హైదరాబాద్: మాంసాహారులకు యాంటీబయాటిక్స్ లేకుండా సురక్షితమైన ,రుచికరమైన మరియు పోషకాలతో కూడిన చికెన్ అందించటానికి మధూస్ హెర్బల్ చికెన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఐసిఎఆర్-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ యస్.బి.బర్బుద్దే అన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఐసిఎఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో మధూస్ హెర్బల్ చికెన్ ప్రారంభం సందర్బంగా జరిగిన సాంకేతిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆకలి సూచికలో 125 దేశాలలో భారతదేశం 111 వ స్థానంలో ఉండటం భారత జనాభా యొక్క పోషక అవసరాలను పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుందని అన్నారు.మాంసంతో సహా జంతు ఆధారిత ఆహారాలు ప్రోటీన్, విటమిన్ మరియు ఖనిజ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.మాంసం ఉత్పత్తి,ప్రోససింగ్ మరియు వినియోగ సాంకేతికత ల…
Category: ఇతరములు
”వీలైక్ మేకప్ &హెయిర్ అకాడమీ” బ్యూటీ ప్రొఫెషనల్స్ భవిష్యత్తును రూపుదిద్దడానికి మార్గదర్శి!
బ్యూటీ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ లో కొత్త శకానికి నాంది పలుకుతూ యూసుఫ్‌గూడ లోని వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యం పైన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమం లో వీలైక్అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్ తో పాటు కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్స ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి తరంతో పాటు తదుపరి తరం నిపుణులను ప్రోత్సహించడానికి, సమగ్ర పాఠ్యప్రణాళిక, అత్యాధునిక సౌకర్యాలు మరియు పరిశ్రమ-ప్రముఖ బోధకుల బృందంతో, వీలైక్ సాంకేతిక నైపుణ్యం మరియు సృజనాత్మక విశ్వాసంతో విద్యార్థులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యూటీ పరిశ్రమపై మక్కువ ఉన్న వ్యక్తులను ప్రేరేపించడం మరియు వారికి అవగాహన కల్పించడం బ్రైడల్…
టెట్ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత
రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో పేపర్-1లో 69,476 మంది అభ్యర్థులకుగాను 41,327 (59.48 %) మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్-2లో మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 69,390 మంది పరీక్షకు హాజరుకాగా.. 23,755 (34.24 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్‌లో 66,412 మందికిగాను.. 18,629 (28.205 %) మంది అర్హత సాధించారు. మొత్తానికి పేపర్-1, పేపర్-2 రెండూ కలిపి 2,05,278 మంది పరీక్షలకు హాజరుకాగా.. 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో…
L V Prasad Eye Institute’s Institute for Vision Rehabilitation (IVR) Wins First-ever Governor’s Excellence Award 2024
The Institute of Vision Rehabilitation (IVR) of the L V Prasad Eye Institute (LVPEI) received the Governor’s Award for Excellence in Divyangjan Welfare on January 26, 2025, at Raj Bhavan. The award included a citation and a cheque for rupees two lakhs. The esteemed recognition highlights the institute’s exceptional contributions to empowering, including, and supporting persons with disabilities (Divyangjan). As one of the very few eye institutes in the world that has integrated vision rehabilitation into its functional arms since inception (in 1992) the award is a recognition of LVPEI’s…
సాంస్కృతిక రత్న రాధాకృష్ణ!
సమాజం స్వార్ధపూరితం! కలుషితమయం! అయినా కొందరు మాత్రం ఇంకా విలువలను కాపాడుతూ అక్కడక్కడా ఉన్నారు! అందులో మా జమలాపురం రాధాకృష్ణ గురించి కొంచెం చెప్పుకోవాలి! ఆయన గురించి ఆయన ఆలోచిస్తారో లేదో కానీ, స్నేహం కోసం మాత్రం సొంత పనులకు కూడా బ్రేక్ వేసి సమయం ఇస్తారు! ఎదుటివారు స్వార్ధంగా ఆలోచించినా ఆయన మాత్రం స్వచ్ఛంగా ప్రేమిస్తారు! ఆయనకు సంస్కృతీ, సంప్రదాయాలు చాలా ఇష్టం! సాంస్కృతిక కార్యక్రమం ఉందని ఆహ్వానిస్తే ఎంత దూరం భారం అయినా సొంత ఖర్చుతో వచ్చేస్తారు! వస్తూ వస్తూ మరో నలుగురిని కారులో తీసుకొచ్చి వారికి సంతోషాన్ని కలిగిస్తారు! సాంస్కృతిక ప్రదర్శనలు చూడటానికి కూడా అదృష్టం ఉండాలంటారు! అంత ఇష్టం ఆయనకు! కారులో లాంగ్ డ్రైవింగ్ చేయడం ఆయనకు యమ ఇష్టం! ఆత్మీయ మిత్రులు దూర ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్లాలన్న…
ఒంటరి మహిళల కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ.. ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’పై ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్
ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సంస్థ పని చేస్తోంది. ఈ క్రమంలో ఈ స్వచ్చంద సంస్థ ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్, యువ హీరో నరేన్ వనపర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. కమిషనర్ జీవన్ లాల్ మాట్లాడుతూ.. ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సంస్థ గురించి చాలా విన్నాను. ఒంటరి మహిళల గురించి పాటు పడే సంస్థలు చాలా అరుదు. నాకు తెలుసు ఒంటరి మహిళల గురించి పని చేస్తున్న ఏకైక సంస్థ ఇదే. ఒంటరి మహిళల కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇంట్లో మగాడు చేసే పనుల వల్లే మహిళలకు కష్టాలు వస్తాయి. ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలేవీ తీసుకు రావడం లేదు. ఈ సంస్థ ద్వారా…
Bhakti TV – NTV Koti Deepotsavam from November 9..don’t miss it
Kartika month is considered as the most auspicious month by all Hindus. The month of Kartika is said to be very special for Shiva Keshavas as well. In Hyderabad, Kartikamasam is a festival organized jointly by Bhakti TV and NTV for all Hindus. As it happens every year in Hyderabad, everything is ready to organize Kartika Koti Deepotsava from November 9th to November 25th. This year too, all the programs have been prepared to hold the program at the NTR Stadium in Hyderabad so that the devotees will be moved…
ఇద్దరూ ఇద్దరే : పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు!
ఇద్దరూ ఇద్దరే .. పాత్రికేయ దిగ్గజ శిఖరాలు.. పెద్ద పత్రికలను వదిలేస్తున్నారు! ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ అద్భుత ఆలోచనలు! ఇద్దరివీ మంచి కలాలు! గొప్ప రాతలు! సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వాలు! ఎప్పటికప్పుడు కొత్తదనం ఆహ్వానించే పాత్రికేయ దిగ్గజాలు! కొత్త ట్రెండ్స్ ను పరిచయం చేసే దమ్మున్న పాత్రికేయ శిఖరాలు! నిరంతరం తాజాగా ఆలోచించే సంపాదకులు! టన్నులు కొద్దీ చురుకైన పాత్రికేయులను తయారు చేసే ఫ్యాక్టరీలు! తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికా ఎడిటర్లు! వారెవరో కాదు…ఒకరు వి. మురళి, ఇంకొకరు కె. శ్రీనివాస్! ఒకరు సాక్షి ఎడిటర్! ఇంకొకరు ఆంధ్రజ్యోతి ఎడిటర్! ఇద్దరూ మంచి మిత్రులు! జర్నలిజంలో ఎన్నో ప్రయోగాలు చేసిన అక్షర శాస్త్రవేత్తలు! ఇద్దరూ ఒకేసారి సంపాదకులుగా పదవీ విరమణ చేస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు కె. శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి సంపాదకులుగా వుంటారని…
నేత్రపర్వంగా విశిష్ఠ నృత్యార్పణం !
ప్రవాస నర్తకి విశిష్ఠ డింగరి సమర్పించిన భరత నాట్యం నృత్యార్పణం నేత్రపర్వంగా సాగింది. ఆంగికాభినయం, కరణాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రదర్శించిన ఆయా అంశాలు చూడముచ్చటగా అర్ధవంతంగా నాట్య ప్రియులను ఆకట్టుకున్నాయి. ముంబయికి చెందిన నృత్యోదయ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో అమెరికా నుంచి విచ్చేసిన హైదరాబాద్ కు చెందిన విశిష్ఠ డింగరి భరత నాట్య సోలో ప్రదర్శన జరిగింది. త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామిజీ జ్యోతి ప్రజ్వలన చేసి విశిష్ఠ డింగరి నృత్య ప్రదర్శనకు శుభారంభం పలికారు. ముంబయికి చెందిన ప్రముఖ నాట్య గురు డా. జయశ్రీ రాజగోపాలన్ శిష్యురాలు అయిన విశిష్ఠ సాంప్రదాయ నృత్యాంజలితో తన ప్రదర్శన ప్రారంభించింది. ప్రతి అంశంలోనూ తన ప్రతిభను చాటుకుంది. ప్రధాన వర్ణం అంశంలో కరహరప్రియ రాగంలో తెన్మాడ నరసింహాచారి…
19న ప్రవాస నర్తకి విశిష్ఠ భరతనాట్యం
ప్రముఖ యువ నృత్య కళాకారిణి విశిష్ఠ డింగరి భరతనాట్య ప్రదర్శనతో నృత్యార్పణం చేయనున్నారు. ముంబయి కి చెందిన నృత్యోదయ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి లోని బ్రహ్మ కుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో విశిష్ఠ నృత్య ప్రదర్శన జరుగుతుందని ముంబయి నుంచి విచ్చేసిన ప్రఖ్యాత భరత నాట్య గురు డా. జయశ్రీ రాజగోపాలన్ గురువారం తెలిపారు. త్రిదండి చిన శ్రీమన్నారాయణ జీయరు స్వామి, ప్రముఖ నాట్య గురువు పద్మ విభూషణ్ డా. పద్మా సుబ్రహ్మణ్యం (చెన్నై), సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, కళారత్న అశోక్ గుర్జాలే తదితరులు పాల్గొంటారు. విశిష్ఠ డింగరి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి కాలిఫోర్నియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో వైపు గత 15 ఏళ్లుగా భరతనాట్యం, కూచిపూడి నృత్యం…