నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన… తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. ఇందులో ఆయనది పోలీస్ రోల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… బాయ్స్, ప్రేమిస్తే, యువసేన చిత్రాలతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు మీరు? మరి తెలుగు చిత్రాల్లో నటించడానికి ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు? భరత్: నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్. సో… అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. వరుసగా అవకాశాలు వచ్చాయి.…
Author: M.D ABDUL - Tollywoodtimes
రంగమార్తాండ నుండి రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ “నన్ను నన్నుగా” విడుదల !!!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. మెగస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ నన్ను నన్నుగా విడుదలయ్యింది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ఈ సాంగ్ లో నర్తించారు. మాస్ట్రో ఇళయరాజా తనదైన శైలిలో సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. ‘రంగమార్తాండ’ చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్,…
సస్పెన్స్ తో కూడిన ఇరట్ట ట్రైలర్ విడుదల !!!
జోజు జార్జి నటించిన ఇరట్ట సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే జోజు జార్జి రెండు విభిన్నమైన పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. వినోద్ , ప్రమోద్ అనే రెండు రోల్స్ లో జోజు జార్జి నటించారు. ఈ సినిమా ద్వారా ఎమ్.కె. కృష్ణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పు పాతు పప్పు మరియు సిజో వడకన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి స్టేట్ నేషనల్ అవార్డ లు సొంతం చేసుకున్న జోజు ఈ సినిమాలో మరో విభిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. జోజు మరియు అంజలితో పాటుగా శ్రీన్ద, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి, సబుమోన్ మరియు అభిరామ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.…
‘వారసుడు’ విజయంతో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది : వారసుడు సక్సెస్ టూర్(వైజాగ్) ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వారసుడు సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 14న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీ కలెక్షన్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ని నిర్వహించింది. సక్సెస్ టూర్ లో భాగంగా వైజాగ్ లో పర్యటించిన చిత్ర యూనిట్ అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించింది. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. విజయంతో పాటు గౌరవం రావాలనేది నా,…
‘రైటర్ పద్మభూషణ్’ మంచి హ్యుమర్, ఎమోషన్ వున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆశిష్ విద్యార్థి
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. రైటర్ పద్మభూషణ్ జర్నీ గురించి చెప్పండి ? మనం ఎక్కడో దూరంగా ఆలోచించి మన దగ్గరే వుండే సింపుల్ గా వుండే విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఛాయ్ బిస్కెట్ ప్రయాణం కూడా ఇలా సింపుల్ గా గానే మొదలైయింది.…
ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు ‘బుట్ట బొమ్మ’
మారిన ‘బుట్ట బొమ్మ’ విడుదల తేదీ గతేడాది డీజే టిల్లు, ఈ ఏడాది ‘బుట్ట బొమ్మ’ ఆలస్యాన్ని మరిపించేలా వినోదం కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ‘బుట్టబొమ్మ’ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. అయితే జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.…
‘Butta Bomma’ to release worldwide on February 4
Anikha Surendran, Surya Vashistta and Arjun Das starrer ‘Butta Bomma’ release date announced Sithara Entertainments, the leading production house that has backed several quality films in recent years, joins hands with Fortune Four Cinemas for a rural drama titled Butta Bomma. Anikha Surendran, Surya Vashistta and Arjun Das play the lead roles in the film directed by debutant Shourie Chandrasekhar Ramesh. Butta Bomma will hit screens across the globe on February 4, 2023. An intense poster featuring Anikha Surendran, Surya Vashistta and Arjun Das was unveiled to confirm the release…
‘Popcorn’: ‘Madhi Vihangamayye’ song is a picture of joy Sai Ronak, Avika Gor’s film to hit the screens on February 10
Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled ‘Popcorn’, directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed ‘Napolean’ and ‘Maa Oori Polimera’ fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The film is going to hit the screens on February 10. Recently, the film’s trailer was released at the hands of Akkineni…
ఫిబ్రవరి 10న అవికా గోర్ ‘పాప్ కార్న్’
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియన్, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించటం విశేషం. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బుధవారం రోజున ‘మది విహంగమయ్యే…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు హీరో నాగ చైతన్య. సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో…
‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది – అనిక సురేంద్రన్
ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘బుట్ట బొమ్మ’ అనే మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. బుట్టబొమ్మ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది? ఎన్నో…
