ఈమధ్య కాలంలో హీరోయిన్ల పెళ్లి వార్తలు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. యంగ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు తన మనసులో మాట బయటపెట్టింది స్టార్ హీరోయిన్. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. సంక్రాంతికి వస్తున్నాం.. లక్కీ భాస్కర్, గుంటూరు కారం వంటి హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మీనాక్షీ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మీనాక్షీ చౌదరి నవీన్ పొలిశెట్టితో కలిసి నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. జనవరి 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మీనాక్షి ప్రమోషన్స్ కి వెళ్తుంటే.. అక్కడ పెళ్లికి సబంధించిన ప్రశ్నలు ఆమెకు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ రూమర్లపై మాట్లాడింది. ”నాపై ఇలాంటి పుకార్లు ఎలా సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నేను ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఎటువంటి పెళ్లి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ఎందుకు ప్రచారంచేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇవి నా కెరీర్ కు ఇబ్బందికరంగా మారాయి. అసలు నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు” అని మీనాక్షి చౌదరి తేల్చి చెప్పారు.
పెళ్ళి వార్తలన్నీ రూమర్సే : మీనాక్షి చౌదరి
