గాలి ప్రత్యూష సమర్పణలో,శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “పరారీ”..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్నీ థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది..ఈ సందర్బంగా.. సీనియర్ నటులు సుమన్ మాట్లాడుతూ..ఎంతో కష్టపడి తీసిన నిర్మాత గిరి గారికి “పరారి” సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంటారు. అయితే యోగేష్ నటించిన…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘రావణాసుర’ మాములుగా వుండదు.. దద్దరిల్లుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ .. దర్శకుడితో మాంచి సింక్ లో వుండి ప్రతి సెట్ చాలా…
చిన్న సినిమాకి పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదములు : హీరో రాజ్ కార్తికేన్
చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ ఒక మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా…
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ `పోప్స్ ఎక్సార్సిస్ట్` ఏప్రిల్ 7న రాబోతుంది!!
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ది పోప్స్ ఎక్సార్సిస్ట్ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి జూలియస్ అవేరీ దర్శకత్వం వహించారు. అమెరికన్ అతీంద్రియ భయానక చిత్రం ఇది. పోప్ యొక్క భూతవైద్యుడు ఫాదర్ గాబ్రియెల్ అమోర్త్‌గా రస్సెల్ క్రోవ్ నటించారు. ఈ చిత్రంలో డేనియల్ జొవట్టో, అలెక్స్ ఎస్సో మరియు ఫ్రాంకో నీరో కూడా నటించారు. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. కథగా చెప్పాలంటే, తండ్రి గాబ్రియేల్ ఒక యువకుడిని భయంకరమైన పరిశోధనను ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడు వాటికన్ శతాబ్దాల నాటి కుట్రను వెలికితీస్తాడు. ఆ క్రమంలో ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటర్, దెయ్యం పట్టిన ఒకరిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అస్థిరమైన దెయ్యాల నివాసం, శతాబ్దాల నాటి రహస్యం వెనుక చాలా పెద్ద కుట్ర వెలుగులోకి…
తమిళ్ లో అదరగొడుతోన్న శింబు ‘పాతు తల’
క్రేజీ స్టార్ శింబు హీరోగా నటించిన సినిమా ‘పాతు తల’. ఒబెలి ఎన్ కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.రీసెంట్ గా మార్చ్ ౩౦న రిలీజ్ అయినా ఈ చిత్రం శింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. 2017లో కన్నడలో సూపర్ హిట్ అయినా మఫ్టీ చిత్రానికి రీమేక్ గ వచ్చిందీ చిత్రం. శింబు గెట్ అప్ తో పాటు నటనకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఏ జి రావణన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించాడు శింబు. మామూలుగా శింబు సినిమాలంటే తమిళనాట ఫ్యాన్ షోస్ ఉంటాయి. బట్ ఈ చిత్రానికి ఫ్యాన్ షోస్ లేకపోయినా.. వర్కింగ్ డే అయినా.. రెగ్యులర్ రేట్స్ తోనే అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ మూవీ. మొదటి రోజు 12.03 కోట్ల వసూళ్లు సాధించి…
Costume Krishna Passed Away : నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ ఇకలేరు!
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. గొప్ప నిర్మాత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణని కోల్పోయింది. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా చక్కటి గుర్తింపును తెచ్చుకున్న ఆయన అనారోగ్యంతో నేడు (ఏప్రిల్ 2, ఆదివారం) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా సినిమారంగంలో ప్రవేశించిన ఆయన అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు. జగపతి బాబు హీరోగా వచ్చిన ‘పెళ్ళిపందిరి’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని ‘అరుంధతి’…
‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ కు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సత్కారం!
“నాటు నాటు” పాటకు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన లిరిసిస్ట్ చంద్రబోస్‌గారిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ లయన్ డా.ప్రతానిరామకృష్ణగౌడ్ . ఈ సందర్భంగా దుబాయ్‌లో జరగనున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్‌గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దుబాయ్ వేదికపై అక్కడి దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా చంద్రబోస్ కి టిఎఫ్‌సిసి నంది అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “చంద్రబోస్‌గారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది.. నేను నిర్మించి దర్శకత్వం వహించిన జోడి నెంబర్.1, సర్దార్ పాపన్న మరియు అనేక చిత్రాలకు ఆయన సాహిత్యాన్ని అందించారు.. తన సాహిత్యంతో ఆస్కార్ గెలుచుకుని తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన చంద్రబోస్‌గారికి నా…
‘మీటర్’ థియేటర్ లో రఫ్ఫాడించేస్తుంది : దర్శకుడు రమేష్ కడూరి ఇంటర్వ్యూ…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు రమేష్ కడూరి ‘మీటర్’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు. # మీ నేపధ్యం గురించి చెప్పండి ? – మాది విజయనగరం జిల్లా గరివిడి…
‘శాకుంతలం’లోని మల్లికా మల్లికా వీడియో సాంగ్ విడుదల!
”శాకుంతలం సినిమా చూశాను. అత్యంత అద్భుతంగా అనిపించింది. ఆ క్షణం నుంచి వీడియో సాంగ్స్ విడుదల చేసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉంది. ఆ విషయాన్నే గుణశేఖర్‌గారితో పంచుకున్నాను. సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన పాట మల్లికా మల్లికా. ఈ పాటను వీడియోలో చూడటం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరికీ ఇప్పుడు మల్లికా మల్లికా వీడియో సాంగ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం” అని అన్నారు ప్రముఖ కథానాయిక సమంత. సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. గుణ టీమ్ వర్క్స్ నిర్మించింది. ఈ ఏప్రిల్ 14న విడుదల కానుంది శాకుంతలం. నీలిమ గుణ నిర్మాత. గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని… మల్లికా మల్లికా మాలతీ మాలికా చూడవా చూడవా ఏడినా ఏలికా, హంసికా హంసికా జాగులే…
సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా.. విడుదల
ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవసారి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఊరు పేరు భైరవకోన’ కోసం జతకట్టారు. ఫాంటసీ అడ్వంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తునారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఇదివరకే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్.. ఈ సినిమా కోసం ఒక ఫాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేశారని సూచించింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మేకర్స్ మొదటి సింగిల్ ‘నిజమే నే చెబుతున్నా’ విడుదల చేయడం ద్వారా మ్యూజికల్ జర్నీని ప్రారంభించారు. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన బ్రీజీ…
