మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా ప్రదర్శించబడి అన్ని చోట్ల విజయదుంధిబి మోగించి బాక్సాఫీస్ ను ఒక్కసారి షేక్ చేసేసింది. ఈ సినిమా 2018లో విడుదలై ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరించింది. ఇక బయ్యర్లకు, సినిమా ప్రొడ్యూసర్లకు ఎంతగానో కాసులవర్షం కురిపించిన ‘రంగస్థలం’ ఇప్పుడు హిందీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మనీష్ షా ఈ సినిమాను ఉత్తారిదిన విడుదల చేయడానికి ముందుకొచ్చారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సారథ్యం వహించిన ‘రంగస్థలం’ మార్చి 30, 2018న విడుదలై, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో కమర్షల్ గా.. మాస్ హీరోగా అగ్రస్థానంలో ఉన్న స్టార్ హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక చెవిటివాడి పాత్రను పోషించి, ఇండస్ట్రీలో కమర్షల్ హీరోలు ఫాలో అవుతున్న రూట్ ను మార్చి.. మూస పద్ధతులను బద్దలు కొట్టారు చిట్టిబాబు పాత్రతో. ఇంకా ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ సమంత, విలక్షణనటులు జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ లాంటి గొప్ప నటీనటులు ఈ సినిమా ఘనవిజయంలో పాలుపంచుకొన్నారు. ఈ చిత్రంలోని రామ్ చరణ్ నటనతో పాటు ఆయన చెవిటివాడిగా పలికించిన హావభావాలకు ప్రేక్షకులందరు మంత్రముగ్దులు అయ్యారంటే, గ్రామీణ యువకుడిగా ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్, యాస నేర్చుకోవడానికి రామ్ చరణ్ ఎంత హోమ్ వర్క్ చేశారో తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాలో ఎక్కడ రామ్ చరణ్ కనిపించడు కేవలం చిట్టిబాబు తప్ప! తెలుగులో ఇంత ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకుల కోసం ఫిబ్రవరి 2022లో విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాని హిందీలో విడుదలచేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంతో నిర్మాత మనీష్ షా ముందుకు వచ్చారు. ఈ సినిమా కంటెంట్ బాగుండడంతో, ఈ డ్రై సమయంలో ఈ సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆదరిస్తారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రంగస్థలాన్ని హిందీలో విడుదలచేయడంతో తెలుగు నిర్మాతలకు కూడా కలిసొస్తుంది. ఎలాగో చరణ్ కు హిందీలో మార్కెట్ ఉండడంతో ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. అలాగే చరణ్ మార్కెట్ కూడా మరింత పెరుగుతుంది. ఇక RRR ప్రమోషన్స్ సమయంలో SS రాజమౌళి ఒక మాట అన్నారు. రామ్ చరణ్ సుకుమార్‌తో మరో ప్రాజెక్ట్ చెయబోతున్నట్లు, ఆ సినిమాలో చరణ్ ఇంట్రడక్షన్ సీన్ మాములుగా ఉండదన్నారు. ఇక ఈ సినిమా కూడా రంగస్థలం కన్న పెద్ద హిట్ అవుతుందని అన్నారు. సో.. ఎలాగో సుకుమార్ కూడా పాన్ ఇండియాలో అడుగుపెట్టారు కాబట్టి, ఏ విధంగా చూసినా ‘రంగస్థలం’ హిందీలో విడులవడం రామ్ చరణ్ కు కలిసొస్తుందనే చెప్పాలి.
రామ్ చరణ్ ‘రంగస్థలం’ హిందీలోకి అడుగుపెడుతోంది!
