హారర్ కామెడీ మూవీ ‘రుక్మిణి’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్

Horror comedy movie 'Rukmini' first look poster launch

నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియాంక, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా “రుక్మిణి”. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు న్యూ ఇయర్ డే సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా “రుక్మిణి” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. అనంతరం… నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – గంగాధర్ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం వంటి ఎన్నో హిట్ మూవీస్ కు మాతో వర్క్ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా “రుక్మిణి” సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అప్పుడైనా…

విడుదలకు ‘వశం’ సిద్ధం

'Vasham' ready for release

చేతన్, కావ్య, రాజీవ్ హీరో హీరోయిన్లుగా ఆలాపన స్టూడియోస్ సమర్పణలో కోన రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘వశం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా .. దర్శక, నిర్మాత కోన రమేష్ మాట్లాడుతూ .. సిటీ మరియు గిరిజన ప్రాంతంలో జరిగే కథ. సిటీలో పెరిగిన ఒక వ్యక్తి గిరిజన ప్రాంతంలోని అమ్మాయిని ఎంతగానో ప్రేమించి, చివరికి సీటీలోనే అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది? ఇంతకీ వాస్తవానికి ఏమి జరిగిందనే ఆసక్తికరమైన కథ. గిరిజన ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది . బెంగళూరు.. హైదరాబాద్‌లలో తదితర ప్రాంతాల్లో తెరకెకెక్కించాం. కాండ్రేగుల చందు, సలాపు మోహనరావు, కుబిరెడ్డి వెంకన్న దొర గార్ల సహకారం మరువలేనిది. వారి సంపూర్ణ సహకారంతో సినిమా చక్కగా తెరకెక్కింది. తెలుగు, కన్నడ భాషల్లో ఫిబ్రవరిలో భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.…

సెన్సార్ సూచనలతోనే ‘వనవీర’గా టైటిల్ మార్పు

Title changed to 'Vanaveera' following censor instructions

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వనవీర’. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘వనవీర’ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన “వనవీర” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో, డైరెక్టర్ అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ.. అన్ని నిబంధనల ప్రకారమే మా మూవీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాం.…

నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది : ‘పతంగ్‌’ దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి

My hard work has paid off: 'Patang' director Praneeth Pathipati

‘పతంగ్‌’ చిత్రం విషయంలో నాకు వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు సినిమాను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తుంది అంటున్నాడు దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి’. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘పతంగ్‌’.  ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.  ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా  , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. చిత్రం విడుదలై యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో చూసిన  వన్‌ఆఫ్‌ బెస్ట్‌ ఫిలిం అంటూ ప్రేక్షకులు ఈసినిమను అభినందిస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి మీడియాతో మాట్లాడారు.…

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జగపతి బాబు ఫస్ట్ లుక్

Jagapathi Babu's first look from Ram Charan's 'Peddhi'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గర్వంగా సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ‘పెద్ది’ ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించబోతోంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబును పరిచయం చేస్తూ చిత్ర బృందం ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.ఈ పోస్టర్‌లో జగపతి బాబు ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఇది సినిమాలోని…

‘సైక్ సిద్ధార్థ’ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు : నిర్మాత డి. సురేశ్ బాబు

'Psych Siddhartha' was presented in a very different way: Producer D. Suresh Babu

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన  సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 1న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత డి. సురేష్ బాబు…

ఫిల్మ్‌ ఛాంబర్‌ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు

Suresh Babu is the new president of the Film Chamber

* ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ హవా * ఉపాధ్యక్షులుగా నాగవంశీ, భరత్ చౌదరి * ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్‌, జనరల్‌ సెక్రటరీగా అశోక్‌ కుమార్ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో నిర్మాత సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో మన ప్యానల్‌ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్‌ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ ప్యానెల్‌ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్‌ నుంచి 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కోశాధికారిగా ముత్యాల రామదాసు, జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి గెలుపొందారు. తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌లో…

‘ఓ అందాల రాక్షసి’ అద్భుతమైన కంటెంట్‌తో జనవరి 2న రాబోతోంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో, దర్శకుడు షెరాజ్ మెహదీ

O Andala Rakshasi Arriving on January 2 promises Compelling Content: Hero & Director Sheraz Mehdi at Pre-Release Event

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రం జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. ఒక ఏడాదికి ఓ మంచి సినిమా వస్తుంది. అలాంటి ఓ మంచి సినిమానే మా ‘ఓ అందాల రాక్షసి’. ఇందులో కృతి వర్మ, విహాన్షి హెగ్డే,…

O Andala Rakshasi Arriving on January 2 promises Compelling Content: Hero & Director Sheraz Mehdi at Pre-Release Event

O Andala Rakshasi Arriving on January 2 promises Compelling Content: Hero & Director Sheraz Mehdi at Pre-Release Event

Sheraz Mehdi has been winning appreciation as a director, actor, music composer, and storyteller. He is now set to once again entertain as both hero and director with his upcoming film O Andala Rakshasi. The film stars Vihanshi Hegde and Kriti Verma as the female leads. Produced by Surinder Kaur under the Sky Is the Limit banner, O Andala Rakshasi is scheduled for a grand release on January 2. Ahead of the release, the film’s team held a pre-release event. Speaking at the event, Sheraz Mehdi said: “We are releasing…

‘45 ది మూవీ’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్

45 The Movie’ Will Captivate Everyone: Karunada Chakravarthy Shiva Rajkumar at the Pre-Release Event

తెలుగు వాళ్లు మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తారు.. ‘45 ది మూవీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రియల్ స్టార్ ఉపేంద్ర కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘వేద’ తరువాత మళ్లీ ‘45’ మూవీ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. నాలుగైదు నిమిషాల్లోనే అర్జున్ జన్య గారు అద్భుతంగా స్టోరీని నెరేట్…