ఇండియాలో టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన ZEE5 ఈ వేసవికి ప్రేక్షకులను మెప్పించే యాక్షన్, థ్రిల్లర్, కామెడీ సినిమాలు, సిరీస్‌లతో మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోన్న సూపర్ హిట్ మూవీ ‘రాబిన్ హుడ్’ అందరినీ ఆకట్టుకుంటూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించింది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఓ వైపు టెలివిజన్‌లోనూ, ZEE5లోనూ మే10న ప్రీమియర్ అయిన సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌లో నిలిచి టాప్ చార్ట్‌లో నిలిచిన ఈ చిత్రం యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.
‘రాబిన్‌హుడ్’ కథ విషయానికి వస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ, తెలివైన యువకుడు. కొన్ని పరిస్థితుల కారణంగా తనొక రాబిన్‌హుడ్‌గా మారి ధనవంతుల నుంచి డబ్బను దొంగిలించి అవసరమైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యానికి రాజమైన వ్యక్తితో తలపడాల్సి వస్తుంది. తర్వాత ఏమౌతుంది.. కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేదే కథాంశం.
వెంకీ కుడుముల దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంకా రాజేంద్ర ప్రసాద్, షైన్ టామ్ చాకో, దేవ్ దత్త నాగె, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మాజీ ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో స్పెషల్ క్యామియో పాత్రలో నటించటం ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
* ZEE5లో ప్రత్యేకంగా అత్యంత వినోదాత్మక యాక్షన్-కామెడీ రాబిన్‌హుడ్‌ని చూసి ఎంజాయ్ చేయండి. నాణ్యమైన వినోదం కోసం మీ అంతిమ గమ్యస్థానమైన ZEE5లోని సినిమాలు, సిరీస్, షోస్‌ను అన్వేషించండి.
సూపర్ సమ్మర్ విన్నర్ : ZEE5లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకెళ్తోన్న ‘రాబిన్ హుడ్’
