సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ ఆర్ కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘జిలేబి’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ ఫన్ టాస్టిక్ ట్రీట్ ని ఇచ్చింది. ”మా హాస్టల్ లో వున్నది స్టూడెంట్స్ కాదు వజ్రాలు. 24 హావర్స్ చదువుతూనే వుంటారు” అని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ తో మొదలైన టీజర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగింది. టీజర్ మిడిల్ లో…
Category: Entertainment
దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెం 4 ప్రారంభం
దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4 గా శ్రవణ్ రెడ్డి ,రియా కపూర్ ప్రధాన పాత్రలలో వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా రూపొందిస్తున్నారు. శ్యామ్ దేవభక్తుని నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అజయ్ ఘోష్ క్లాప్ కొట్టగా సుహాస్ కృష్ణ దేవభక్తుని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమినీ కిరణ్ స్క్రిప్ట్ అందించగా తొలి సన్నివేశానికి వాసుదేవ్ పిన్నమరాజు దర్శకత్వం వహించారు. సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అఖిల్ దేవ్ డీవోపీ గా పని చేస్తున్నారు. GH గ్యారీ ఎడిటర్. ఈ చిత్రంలో ప్రధాన సన్నివేశాలను వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలో చిత్రీకరించనున్నారు. తారాగణం: శ్రవణ్ రెడ్డి, రియా కపూర్,అవన్, అభిరామి, రవిబాబు, సుబ్బరాజు,…
‘సిద్ధార్థ్ రాయ్’ చెలియా చాలు పాట విడుదల
టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేసిన వి యేశస్వి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1 గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి చెలియా చాలు అనే పాటని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. రధన్ ఈపాటని సోల్…
రొమాంటిక్ థ్రిల్లర్ ‘కనులు తెరిచినా కనులు మూసినా’ ట్రైలర్ విడుదల
సాయి రోనక్, దేవిక సతీష్ ప్రధాన పాత్రలలో సందీప్ రెడ్డి కెటీ దర్శకత్వంలో ఫ్లయింగ్ ఈగల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఎస్ఎన్ స్వామి నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కనులు తెరిచినా కనులు మూసినా’. కిరణ్ పర్వతనేని సహా నిర్మాత. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చాలా క్యురియాసిటీని పెంచింది. ప్రేమ, నమ్మకం, స్వార్థం, మోసం, కుట్రల మధ్య జరిగిన ఆటలో చివరికి ఏమైయిందనేది చాలా ఆసక్తికరంగా చుపించారు. సాయి రోనక్, దేవిక మిగతా నటీనటులు చక్కని నటన కనబరిచారు. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. దాము నర్రావుల కెమరాపనితనం ఆకట్టుకుంది. గౌర హరి అందించిన నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి శశాంక్ మాలి ఎడిటర్. తారాగణం: సాయి రోనక్, దేవిక సతీష్, అర్జున్ ఆనంద్, ఉషా శ్రీ, అభిలాష్ బండారి, అనీష్ కురువిల్లా,…
విడుదలకు ‘LGM’ సిద్ధం!
ఇండియన్ క్రికెట్ హిస్ట్రరీలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. త్వరలోనే ట్రైలర్‌ను, ఆడియో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమేష్ తమిళ్ మణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్షకుల గుండెలను తాకుతుంది.…
విజయ్ దేవరకొండ # VD12 రెగ్యులర్ షూటింగ్ మొదలు
విజయ్ దేవరకొండ 12వ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఈరోజు సారథి స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. అవార్డ్ విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కథానాయిక గా ప్రకటించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకులలో ఒకరైన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి…
వినూత్న పద్ధతిలో ‘భీమదేవరపల్లి బ్రాంచి’ ట్రైలర్ విడుదల
తెరవెనుక ఉండి ఒక సంఘటనని, ఒక సందర్భాన్ని ,సామాన్యుడిని వైరల్ చేసి హీరోలుగా చేస్తారు కొందరు. టాప్ టెన్ యూట్యూబర్స్, టాప్ టెన్ ట్విట్టరైట్స్, టాప్ టెన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెసర్స్, టాప్ టెన్ ఫేస్బుక్ పేజర్స్ అందరూ తెర వెనుక హీరోలు. అలాంటి వారు అందరూ ఒకేసారి అంతర్జాతీయ వేదిక మీది కొచ్చి ఈరోజు సాయంత్రం 5గంటల 9 నిమిషాలకు “భీమదేవరపల్లి బ్రాంచి” ట్రైలర్ విడుదల చేస్తున్నారు. భీమదేవరపల్లి బ్రాంచి చిత్రం కథ నుంచి నటీనటుల ఎంపిక నుంచి నిర్మాణం, ప్రచారం, మూస దోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ వినూత్నంగా సరికొత్త పద్ధతుల్లో వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒక సినిమాని కార్టూన్స్ ద్వారా ప్రచారం చేయాలనే దర్శకుడు రమేష్ చెప్పాల ఆలోచనతో సినిమా జనాల్లోకి వెళ్ళింది. ఫ్రెష్ ఫీల్ ఉన్న టీజర్ విడుదలై వైరల్ అయింది. జూన్…
ఈ నెల 23న విడుదలవుతోన్న `కుట్ర` ప్రీ-రిలీజ్!!
సిరి ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సిరిపురం రాజేష్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘కుట్ర’ (ద గేమ్ స్టార్స్ నవ్ ట్యాగ్‌లైన్). ప్రీతి, గీతిక రతన్, ప్రియ దేశ్‌పాల్ హీరోయిన్లు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్ లో ప్రీ-రిలీజ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, టియస్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎక్స్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, టియస్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎక్స్ చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ, సినీ ప్రముఖులు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు…
Mulugu MLA Seethakka unveils Jagratha Bidda’s trailer : Film set for June 23rd release
Jagratha Bidda is a tale of a brother’s revenge for the gross injustice meted out to his doting little sisters. Popular TV serial director Krishna Mohan makes his feature film debut with this movie, which is produced jointly on K.S.B. Creations and M.M. Art Productions banners. Retd. Police officer Srikanth Karanam and MY Giri Babu are the producers of this concept-oriented movie. Jagratha Bidda’s theatrical trailer has been launched by Mulugu’s firebrand MLA Seethakka. She congratulated the movie’s unit for making a message-oriented movie. She wished that Jagratha Bidda will…
“జాగ్రత్త బిడ్డా” ప్రచారచిత్రం ఆవిష్కరించిన సీతక్క: ఈనెల 23 న విడుదల!!
కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు చెల్లెళ్ళకు జరిగిన తీరని అన్యాయానికి ఓ అన్న విధించిన శిక్ష నేపథ్యంలో రూపొందిన చిత్రం “జాగ్రత్త బిడ్డా”. టీవి సీరియల్స్ రూపకల్పనలో విశేష అనుభవం కలిగిన బహుముఖ ప్రతిభాశాలి “కృష్ణ మోహన్”ను దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేస్తూ… కె.ఎస్.బి.క్రియేషన్స్ – ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై… విశ్రాంత పోలీస్ అధికారి శ్రీకాంత్ కరణం – ఎమ్.వై.గిరిబాబు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “జాగ్రత్త బిడ్డా” ఈనెల 23న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. “మినిమం గ్యారంటీ మూవీస్” (ఎమ్.జి.ఎమ్) ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు!! ఈ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే – ఫైర్ బ్రాండ్ సీతక్క “జాగ్రత్త బిడ్డా” ట్రైలర్ విడుదల…
