ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ కి త్రిబుల్ ఆర్ ఫివర్ పట్టేసింది.ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచి టీమ్ కూడా ప్రమోషన్ లో బిజీ అయింది. ఈ చిత్రానికి సంబంధించి పాన్ ఇండీయా లెవల్లో అన్ని భాషల్లో ప్రమోషన్ల జోరు ఊపందుకుంది. ఇక పోతే ఈ సినిమా జనవరీ 7న రిలీజ్ అవుతుండగా.. నెల రోజులు ముందునుంచే ప్రమోషన్లు స్టార్ట్ చేయడం అనేది దర్శకధీరుడు జక్కన్న వ్యూహంలో భాగమేనట. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. మొదటి సారిగా ఇద్దరు బడా స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ‘త్రిబుల్ ఆర్’ పాన్ ఇండియా మూవీ కావడంతో, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ వార్ నడుస్తుందని సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అవి నిజమే అన్నట్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ.. వైరల్ చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం విమర్శకులు కూడా మిశ్రమంగా స్పందిస్తున్నారు. నిప్పులేనిదే పోగరాదు అని కొన్ని వర్గాలు అంటే, కావాలని నిప్పు రాజేస్తున్నారని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే విషయంపై సీనియర్ సినిమా క్రిటిక్స్ ఘాటుగానే స్పందిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, అక్కినేని చేసిన గుండమ్మ కథ, ఎన్టీఆర్ – నటశేఖర కృష్ణ కలిసి చేసిన ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అదే తరహాలో విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు ‘సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’, అలాగే వెంకటేష్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’లాంటి సినిమాలను ప్రేక్షకుల కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
ఇప్పుడు మల్టీస్టారర్ గా ఇద్దరు రియల్ హీరోల కథతో వస్తున్న ఈ త్రిబుల్ ఆర్ సినిమా.. ట్రైలర్లో ఇద్దరి హీరోలను ఎక్కడా తగ్గించకుండా చూపెట్టారు కెఫ్టెన్ ఆఫ్ ది షిప్ జక్కన్న. ఈ ఇద్దరి స్టార్లకు విపరీతంగా ఫ్యాన్స్ ఉండడంతో ఎవరి హీరోలను వారు పుష్ చేసుకోవడం, వారి హీరోల కోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోవడం మాములుగా జరిగే పనే.. ఇంత దానికి ఫ్యాన్ వార్ అని టైటిల్స్ పెట్టేసి హడావిడి చేయడం చూస్తుంటే నవ్వుకొని వదిలెయ్యాలే కానీ ఎవరు సీరియస్ గా తీసుకోకూ డదు. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఇద్దరు హీరోలు కలిసి కష్టపడి నటించింది.. ప్రేక్షకులతో పాటు సినిమా లవర్స్ ని మెప్పించడానికే. కానీ, ఇలా ఫ్యాన్ వార్ చేసుకోవడానికో.. అభిమానుల మధ్య బేదాభిప్రాయాలు తేవడానికి కాదు కదా.
ఇక ఈరోజు హైదరాబాద్ జరిగిన ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ప్రెస్ మీట్ లో రామ్ చరణ్, తారక్ ల అల్లరి చూస్తే అర్థమవుతోంది. వారు ఎంత హెల్దీ రిలేషన్ షిప్ లో ఉన్నారో, ఎంత సరదాగా ఉన్నారో..!
సో.. ఆల్ చర్రీ అండ్ తారక్ ఫ్యాన్స్ ఇవేవి హార్ట్ కు తీసుకోకుండా ఏంచక్క ప్రమోషన్లను ఎంజాయ్ చేస్తూ.. సినిమా అయ్యేదాకా వెయిట్ చేయండి.