్యారు. ఇంకా ఇందులో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్,…
శ్రీవిష్ణు కొత్త చిత్రం ‘ఓం భీమ్ బుష్’
యంగ్ హీరో, కథల విషయంలో ఆచితూచి అడుగేసే శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. గత సంవత్సరం ‘సామజవరగమన’ చిత్రంతో విజయం అందుకున్న ఆయన మరో హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ‘బోచేవారెవరురా’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు , ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి కలిసి నటించడం విశేషం. ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఓం భీమ్ బుష్’ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. ‘నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓం భీమ్ బుష్’ పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ…
విడుదలకు ‘సి202’ హారర్ చిత్రం రెడీ…!
మైటీ ఒక్ పిక్చర్స్ పతాకం పై తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ’సి 202’. మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి మనోహరి కె ఎ నిర్మాత. పూర్తి గా రాత్రిపూట చిత్రీకరించబడిన ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ విశేషం ఏమిటంటే.. ఒక్క డైలాగ్ కూడా లేకుండా ముఖ్య తారాగణాన్ని చూపిస్తూ.. కేవలం సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఉండటం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు, హీరో అయిన మున్నా కాశి మాట్లాడుతూ..…
