యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మళ్ళీ మళ్ళీ పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుడికారం ఉట్టిపడేట్లు రాసిన పదాలు…
Author: M.D ABDUL - Tollywoodtimes
ఏడిద శ్రీరాం & ఏడిద రాజాలకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ !!
వంశీ ఇంటర్నేషనల్ & వంశీ కల‌్చరల్ ,ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆద్వర్యంలొ శ్రీ శోభాక్రుత నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్ త్యగరాయ గాన సభలో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ప్రముఖ దర్సకుడు, కళా తపస్వి , దాదాసాహెబ్ పాల్కె అవర్ద్ గ్రహీత శ్రీ కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ , ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరావు కమారులు ఏడిద శ్రీరాం & ఏడిద రాజా లకు బహుకరించారు . శ్రీ వంశీ రామరాజు గారి ఆద్వర్యంలొ వైభవంగా జరిగిన ఈ వేడుకలకి రాష్త్ర ప్రభుత్వ సలహాదారు డా.కే.వి.రమణాచారి ముఖ్య అతిదిగా , అలాగే ప్రముఖ రచయత శ్రీ యండమూరి వీరేంద్రనాద్ మరో అతిథిగా వ్యవహిరిచారు. ఈ పురస్కారం అందుకున్న…
‘శాకుంతలం’ కోసం రూ.14 కోట్ల విలువైన నిజమైన బంగారం, వజ్రాలను ఉపయోగించాం.. ఇలా చేయటం ఇండియాలోనే ఇదే మొదటిసారి: గుణ శేఖర్
ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ప్లానింగ్ ప్రకారం చక చకా జరుగుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ లుక్‌ను ప్రముఖ…
ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం # NTR 30 ప్రారంభం : రాజమౌళి, ప్రశాంత్ నీల్ సహా హాజరైన సినీ సెలబ్రిటీలు
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ NTR 30. గురువారం (మార్చి 23) ఈ సినిమా గ్రాండ్ లెవల్లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ 30 లాంచింగ్ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్స్ ఎస్.ఎస్.రాజమౌళితో పాటు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, ఏషియన్ సునీల్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్, భరత్ చౌదరి, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి…
NTR, Janhvi Kapoor and Koratala Siva’s Pan Indian Biggie NTR 30 gets a star-studded launch; SS Rajamouli, Prasanth Neel and others attend*
The grand Muhurtham of NTR 30, the highly anticipated film starring the global star NTR and Bollywood beauty Janhvi Kapoor in lead roles, took place in Hyderabad today. Produced by Hari Krishna K and Mikkilineni Sudhakar under NTR arts and Yuva Sudha respectively. The film is presented by Nandamuri Kalyan Ram. The movie has been launched grandly with several special guests attending the occasion. Directed by Siva Koratala, the launch event saw the attendance of sensational directors SS Rajamouli and Prashanth Neel. Renowned producer Shyam Prasad Reddy, NTR, Janhvi Kapoor,…
‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ కి బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది : హీరో విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ…
డైనమిక్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు,దర్శకుడు,నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటించింది. ఉగాది కానుకగా నిన్న (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఎక్స్ టార్డినరీ ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ విశేషాలని విశ్వక్ సేన్ మీడియాతో పంచుకున్నారు. విశ్వక్ సేన్. ‘దాస్ కా ధమ్కీ’ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ? – ‘దాస్ కా ధమ్కీ’ మేము అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ అయ్యింది. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు…
‘బలగం’ టీమ్ కి ఉగాది నంది పురస్కారాలు
తెలుగు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన “బలగం” చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఎల్ వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని…
ఏ జీవిగా జన్మించినా నవ్వించే వరమివ్వమని దేవుణ్ణి కోరుకుంటాను: ఎఫ్.ఎన్.సి.సి. సన్మాన సభలో డా. బ్రహ్మానందం
2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎఫ్.ఎన్.సి.సి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేశారు. తొలుత ఎఫ్.ఎన్.సి.సి ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మరియు కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం నటరాజ్ మాస్టర్ నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు, వివిధ తెలుగు పండుగలను తెలియజేస్తూ చేసిన ప్రత్యేక నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వినోద్‌బాబు ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. అలాగే…
‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ టీజర్ విడుదల
వెండితెరపై ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. లవ్ స్టోరీలు అనేవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జానర్లు. యూత్ ఆడియెన్స్ ఎప్పుడూ కూడా లవ్ స్టోరీలను ఆదరిస్తూనే ఉంటారు. ఇప్పుడు ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అంటూ రాబోతోన్న ప్రేమ కథ మీద సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ అనే సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ మీద.. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీకి…
ప్రేక్షకుల ఆదరణలో ఉహించని విజయం ‘ఐరావతం’!!
ఉహించని విజయం ‘ఐరావతం’ ఒక వైట్ కెమెరా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చేసిన మేజిక్ ఐరావతం ద్విముఖం (పార్ట్2) తీయడానికి నాంది పలికింది. ఒక చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకుని 200 మిలియన్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ మినిట్స్ తో హాట్ స్టార్ తెలుగు లో ఇంకా ఆదరణలో ఉన్న చిత్రం “ఐరావతం”. ఇప్పటివరకు 200 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ దక్కించుకుని ప్రేక్షకుల ఆదరణ లోనే ఉంది. ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఐరావతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఊహించని ఆదరణ దక్కించుకుంది. ఇండియా లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి రీసెంట్ గా వచ్చి సైలెంట్ గా హిట్…
