తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బిగ్గర్ బ్లాక్ బస్టర్ ను అందించాడు. తెలుగు, హిందీలో తనదైన ముద్ర వేసిన సందీప్, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ‘యానిమల్’ తో సౌత్, నార్త్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందించనున్నాడు. భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా తో కలిసి టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో రణబీర్ కపూర్ మాన్ స్టర్ అవతార్ లో కనిపించారు. యానిమల్ సందీప్ రెడ్డి వంగా…
Author: M.D ABDUL - Tollywoodtimes
నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ గ్లింప్స్ విడుదల
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. ‘కస్టడీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12, 2023న విడుదలవుతోంది. గ్రాండ్ గా న్యూ ఇయర్ 2023కి స్వాగతం పలుకుతూ.. ఈరోజు మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్…
‘లవ్ రెడ్డి’ గ్లిమ్స్ విడుదల!
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్, బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర, కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గ్లిమ్స్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ… ‘లవ్ రెడ్డి’ గ్లిమ్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. నాకు కూడా ఒక లవ్ స్టొరీ చెయ్యాలని అనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూస్తుంటే, అందరూ యంగ్ టీమ్ కలిసి చేసున్న ఈ సినిమా…
19న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో అంజలి వెబ్ సిరీస్ ‘ఝాన్సీ సీజన్ 2’ స్ట్రీమింగ్
స్టార్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ఝాన్సీ’. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు. ‘ఝాన్సీ’ సీజన్ 2 జనవరి 19న స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆకట్టుకుంది. యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్…
ఫిబ్రవరి 3న రానున్న సందీప్ కిషన్ ‘మైఖేల్’
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మైఖేల్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్ పోస్టర్ లో ప్రధాన నటీనటులందరినీ రా, రస్టిక్ లుక్స్ లో ప్రజంట్ చేశారు. సందీప్ కిషన్ ముఖంపై గాయాలతో కనిపిస్తుండగా, విజయ్ సేతుపతి సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. గౌతమ్ మీనన్,…
బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ : సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ ఇంటర్వ్యూ…
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రిషి పంజాబీ మీడియాతో ‘వీరసింహారెడ్డి’ విశేషాలని పంచుకున్నారు. # కెమెరామెన్ గా సినిమాకి మొదటి ప్రేక్షకుడు మీరు.. ‘వీరసింహారెడ్డి’…
మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’కు యూ/ఎ సర్టిఫికేట్ .. జనవరి 13న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. పాటలు, ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అద్భుతంగా వున్నాయని, చిరంజీవి, రవితేజలని కలసి తెరపై చూడటం…
ఫిబ్రవరి 17న వస్తున్న విజువల్ వండర్ ‘శాకుంతలం’
అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాలను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం శాకుంతలం’. ఇండియన్ సినీ ప్రేక్షకులు 2023లో చూడాలనుకుని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న విజువల్ వండర్‌గా శాకుంతలం తనదైన ప్రత్యేకతను సంపాదించుకుంది. అందాల సుందరి సమంత ఇందులో టైటిల్ పాత్రలో నటించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రాని విధంగా ఈ పౌరాణిక ప్రేమగాథనున భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ సినిమాను రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమ కథ ఇది. ఇందులో శకుంతలగా సమంత..…
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి, ఓ బేబీ వంటి అనేక విజయాలను కలిగి ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది. నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే రెండు గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు.. టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప…
లాస్ ఏంజిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరవుతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌలి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ RRR. ఇంటర్నేషనల్ రేంజ్ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అదే క్రమంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు సాంగ్.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. RRR సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించి 2022లో చరణ్‌కు మంచి మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిలవటమే కాకుండా.. 2023 ప్రారంభానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి రామ్ చరణ్.. ఎస్.ఎస్.రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి…
