పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాల్లో ‘ఉక్కు సత్యాగ్రహం’

పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాల్లో ‘ఉక్కు సత్యాగ్రహం’

గతంలో సర్దార్ చిన్నపరెడ్డి,అయ్యప్ప దీక్ష,రంగులకళ,సిద్ధం,కుర్రకారు,ప్రత్యూష,టీ నగర్(తమిళ్) శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ కరిష్మా కోటక్ తో గ్లామర్, ప్రశ్నిస్తా వంటి హిట్ చిత్రాలతో కలిపి మొత్తం 52 చిత్రాలకు పైగా నిర్మించిన జనంస్టార్ సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ,దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది.ఈ చిత్రంలొప్రజాగాయకుడు గద్దర్‌ కీలకపాత్ర పోషించారు. ఈచిత్రం ద్వారా గాజువాక పల్సర్‌ బైక్‌ ఝాన్సీ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. వైజాగ్‌ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,మేఘన, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్,ఆదినారాయణ, వెంకట్రావు,ప్రసన్న కుమార్,కేయస్ఎన్ రావ్,మీరా,పల్నాడు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి,హనుమయ్య,అప్పికొండ అప్పారావ్, బాబాన్న,సింగ్ తదితరులు కీలకపాత్రలుపోషించారు. ఈ…

‘లవ్ యూ రామ్’ అందరికీ నచ్చే ఎంటర్ టైనర్ : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ‘లవ్ యూ రామ్’ టీమ్

'లవ్ యూ రామ్' అందరికీ నచ్చే ఎంటర్ టైనర్ : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'లవ్ యూ రామ్' టీమ్

కె దశరధ్, డివై చౌదరి “లవ్ యూ రామ్” థియేట్రికల్ ట్రైలర్ విడుదల- జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌ కి మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను మేకర్స్ లాంచ్ చేశారు అపర్ణకు రోహిత్ తన ప్రేమను ప్రపోజ్ చేయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అయితే రామ్ మాత్రం ‘రాముడు మంచి బాలుడు’ టైపు కాదు. అతను చాలా స్వార్థపరుడు, చాలా మంది అమ్మాయిల ఎమోషన్ తో ఆడుకుంటాడు. అపర్ణతో ప్రేమ ప్రయాణంలో రామ్ మంచి…

ఆంజ‌నేయ స్వామిని న‌మ్ముకున్న కుటుంబం మాది.. మంగ‌ళ‌వారం రోజున పాప‌ను ప్ర‌సాదించ‌టం ఎంతో అపురూపం: మెగాస్టార్ చిరంజీవి

ఆంజ‌నేయ స్వామిని న‌మ్ముకున్న కుటుంబం మాది.. మంగ‌ళ‌వారం రోజున పాప‌ను ప్ర‌సాదించ‌టం ఎంతో అపురూపం: మెగాస్టార్ చిరంజీవి

మెగా ఇంట సంబ‌రాలు నెల‌కొన్నాయి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంపతుల‌కు పాప‌ పుట్టింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ అపోలో హాస్పిట‌ల్‌లో పాప పుట్టింది. మెగా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు స‌హా మెగాభిమానులు ఈ విష‌యంతో సంతోషంగా ఉన్నారు. ఈ విష‌యం గురించి అపోలో డాక్ట‌ర్ సుమ‌నా మ‌నోహ‌ర్‌ మాట్లాడుతూ ‘‘ఈరోజు తెల్ల‌వారుజామున ఉపాస‌న‌కు పాప పుట్టింది. త‌ల్లీ బిడ్డా ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నారు. వీలైనంత త్వ‌ర‌గా వారు ఇంటికి కూడా వెళ‌తారు. డాక్టర్ రూమా సిన్హాగారు ఆమెను రెగ్యులర్‌గా ప‌రీక్షించి జాగ్ర‌త్త‌లు చెబుతూ వ‌చ్చారు. అలాగే డాక్టర్ లతా కంచి పార్థ‌సార‌థి న్యూట్రిషన్ సలహాలిస్తూ వచ్చారు. అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఆహార విష‌యంలో, ఫిట్‌నెస్ విష‌యంలో ఉపాస‌న ఎంతో కేర్‌ తీసుకున్నారు. ఆమె అంత జాగ్ర‌త్త‌గా ఉంటూ వ‌చ్చారు కాబ‌ట్టే సుఖ ప్ర‌స‌వం జ‌రిగింది’’…

‘బేబీ’ నుంచి ‘రిబపప్పా’ లిరికల్ సాంగ్ విడుదల

'బేబీ' నుంచి 'రిబపప్పా' లిరికల్ సాంగ్ విడుదల

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని సహ నిర్మాత. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల చేస్తున్న ప్రతి పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. తాజాగా ‘బేబీ’ సినిమా నుంచి ‘రిబపప్పా’ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఆనంద్, వైష్ణవి, విరాజ్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరిని చూపించారు. ‘ఎదురుగా ఇంతదంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వూ..ఎదసడే హద్దులు దాటే చూడూ చూడూ…కుదురుగా ఉందామన్నా ఉంచట్లేదే నన్నే నువ్వు..’అంటూ ప్రేమ చేసే మాయను వర్ణిస్తూ…

ఘనంగా ‘ఆదిపురుష్’ రామ కోటి ఉత్సవం

ఘనంగా ఆదిపురుష్ రామ కోటి ఉత్సవం

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించారు. కృతి సనన్ సీతగా కనిపించింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. గత శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో రామ జయం, రఘురామ జయం పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ – యుగాలు, తరాలు మారినా రామ కథ మారదు. రాముడి మీద మనకున్న భక్తి, గౌరవం మారవు. తెలుగు ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదిపురుష్ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు. మైత్రీ మూవీ…

‘మను చరిత్ర’లో ఆర్ఎక్స్100 వైబ్స్ కనిపిస్తున్నాయ్. సినిమా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో కార్తికేయ.

‘మను చరిత్ర’లో ఆర్ఎక్స్100 వైబ్స్ కనిపిస్తున్నాయ్. సినిమా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో కార్తికేయ.

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ స్టొరీ ‘మను చరిత్ర.ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో కార్తికేయ ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిత్ర యూనిట్ తో పాటు హీరో రక్షిత్, డైరెక్టర్ అజయ్ భూపతి, కొండా విజయ్, శేఖర్ రెడ్డి తదితరులు ఈవెంట్ కు హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈవెంట్ లో అజయ్,…

మెగా ప్రిన్సెస్ ఎంట్రీ : తల్లిదండ్రులు అయిన చరణ్, ఉపాసన

మెగా ప్రిన్సెస్ ఎంట్రీతో సంబరాల్లో ఫ్యాన్స్!

  ఖుషీ..ఖుషీగా మెగా ఫ్యాన్స్ సంబరాలు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దాంతో మెగా ఫ్యామిలిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఇద్దరూ ఎంతో క్షేమంగా వున్నారని, మెగా కుటుంబంలో అందరూ రామ్ చరణ్ దంపతులకి సంతోషంగా విషెస్ చెబుతున్నారు. పవర్ కపుల్ అని పిలవబడుతున్న రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెలకి పండంటి పాపాయి పుట్టడంతో ఇన్నాళ్లూ ఎదురుచూస్తోన్న మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె వెంట, భర్త రామ్ చరణ్, అత్తగారు సురేఖ, ఆమె మదర్ అందరూ వెంట రాగ, నిన్న రాత్రి అపోలో హాస్పిటల్ లో చేరిన ఉపాసన ఈరోజు అంటే మంగళవారం తెల్లవారుజామున పండంటి పాపాయికి జన్మనిచ్చిందని…

ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లింది: నట కిరీటి రాజేంద్రప్రసాద్

ఆ ఘనత ఎన్టీఆర్ కే చెల్లింది!!

వైభవంగా కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అంతర్జాతీయ క్యారికేచర్ కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ వేడుక రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతమని, ఈరోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని… “కలయిక ఫౌండేషన్” అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేసింది. రెండు విభాగాల్లో ప్రధములుగా నిలిచినవారికి లక్ష రూపాయల చొప్పున బహూకరించి, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి –…

ఘనంగా ‘కర్ణ’ ప్రీ రిలీజ్ వేడుక.. ఈ నెల 23న థియేటర్లలో విడుదల

ఘనంగా 'కర్ణ' ప్రీ రిలీజ్ వేడుక.. ఈ నెల 23న థియేటర్లలో విడుదల

సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్ నటీ నటులుగా కళాధర్ కొక్కొండ స్వీయ దర్శకత్వంలో తనే హీరో గా నటిస్తున్న చిత్రం “కర్ణ”. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 23న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్న సందర్భంగా శనివారం హైదరాబాద్ లో .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ అనిల్ కుర్మాచ‌లం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.…

సృజన ఒక్కటే చాలదు.. కృషి, అంకిత భావం, పట్టుదల ఉన్నవారినే విజయం వరిస్తుంది!

సృజన ఒక్కటే చాలదు.. కృషి, అంకిత భావం, పట్టుదల ఉన్నవారినే విజయం వరిస్తుంది!

– దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ 6 వ స్నాతకోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రముఖ దర్శకులు “అంకురం” ఉమామహేశ్వరరావు సారథ్యంలో అందరికీ అందుబాటులో… అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడుతున్న “దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్” ఆరవ స్నాతకోత్సవం జూన్ 18, ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ వంటి పలు విభాగాల్లో సుశిక్షితుల్ని చేస్తూ… సినిమా రంగానికి అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ స్నాతకోత్సవానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రియేటివిటితో పాటు కృషి, పట్టుదల, అంకితభావం ఉన్నవారిని మాత్రమే సినిమారంగం విజయాలు అందిస్తుందని ఈ సందర్భంగా దిల్ రాజు పేర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, దర్శకనిర్మాత…