– సరికొత్త చరిత్రను సృష్టించిన RRR – అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి RRR (రౌద్రం రణం రుధిరం)…ఇద్దరు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. టాలీవుడ్ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై తిరుగులేని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపి వాహ్.. అనిపించింది. దాంతో ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ‘త్రిబుల్ ఆర్’ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ‘నాటు నాటు’ సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్ రావడం ఏషియాలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ‘త్రిబుల్ ఆర్’…
Author: M.D ABDUL - Tollywoodtimes
ఆకట్టుకుంటున్న ‘బుట్ట బొమ్మ’ చిత్రంలోని మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’
-అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట,అర్జున్ దాస్ నటిస్తున్న ‘బుట్ట బొమ్మ’ చిత్రం నుండి మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’ విడుదల -స్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్ పాత్రుడు రచించగా, మోహన భోగరాజు ఆలపించారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మోహన భోగరాజు ఆలపించిన ‘పేరు లేని ఊరులోకి’ అనే మొదటి పాట ఈరోజు విడుదలైంది. ఈ పాట మనకు మొబైల్ సంభాషణల ద్వారా ప్రధాన పాత్రధారులు క్రమంగా…
Peru leni Ooruloki, a catchy, free-spirited first single from Butta Bomma, starring Anikha Surendran, Surya Vashistta, launched
Written by Sanapati Bharadwaj Patrudu and sung by Mohana Bhogaraju, the number is composed by Sweekar Agasthi Sithara Entertainments, the leading production house in Telugu cinema, is collaborating with Fortune Four Cinemas for Butta Bomma, a feel-good rural drama. Anikha Surendran, Surya Vashistta and Arjun Das play the lead roles in the film directed by debutant Shourie Chandrasekhar Ramesh. The first single from the much-awaited drama, Peru leni Ooruloki, a foot-tapping number, sung by Mohana Bhogaraju and composed by Sweekar Agasthi, was launched today. The song introduces you to the…
‘వరల్డ్ ఆఫ్ శబరి’ – వరలక్ష్మీ శరత్ కుమార్ పాన్ ఇండియా సినిమా గ్లింప్స్ విడుదల
విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ… పాత్రకు తగ్గట్టుగా స్టైల్, యాక్టింగ్ మారుస్తున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ‘వరల్డ్ ఆఫ్ శబరి’ పేరుతో ఈ రోజు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సుమారు నిమిషం నిడివి కల వీడియోలో ‘శబరి’ థీమ్, మూడ్ ఎలా ఉంటుందనేది చూపించారు. ప్రకృతికి చిరుమానా లాంటి ఓ హిల్ స్టేషన్‌లో ఓ మహిళ. తన చిన్నారి కుమార్తెతో జీవిస్తుంటుంది. ‘మమ్మీ…’…
చిరంజీవి-బాలకృష్ణ ఇద్దరు లెజెండ్స్ తో కలసి నటించడం నా అదృష్టం: హీరోయిన్ శృతిహాసన్ ఇంటర్వ్యూ
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’.. ఈ…
‘జీ-2’ ని ఫ్రాంచైజ్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తాం ‘జీ-2’ ప్రీ విజన్ లాంచింగ్ లో హీరో అడివి శేష్
HIT-2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్ గా గూఢచారి సీక్వెల్ అయిన G2 ని ఇటివలే అనౌన్స్ చేశారు. గూఢచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రోజు నిర్వహించిన జి…
ఆస్కార్ 2023 కోసం షార్ట్ లిస్టయిన వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఈ ఏడాది ఆస్కార్ లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ కాకుండా, సంచలనాత్మక, వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌తో సహా మరో నాలుగు చిత్రాలు ఇందులో ఉన్నాయి. ది కాశ్మీర్ ఫైల్స్ జాబితాలోకి రావడం పట్ల దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కోసం TheAcademy చే షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఓటింగ్ కు అర్హత పొందింది. 300 చిత్రాలలో నామినేట్ చేయబడింది. జనవరి 12 నుంచి 17వ తేదీ మధ్య ఓటింగ్ జరగనుంది.” అని ట్వీట్ చేశారు. విడుదలైన తొలిరోజుల్లో సినిమాకు చాలా తక్కువ స్క్రీన్‌లు కేటాయించారు. అయితే, ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్…
షారుఖ్ – రామ్‌చరణ్ ట్విట్టర్ చాటర్‌తో ఫ్యాన్స్‌కి పండగే!
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్, గ్లామరస్ దివా దీపికా పదుకోన్ కలిసి నటించిన సినిమా పఠాన్. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. తన పఠాన్‌ని విడుదల చేసినందుకు రామ్‌చరణ్‌కి తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో కృతజ్ఞతలు చెప్పారు షారుఖ్. “థాంక్యూ సో మచ్. నా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు… దయచేసి నన్ను తాకనివ్వండి(మీ ట్రిపుల్ ఆర్ టీమ్ ఆస్కార్‌ని ఇంటికి తెచ్చినప్పుడు ఒక్కసారి నన్ను దానిని టచ్ చేయనివ్వండి) లవ్యూ“ అని ట్వీట్ చేశారు బాలీవుడ్ బాద్షా. షారుఖ్‌ఖాన్ – రామ్‌చరణ్ ట్విట్టర్ చాట్‌ని చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. షారుఖ్ ట్వీట్ కి తనదైన శైలిలో వినమ్రంగా సమాధానమిచ్చారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.…
మాస్ సినిమాలో కూడా కథ నుండే ట్యూన్ పుడుతుంది : ‘వీరసింహారెడ్డి’ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ ఇంటర్వ్యూ
గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి, మాస్ మొగుడు పాటలు ష్మాసింగ్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు థమన్ పంచుకున్న ‘వీరసింహారెడ్డి’ చిత్ర విశేషాలివి… ‘వీరసింహారెడ్డి’తో 2023ని బ్లాక్ బస్టర్ గా స్టార్ చేయబోతున్నారు.. ఎలా అనిపిస్తోంది ? -‘వీరసింహారెడ్డి’ కోసం…
మే12న ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ విడుదల
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్’. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. మెస్మరైజింగ్ విజువల్స్, ఇంటెన్స్ మ్యూజిక్ తో అలరించిన టీజర్ యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. హనుమంతుని గంభీరమైన విగ్రహాన్ని చూపించిన మొదటి షాట్ నుండి హిమాలయాలలోని ఒక గుహలో “రామ్.. రామ్..” అని జపిస్తూ శివలింగం ఎదుట హనుమంతుడు ధ్యానం చేస్తూ ప్రజంట్ చేసిన టీజర్ అద్భుతం అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు తమ దేశాల్లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌తో టచ్‌లో ఉన్నారు. హను మాన్ అవుట్ పుట్ హాలీవుడ్ స్థాయిలో వచ్చింది. టీజర్‌కి వచ్చిన రిసెప్షన్‌ను చూసి, చిత్ర నిర్మాతలు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అవును..…
