యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ మున్సిపల్ పరిధిలోని మైనార్టీ యువజన విభాగం షాబుద్దీన్, ముజాహిద్ పాషా నాయకత్వంలో సుమారు 100 మందికి పైగా మైనారిటీ సభ్యులు ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని యాదగిరిగుట్ట లోని తమ నివాసంలో కలిశారు. ఆలేరు నియోజకవర్గంలోని మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినట్టు, దానికి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఆలేరులో పట్టణంలో మైనార్టీ బిల్డింగ్ మంజూరు కోసం మర్యాదపూర్వకంగా కలిసినట్టు మైనారిటీ నాయకులు తెలిపారు. ఈసందర్బంగా చైర్మన్ గొంగిడిని కలిసినవారిలో ఫయాజ్, జమాల్, అష్షు, రఫీ, అస్లాం, రైష్ తదితరులు ఉన్నారు.
Category: ఇతరములు
జనసేనాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్ & సోషల్ మీడియా అకౌంట్స్
తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రెటరీ వై. జె. రాంబాబు గారు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ గారు, గార్ల ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న ఈ తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ చాలా నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి ఉండే తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్ ని, యూట్యూబ్ ఛానల్ ని నా చేతుల మీదగా ప్రారంభించడం చాలా ఆనందం గా ఉంది, 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్ లో నాకు బాగా నచ్చిన అంశం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకి 3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత భీమా కింద 15 లక్షలు, ఆక్సిడెంట్ పాలసీ కింద 25 లక్షలు ఇవ్వడం వారి కుటుంభం సభ్యులకి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 175 మంది జర్నలిస్టుల పై ఆధారపడ్డ వారిని కలిపి…
ఐజేయూ సారథిగా శ్రీనివాస్ రెడ్డి
ఐజేయూ సారథులుగా తిరిగి ఎన్నికైన కె. శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడుగా కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ గా బల్విందర్ సింగ్ జమ్మూ తిరిగి ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులతోపాటు, 150 మంది ఐజేయూ కౌన్సిల్ సభ్యుల పదవులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి కె. శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ పదవికి బల్విందర్ సింగ్ జమ్మూ తరపున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారిద్దరూ పోటీ లేకుండా ఎన్నికైనట్టు ఐజేయూ ఎన్నికల సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ (సీఆర్డీ) ఎం.ఎ. మాజిద్ ప్రకటించారు. వారిద్దరి తరపున 12 రాష్ట్రాల నుంచి రెండేసి సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. అది…
జాతీయ క్రీడాకారుడు పూల చంద్రకుమార్ కు క్రీడా పురస్కారం .
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని, హాకీ మాంత్రికుడు ధాన్చేంద్ జయంతి సందర్భంగా, సోమవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానం భువనగిరిలో జిల్లా యువజన క్రీడల శాఖ మరియు శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ భువనగిరి వారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు, అందులో భాగంగా ఆలేరు పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు ఫ్రెండ్స్ క్లబ్ సభ్యుడు అయిన పూల చంద్రకుమార్ ను మెమొంటో మరియు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ధనంజయులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణ, కొక్కో సంఘం కార్యదర్శి అతి కృష్ణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ పాండు, శంకర్, అనిల్, సైదులు, మరియు ఆలేరుకు చెందిన ఫ్రెండ్స్ క్లబ్, సుభాష్ యూత్…
జాతీయ క్రీడాకారుడు పూల చంద్రకుమార్ కు క్రీడా పురస్కారం .
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని, హాకీ మాంత్రికుడు ధాన్చేంద్ జయంతి సందర్భంగా, సోమవారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానం భువనగిరిలో జిల్లా యువజన క్రీడల శాఖ మరియు శాంతి స్పోర్ట్స్ అసోసియేషన్ భువనగిరి వారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ క్రీడలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు, అందులో భాగంగా ఆలేరు పట్టణానికి చెందిన జాతీయ క్రీడాకారుడు ఫ్రెండ్స్ క్లబ్ సభ్యుడు అయిన పూల చంద్రకుమార్ ను మెమొంటో మరియు శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ధనంజయులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణ, కొక్కో సంఘం కార్యదర్శి అతి కృష్ణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ పాండు, శంకర్, అనిల్, సైదులు, మరియు ఆలేరుకు చెందిన ఫ్రెండ్స్ క్లబ్, సుభాష్ యూత్…
ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు : సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే
హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయుడబ్ల్యుజె). ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షనా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాడు ఎన్వీ రమణ గారిని ఢిల్లీ లోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు.…
భగీరధకు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన
సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత భగీరథను భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందించారు . మహానటుడు, తెలుగు దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రామారావు గారితో చేసిన ఇంటర్వ్యూలు, ఆయనతో వున్న అనుభవాలతో భగీరథ “మహానటుడు , ప్రజా నాయకుడు – ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకాన్ని శుక్రవారం (19 ఆగస్టు-2022) రోజు వెంకయ్య నాయుడుని హైదరాబాద్ లో కలసి బహూకరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఎన్ .టి .ఆర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు . సినిమా రంగంలోనూ , రాజకీయ రంగంలోనూ ఎన్ .టి .ఆర్ చెరిగిపోని ముద్ర వేశారని , ఆయన ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహా నటుడు ,…
చంద్ర సిద్దార్థ సోదరులు…దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు
ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక – నిర్మాత రాజేంద్ర ప్రసాద్ నేడు తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘ఆ నలుగురు’ సహా తెలుగు చిత్రాలు తీసిన దర్శకులు చంద్ర సిద్ధార్థకు ఈయన సోదరులు. తెలుగు సినిమా ‘నిరంతరం’ (1995)కు రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాత రచయిత. ‘నిరంతరం’ సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో ‘మన్ విమన్ అండ్ ది మౌస్’, ‘రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్’ ‘ఆల్ లైట్స్, నో స్టార్స్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా సేవలు అందించారు. హిందీ సినిమాలు కూడా…
స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలి : ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం!
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో పాటు 75 పతాకాలను విద్యార్థులు చేతబూని పట్టణ వీథుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బండిరాజుల శంకర్ మాట్లాడుతూ ఎందరో వీరులు ప్రాణాలర్పించి సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యాన్ని తిరిగి కోల్పోకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో జయమ్మ, భిక్షపతి, పరమేశ్వరి, వాణిశ్రీ,, అన్నపూర్ణ, శ్రీధర్, భీమేశ్, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.
‘ఆజాది కా గౌరవ్ పాదయాత్ర’లో పాల్గొన్న సునీత రావు
శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం ఆజాది కా గౌరవ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం నుండి చౌటుప్పల్ వరకు పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతరావు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వజ్రోత్సవాలలో భాగంగా శనివారం పాదయాత్రలో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, హైదరాబాద్ ప్రెసిడెంట్ వరలక్ష్మి, స్టేట్ సెక్రెటరీ పావని జిల్లా వైస్ ప్రెసిడెంట్ పద్మ , లక్ష్మి, సుబాషిని, శభాన బుజ్జి ,అమృత, శ్రీ లత, అనిత, రాణి స్వప్న మొదలగువారు పాల్గొన్నారు,