తెలుగు సినిమాకు అపారమైన సేవలందించిన డి .వి .ఎస్ .రాజు : డిసెంబర్ 13న 94వ జయంతి

DVS Raju
Spread the love

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్ .డి .సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను , రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా “గాంధీ ” లాభాల్లో కొంత భాగాన్ని ఎన్ .ఎఫ్ .డి .సి అధ్యక్షుడుగా భారతీయ కార్మికుల నిధిని ఏర్పాటు చెయ్యడంలోను రాజు గారు కీలకమైన భూమిక పోషించారు .

రాజుగా గారు సినిమా నిర్మాణం చేస్తూనే సినిమా రంగ సంస్థలను బలోపేతం చెయ్యడంలో విశేషమైన కృషి చేశారు . 1950 లో మహానటుడు ఎన్ .టి .రామారావు గారితో పరిచయం రాజు గారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది . రాజు గారిని తన భాగస్వామిగా చేసుకొని నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థలో ఎన్ .టి .ఆర్ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు . 1960లో రాజు గారు డి .వి .ఎస్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు . అయినా రాజు గారితో రామారావు గారి మైత్రీ బంధం కొనసాగింది .

చైనా యుద్ధం , రాయలసీమ కరువు , దివిసీమ ఉప్పెన లాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎన్ .టి .రామారావు నాయకత్వంలో ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమాలను రాజు గారే సమన్వయము చేసేవారు . 1983లో రామారావు ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన తరువాత రాజు గారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థకు అధ్యక్షుడుగా నియమించారు . తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకురావడంలో, 1986 లో ఫిల్మోత్సవ్ కోసం పబ్లిక్ గార్డెన్ లో 90 రోజుల్లో లలిత కళాతోరణం నిర్మాణం కావడంలో , అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించడంలో రాజు గారి పాత్ర అనన్య సామాన్యము.

ఫిలిం నగర్ సోసిటీ , చలన చిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, ఎఫ్ .డి .సి, ఎన్ .ఎఫ్ .డి .సి , ఫిలిం ఫెడరేషన్ , ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మొదలైన సంస్థల అభివృద్ధిలో రాజు గారి కృషి ఎంతో వుంది.

రాజు గారి నిస్వార్ధ సేవ, అంకిత భావం , అవిరళ కృషి ని గుర్తించిన భారత ప్రభుత్వం 2001వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది .
రాజు గారు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆరోగ్యకరమైన , సందేశాత్మక చిత్రాలను రూపొందించారు.

డిసెంబర్ 13 , 1928న తూర్పు గోదావరి జిల్లా అల్లవరం జన్మించారు . నవంబర్ 13 2010లో భౌతికంగా మనకు దూరమయ్యారు .
తెలుగు సినిమా రంగంలో డి .వి .ఎస్ .రాజు గారు ప్రాతః కాల స్మరణీయులే !

Related posts

Leave a Comment