మెగాస్టార్ ఇంట్లో ఘనంగా విజయోత్సవ వేడుక

A grand victory celebration at the Megastar's house
Spread the love

* హాజరైన వెంకటేష్, రామ్ చరణ్, అనిల్ రావిపూడి, చిత్ర యూనిట్
మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో అద్భుతమైన జోరును కొనసాగిస్తూ, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో మెగాస్టార్ ఇంట్లో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని, చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చి, ఆ సాయంత్రాన్ని సంక్రాంతి వేడుకల కొనసాగింపుగా మార్చారు. తారల సందడితో కూడిన వేడుకకు రామ్ చరణ్, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ వేడుకలు ఉత్సాహభరితమైన కేక్ కటింగ్ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి, అనంతరం చిత్ర బృందం అద్భుతమైన విందులో పాల్గొంది. నవ్వులు, కృతజ్ఞతలు, ఆత్మీయ సంభాషణలతో వేడుక కన్నుల పండగలా సాగింది. సినిమా ఘన విజయానికి కారణమైన ప్రతి సభ్యుడికి చిరంజీవి స్వయంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకను విజయోత్సవంగా మాత్రమే కాకుండా ముందస్తు భోగి, సంక్రాంతి సంబరాలుగా ఆనందంగా జరుపుకున్నారు. టీంలో కనిపించిన ఐక్యత, సినిమాకు లభిస్తున్న డ్రీమ్ రన్ కలిసి ఈ వేడుక మెగా మెమరబుల్ మూమెంట్ గా నిలిచింది.

Related posts