గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

Big boss Fame Gautham Krishna’s ‘Solo Boy’ Releasing on July 4th
Big boss Fame Gautham Krishna’s ‘Solo Boy’ Releasing on July 4th
Spread the love

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయనుంది. గతంలో ‘ఆకాశ వీధుల్లో’ చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి!
నటీనటులు – గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు
సాంకేతిక బృందం:
కాస్ట్యూమ్స్ – రిషిక, వీణాధరి
సినిమాటోగ్రఫీ – త్రిలోక్ సిద్ధు
సంగీతం – జుడా సంధ్య
కో-డైరెక్టర్ – కినోర్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – SK నయీమ్
లిరిక్ రైటర్స్ – శ్యామ్ కాసర్ల, పూర్ణా చారి, చైతన్య ప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి
కొరియోగ్రాఫర్: ఆటా సందీప్
బ్యానర్ – సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
నిర్మాత – సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం – పి. నవీన్ కుమార్
పి ఆర్ ఓ : మధు VR
డిజిటల్ : డిజిటల్ దుకాణం